Home » » Art Director Avinash Kolla Interview About Dasara

Art Director Avinash Kolla Interview About Dasara

‘దసరా’ కోసం 22 ఎకరాల్లో ఓ విలేజ్ ని నేచురల్ గా క్రియేట్ చేశాం. దసరా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లానేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. తాజాగా విడుదలైన ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన అవినాష్ కొల్లా  విలేఖరుల సమావేశంలో ‘దసరా’ విశేషాలని పంచుకున్నారు.


నాని గారితో కృష్ణగాడి వీర ప్రేమగాధ, జర్సీ, శ్యామ్ సింగారాయ్ లాంటి సినిమాలు చేశారు.. కానీ ‘దసరా’ వాటికి పూర్తిగా భిన్నంగా రస్టిక్ వుంది. ఈ జర్నీ గురించి చెప్పండి?


దసరా కథా నేపధ్యం పూర్తిగా భిన్నమైనది. తెలంగాణలోకి ఒక ఊరికి సబంధించిన కల్చర్, అలవాట్లు, కట్టుబాట్లు వుంటాయి. ఆ ఊరికి కోల్ మైన్ దగ్గరగా వుండటం వలన పెద్దపెద్ద వాహనాలు ఊరి నుంచే వెళ్తాయి. దాని కారణంగా సహజంగానే రస్టిక్ టోన్ వచ్చింది.

నాని గారితో జర్నీ చాలా బావుంది. నాకు పేరు వచ్చే కంటెంట్ వున్న సినిమాలు నాని గారి వలనే వచ్చాయి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నా వంతు న్యాయం చేస్తున్నాను. నాని గారి ఇదివరకు సినిమాలతో పోల్చుకుంటే దసరా చాలా డిఫరెంట్ మూవీ. కల్చరర్ గా ఒక పాతికేళ్ళ క్రితం నాటి ఊరు ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా కథకు విధమైన ఊరు కావాలి. దాని కోసం అడవి లాంటి ఒక ఖాళీ ప్రదేశం తీసుకొని భారీ విలేజ్ సెట్ వేశాం. ఇల్లు, స్కూల్, ఒక మైదానం, బార్ ఇలా ఒక ఐదు వందల మంది నివసించే గ్రామాన్ని నేచురల్ గా క్రియేట్ చేశాం. 98 శాతం షూటింగ్ సెట్ లోనే జరిగింది.


దిని కోసం ఏమైనా రిఫరెన్స్ లు తీసుకున్నారా ?

ఈ గ్రామనికి ఆల్రెడీ గోదారి ఖని రిఫరెన్స్ వుంది. లైవ్ లోకేషన్స్ లో తిరిగాం. కానీ కథకి  ఒక ప్లేస్ మెంట్ ముఖ్యం. రియల్ టైం ఎక్కడికి వెళ్ళిన మనకి కావాల్సినట్లు వుండదు. దానితో పాటు కంఫర్ట్ బుల్ గా షూట్ చేసుకోలేం. అన్ని రోజుల అవుట్ డోర్ లో షూట్ చేయడం అంటే బడ్జెట్ కంట్రోల్ కష్టం కాబట్టి సెట్ కి వెళ్ళాం.


దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తో పని చేయడం ఎలా అనిపించింది ?

శ్రీకాంత్ ది తెలంగాణ నేపధ్యం. తన ఊరు గురించే కథ రాసుకున్నాడు. తొలిసారి దర్శకత్వం చేస్తున్నప్పటికీ అన్ని విషయాలపై చాలా క్లారిటీ వుంటుంది. తన కథకి ఏం కావాలో అతనికి చాలా బాగా తెలుసు. కథ చెప్పినప్పుడే ట్రైలర్ కట్ ఎలా వుంటుందో అతని తెలుసు. అంత క్లారిటీ వున్న దర్శకుడు.


సెట్ లో మీరు ఎదురుకొన్న సవాల్ ఏంటి ?

