CAT movie FirstLook Launched by PEDDI Director Buchi Babu Sana

CAT ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు 

VRGR మూవీస్ బ్యానర్ పై Y. గంగాధర్ IPS సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు G.V. నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం " CAT ".... ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఇప్పుడే CAT మూవీ పోస్టర్ లాంచ్ చేసాము, దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, CAT స్టోరీ కూడా చెప్పారు. వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, త్వరలొ విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. 

దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి CAT చిత్ర విజయం పొందాలని బుచ్చి బాబు ఆకాంక్షించారు. డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో G.V. నాయుడు , V.J. బాలు , లావణ్య , కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ :- పంకజ్ తొట్టాడ   

ఎడిటింగ్ :- D.వెంకటప్రభు  

మ్యూజిక్ :- మారుతి రాజా    

కథ, స్క్రీన్ ప్లే, మాటలు :- V.CH. శేఖర్ ముద్దు   

దర్శకత్వం :- G.V. నాయుడు (గొంగటి వీరాంజనేయులు)

Post a Comment

Previous Post Next Post