Home » » Agent Narasimha 117 Review

Agent Narasimha 117 Review

 చిత్రం: ఏజెంట్‌ నరసింహ 117





రేటింగ్: 3/5

తారాగణం: కీర్తి కృష్ణ – హీరో,నిఖిత,మధుబాల , షాయాజీ షిండే, ప్రదీప్ రావత్,

దేవ్ గిల్, నరసింహ, దయ, గబ్బర్ సింగ్ టీం, తదితరులు

కెమెరా: స్వర్గీయ జయరాం (పెళ్లి సందడి ఫెమ్)

సంగీతం: రాజ్ కిరణ్

ఎడిటింగ్: మేనేజ్ శ్రీను

నిర్మాత: బి. నరసింహా రెడ్డి

కథ, నిర్మాత – బి. నరసింహ రెడ్డి

దర్శకత్వం – లక్ష్మణ్ చాప్రాల

విడుదల తేదీ: 31 మార్చి 2023


 


ఏజెంట్‌ నరసింహ 117′ లాంటి వినోదాత్మక చిత్రాన్ని అందించిన దర్శకుడు లక్ష్మణ్ చాప్రాల. ఈ సినిమా ఆసక్తికరంగా మలిచారుకథలోకి వెళ్తే ఒక మంచి కథని ఎంచుకొని . ఆసక్తికరంగా తీశారు.నవ్య సాయి ఫిలిం బ్యానర్ పై బి నరసింహారెడ్డి నిర్మించిన చిత్రం, “ఏజెంట్ నరసింహ 117” ఈ చిత్రంలో కీర్తి కృష్ణ హీరోగా, నరసింహారెడ్డి మరొక హీరోగా, నికిత ఒక హీరోయిన్ గా, మధుబాల మరొక హీరోయిన్లుగా నటించారు. ఇందులో విలన్ గా ప్రదీప్ రావత్ దేవుగిల్ ,దయా నటించారు.జమీందార్ గా షియాజి షిండే నటించారు. ఇక ఈ సినిమా కథ ఏమిటో ఒకసారి చూద్దాం. షియాజ్ షిండే ఒక జమిందారు. అతని వద్ద తన బామ్మర్ది పనిచేస్తూ ఉంటాడు.అతని ఇంట్లో ఒక మహిమగల ఆహారం ఉంటుంది. ఆ ఆహారం ఎలాగైనా దొంగలించాలని తన బావమరిది అనుకుంటాడు. ఒకరోజు షియాజి షిండే భార్య గుడికి వెళుతుండగా, ఆవిడను కిడ్నాప్ చేసి ఆ హారం దొంగలించాలని పథకం వేశాడు. ఇక ఆవిడ గుడికి వెళ్లు తుండగా, తన రౌడీ మూకలు ఆవిడ వెంట పడతారు. ఆవిడ పరిగెత్తుకుంటూ ..వెళ్లి ఒక పూజారి దేవుడి కోసం నీళ్లు పట్టుకుని వస్తుంటే, ఆ బిందెలో హా రం వేస్తుంది. ఆ తర్వాత ఆవిడ పారిపోతుంటే, వాళ్ళు పట్టుకొని ఆవిడను తెచ్చి ఒక బూత్ బంగ్లాలో బంధించి ఉంచుతారు. ఎంత అడిగినా ఆవిడ చెప్పదు. ఆహారం గురించి తెలుసుకోవాలని ఆవిడను అక్కడే బంధిస్తారు.తన కొడుకు దెవుగిల్ చాలా మూర్ఖుడు. కనిపించిన అమ్మాయిలు అందరినీ బంధించి తన కోరిక తీర్చుకుంటాడు. ఇక అతనికి ఎవరు ఎదురు చెప్పకుండా ఉంటారు.అనుభవించిన తరువాత వాళ్లను చంపి దెయ్యం చంపిందని ప్రచారం చేస్తాడు. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ బంగ్లాలో ఏం జరుగుతుంది? చాలామంది ఎందుకు చనిపోతున్నారు? అందరూ దయ్యం చంపుతుంది అంటున్నారు! అది ఏంటో ఆరా తీయాలని ఏజెంట్ రజనీకాంత్ ను నియమిస్తారు. ఇక ఏజెంట్ రజనీకాంత్ ఆ పని మీద ఆ బంగ్లా దగ్గరికి వచ్చి, ఆ రహస్యాలను చేదించే ప్రయత్నం చేస్తుంటాడు. మరో ప్రక్క కాలేజీలో డ్రగ్స్ ముఠా వ్యాపారం జరుగుతుంటుంది. విద్యార్థులందరికీ డ్రగ్స్ సరఫరా చేస్తూ వాళ్ళందర్నీ డ్రగ్స్ కు బానిసలు చేస్తూ ఉంటారు. మరొక హీరో కీర్తి కృష్ణ అవన్నీ చూసి వాళ్లను అడ్డుకుంటాడు. వాళ్ళ మధ్యలో పోరాటం జరుగుతుంటుంది. అదే కాలేజీలో షియాజి షిండే కూతురు చదువుకుంటూ ఉంటుంది.