ఊరు సెట్ అనగానే బేసిగ్గా ఈస్ట్ వెస్ట్ ఆంధ్ర రిఫరెన్స్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ థిన్ లైన్ వుంది. ఇంటిపై వేసే పెంకులో కూడా ఆంధ్రకి తెలంగాణకి తేడా వుంటుంది. అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాం. వర్కింగ్ డేస్ ఎక్కువ కాబట్టి సిమెంట్ స్టోన్స్ విండోలు తలుపులు ఏవీ డమ్మి లేకుండా నేచురల్ గా కలెక్ట్ చేయడానికి చాలా సమయం పట్టింది. మైనింగ్ కి చుట్టుపక్కల వున్న గ్రామాల్లో ఎలాంటి వాతావరణం వుంటుందో అదే వాతవరణాన్ని చాలా సహజంగా క్రియేట్ చేశాం. ఇందులో ఒక పెద్ద బంగ్లా వుంటుంది. అందులో ఒకొక్క దర్వాజనే మూడు లక్షలు పెట్టి కొన్నాం. చాలా ఆసక్తికరమైన ఎలిమెంట్స్ వుంటాయి.


98 శాతం షూటింగ్ సెట్ లోనే జరిగింది కదా.. దాదాపు వందరోజులు షూటింగ్.. ఇలాంటప్పుడు మీ ప్రిపరేష్ ఎలా వుంటుంది ? బడ్జెట్ ఎంత అయ్యిండొచ్చు ?

ఒక కొత్త దర్శకుడికి ఇంత మంచి స్పెషిలిటీ ఇవ్వడం నిర్మాతల గొప్పదనం. ఈ కథ అంత గ్రాండ్ నెస్ ని కోరుతుంది. ఇంత మంచి కథకి ఖర్చు చేయడం అవసరమే. డెబ్బై శాతం సినిమా ఎక్స్ టిరియర్ లో వుంటుంది. నేచురల్ లొకేషన్ లో రస్టిక్ టోన్ అచీవ్ చేయడం కష్టం. అందుకే సెట్ కి వెళ్లాం. కథ పరంగా ఇది సరైన నిర్ణయమే. కథని బలంగా నమ్మి నిర్మాతలు చాలా ఆనందంగానే ఖర్చు పెట్టారు.


ప్రిప్రొడక్షన్ కి ఎన్ని రోజులు పట్టింది ?

గత ఏడాది నవంబర్ లో స్టార్ చేశాను. నవంబర్ అంతా క్లీన్ చేయడానికే సరిపోయింది. పక్కన స్నేక్ ఫారెస్ట్ . దీంతో పాములు బెడద వుండేది. సెట్ లో చల్లదనం కోసం పాములువచ్చి వుండేవి. పైగా రాత్రుల్లో ఎక్కువ షూటింగ్ వుండేది. మొత్తం సెట్ వేయడానికి రెండున్న నెలలు పట్టింది. దాదాపు 800 పైగా పని చేశారు. బుల్ డూజర్, క్రెయిన్ ఎప్పుడూ సెట్ లో వుండేది. దాదాపు 22 ఎకరాల్లో సెట్ వేశాం. ట్రైన్ సీక్వెన్స్ కూడా అక్కడే వేశాం. ప్రొడక్షన్ వైజ్ గా చాలా కలిసొచ్చింది.


మీ ఆర్ట్ వర్క్ పై నాని గారు ఇచ్చిన కాంప్లిమెంట్  ?

నాని గారితో తరచుగా మాట్లాడుతూనే వుంటాం. అయితే సెట్ లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. సెట్ లో ప్రతి రోజు మూడు వందల మంది వుండేవారు. ఫస్ట్ షెడ్యుల్ అయ్యేవరకూ అది సెట్ అని ఆ మూడు వందల మందికి తెలీదు. సెట్ మొత్తం రెడీ అయ్యాకా ఎలక్ట్రసిటీ బోర్డ్ వాళ్ళు వచ్చి బోర్డ్ లేకుండా కరెంట్ ఎలా వాడేస్తున్నారు ? అని ప్రశ్నించారు. మాకు కరెంట్ అక్కర్లేదు.. జనరేటర్ తో నడిపిస్తామని చెప్పాం. మరి కరెంట్ తీగలు వున్నాయి.. మీటర్ ఎక్కడో చెప్పండని దాదాపు అరగంట చర్చ నడిచింది. ఇది సెట్ అని చెబితే ఎంతకీ నమ్మలేదు.(నవ్వుతూ)


కొత్తగా చేయబోతున్న సినిమాలు  ?

శంకర్- రామ్ చరణ్ గారి సినిమా, నాని 30 , ఏజెంట్ సినిమాలు జరుగుతున్నాయి.


ఆల్ ది బెస్ట్

థాంక్స్Share this article :