Home » » Jaipur foot US Camp begins

Jaipur foot US Camp begins

జైపూర్ పుట్ యూఎస్ క్యాంప్ ప్రారంభం

హైటెక్ సిటీలోని పీపుల్స్ టెక్ ప్రాంగణంలో ప్రారంభించిన కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాలహాజరైన స్టార్ యాంక్ సుమ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి మందికిపైగా ఉచితంగా జైపూర్ ఫుట్స్ ను అందిస్తామని వెల్లడి


హైదరాబాద్ః అనుకోని ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులుగా మారిన వారికి చేయూతనిచ్చేందుకు జైపూర్ ఫుట్ యూఎస్ సంస్థ ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి మందికిపైగా వికలాంగులకు ఉచితంగా జైపూర్ ఫూట్, లింబ్స్ అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో పీపుల్ టెక్ సంస్థ అధినేత విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్, జైపూర్ ఫూట్ యూఎస్ఏ, భగవత్ మహవీర్ వికలాంగ సహాయ సమితి, జైపూర్ ఇండియా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్స్ టెక్, ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థలు చేపట్టిన జైపూర్ ఫుట్ క్యాంపును కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాల లాంఛనంగా ప్రారంభించారు. జైపూర్ యూఎస్ వ్యవస్థాపకులు ప్రేమ్ బండారీతోపాటు ప్రముఖ వ్యాఖ్యాత,ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుమ కనకాల, అవినాష్ రాయ్, ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అతిథులుగా హాజరై దివ్యాంగులకు తమ సంస్థల ద్వారా అందే సహకారాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ బండారీ చేయి కోల్పోయిన ఓ చిన్నారికి ఆర్టిఫిషియల్ లింబు కోసం వచ్చేందుకు రవాణా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150మందికిపైగా వికలాంగుల వివరాలను నమోదు చేసుకొని వారందరికి ఆర్టిఫిషియల్ జైపూర్ ఫుట్స్ ను అందించనున్నారు. 

ఈ సందర్భంగా పీపుల్ టెక్స్ సంస్థ అధినేత విశ్వప్రసాద్ మాట్లాడుతూ...

రాందాస్ అత్వాలగారికి నా కృతజ్ఞతలు. అలాగే జైపూర్ యూఎస్ఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులకు కూడా నా ధన్యవాదాలు. మీరందరు ఒక మంచి పని కోసం తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 

హైదరాబాద్, తిరుపతి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతాం. 

వ్యాఖ్యాత సుమ మాట్లాడుతూ... త్వరలోనే తెలంగాణే కాదు దేశం కూడా డిసెబులిటీ, స్పెషల్ ఏబుల్డ్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారుతుంది. దివ్యాంగులైనా ప్రతి ఒక్కరు గౌరవంగా జీవించే హక్కు ఉంది. అంకుర్, అలోక్, ఎఫ్ఐఏలు చేస్తున్న కృషి చాలా గొప్పది. చాలా మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ దొరకడం కష్టం. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఉచితంగా వాళ్లకు ఆర్టిఫిషియల్ జైపూర్ పుట్స్ ఇస్తున్నందుకు అందరి తరపున ఎఫ్ ఐఏకు నా కృతజ్ఞతలు. 


కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల మాట్లాడుతూ... 

దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 2 కోట్ల 68 లక్షల మంది మంది దివ్యాంగులున్నారు. వారందరికి మా ప్రభుత్వం తరపున సహాయం చేస్తున్నాం. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఆ సంఖ్య మరింత పెరిగి ఉండొచ్చు. మా మంత్రిత్వ శాఖ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఓ దివ్యాంగుడికి జైపూర్ కృత్రిమ కాలు ఇచ్చాం. అతను ఎంతో ఆనందంతో ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 1500 మంది దివ్యాంగులకు సహాయం అందించాం. హైదరాబాద్ లో ఈ రోజు జరిగింది. రేపు తిరుపతిలో ఈ కార్యక్రమం ఉంది. మా శాఖ తరపున దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. వికలాంగులు అనడం ప్రధానికి ఇష్టం లేదు. అందుకే వారిని దివ్యాంగులని సంబోదిస్తున్నాం. దివ్యాంగులకు దేవుడు అదనపు వికాసాన్ని ఇస్తాడు. వాళ్లలో సాహిత్యం, సృజనాత్మకత ఉంటాయి. ఒక్కో దివ్యాంగుడు ఒక్కో రంగంలో తమదైన శైలిలో ప్రతిభను ప్రదర్శిస్తాడు. దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి సామాజిక శాఖలో ఇద్దరు కార్యదర్శులున్నారు. దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యదర్శి, సామాజిక న్యాయం కోసం మరో కార్యదర్శి ఉన్నారు. మిగతా అన్ని శాఖలకు ఒక్కో కార్యదర్శి మాత్రమే ఉన్నారు. జైపూర్ కృత్రిమకాలును రాయితీపై అందిస్తున్నాం.

 


Share this article :