హిరో ఆవిడను ప్రేమిస్తాడు. కానీ, ఆవిడ అందుకు ససేమిరా అంటుంది. అతను ఒకసారి ఆమెకు తన గురించి చెప్పిన నమ్మదు. ఒకరోజు నిఖిత టూర్ కోసం వస్తుంది. అక్కడే అదే బంగ్లా దగ్గర వాళ్లు దిగుతారు. అయితే హీరో కూడా అక్కడికి వస్తాడు. దేవుగిల్ హీరోయిన్ ఎటాక్ చేసి అనుభవించాలని అనుకుంటాడు. హిరో వచ్చేసి అడ్డుకుంటాడు. ఈలోపు హీరోయిన్ కి అతని మీద ప్రేమ కలుగుతుంది. ఏజెంట్గా నటిస్తున్న నరసింహ రజనీకాంత్ తను ఆ పల్లెటూర్లో ఉన్న మధుబాల అనే అమ్మాయి అతనిపై ఇష్టపడుతుంది ఇక ఆవిడ కూడా నరసింహను ప్రేమిస్తూ ఉంటుంది. ఏజెంట్గా నటించిన నరసింహ ఆవిడతో ప్రేమ పాటలు పాడుతుంటాడు మంచి డ్యూయెట్ సాంగ్ లు ఉన్నాయి .అలాగే ఐటెం సాంగ్ కూడా ఉంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని ఏజెంట్ ఆరా తీసి అందరినీ లాస్టుకు పట్టుకొని, ఇది దయ్యం పని కాదు? ఇతనే అని చెప్పేసి, అది చేదిస్తాడు భారీ ఫైట్ ఆ తరువాత ఆ పూజారి దగ్గర ఉన్న ఆహారం మళ్లీ తీసుకుంటారు. ఆహారం మహిమతో వాళ్ళందరూ కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటారు .ఇక ఆ తర్వాత ఆ బంగ్లాలో ఉన్న ఆవిడను క్షేమంగా తీసుకొని వస్తారు ఇక ఏజెంట్ వాళ్లందర్నీ రక్షించి వాళ్లకు ప్రభుత్వానికి దొంగలను అప్పగిస్తాడు. ఇందులో అందరూ ఎవరి పాత్ర మేరకు వారు చక్కగా చేశారు. డిఐ చాలా చక్కగా ఉంది. ఇక కెమెరా జయరామ్ చేశారు. ఫైవ్ టు దేవరాజు మిగతా వాళ్ళందరూ బాగా చేశారు. సినిమా ఇప్పుడు మంచి టాక్ తెచ్చుకుంది. బహుశా కాస్త పబ్లిసిటీ పెంచుకుంటే? ఇంకా సినిమా ఓ రేంజ్ లో ఆడేలా ఉంది. ఇక నిర్మాత కొంచెం పబ్లిసిటీ పెంచుకునే లాగా చూస్తాడని అనుకుందాం. సంగీతం మాత్రం పర్వాలేదు అని చెప్పాలి. ఏ ట్యూన్ కూడా మనసుకు పర్వాలేదు అనిపించింది . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల పర్వాలేదనిపించినా ఎక్కువ శాతం అత్యంత సాధారణంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. కెమెరావర్క్ వగైరాలు ఓకే. హీరో తన పాత్రలో ఒదిగిపోయాడు. అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటూనే తను మాస్ హీరో అని గుర్తు చెయ్యాలన్నట్టుగా అవసరం లేని ఫైట్లు అవి చేసాడు. పూర్తిగా ఫార్ములాకి కట్టుబడి ఉంటే సినిమా వేరే లా ఉండేది. హీరోయిన్స్ అందరూ బాగానే చేశారు పర్వాలేదు. కమర్షియల్ గా హిట్టయ్యే లక్షణాలుఎక్కువగా పాయింట్ పరంగా మంచి సినిమా అనిపించుకునే విధంగా ఉంది. ఎంచుకున్న పాయింట్, రాసుకున్న విధానం బాగుంది. లక్ష్మణ్ చాపరాల చిత్రాన్ని చాలా చక్కగా తీర్చి దిద్దారు. ఎక్కడా బోర్ లేకుండా తన దర్శకత్వ ప్రతిభ కనబరిచినాడు. బ్యాగ్రవండ్ స్కోర్ బాగుంది.కెమెరా పనితనం బాగుంది. తారాగణం ,కీర్తి కృష్ణ,నరసింహ రెడ్డి,నిఖిత, మధుబాల, షియాజీ షిండే, ప్రదీప్ రావత్ దేవ్ గిల్ మొదలగు వారు నటించారు.


బాటం లైన్: ఏజెంట్ సినిమాలు ఇష్టపడే వాళ్ల్లు తప్పక చూడలిసిన చిత్రం.


Share this article :