నాయిక మీనాక్షి గోస్వామి బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపిన "వారాహి" చిత్రబృందం
వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా
మాతృమూర్తుల్లో వారాహి ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి
అమ్మ వారి ఆలయ నేపథ్యంతో సుమంత్ హీరోగా వారాహి చిత్రాన్ని
రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. వీరి కాంబినేషన్ లో గతంలో
సుబ్రహ్మణ్యపురం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించిన
నేపథ్యంలో సుమంత్, సంతోష్ జాగర్లపూడి కొత్త చిత్రం వారాహిపై ఆసక్తి ఏర్పుడుతోంది.
ఈ చిత్రంలో నాయికగా రాజస్థానీ ముద్దుగుమ్మ మీనాక్షి గోస్వామి నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సెలబ్రేషన్స్ ను వారాహి చిత్ర బృందం జరిపింది. దర్శకుడు సంతోష్, హీరో సుమంత్, నిర్మాతలు ఆమెకు బర్త్ డే విశెస్ తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
సత్యసాయి శ్రీనివాస్, గెటప్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ఈశ్వర్ చంద్. ఈ సినిమాలోని ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Post a Comment