Home » » Vishal Laatti Teaser Launched

Vishal Laatti Teaser Launched

 మా అబ్బాయి రాజమౌళి లానే విశాల్ కూడా గొప్ప విజయాన్ని అందుకోవాలి:  హీరో విశాల్- రానా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ లో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.  విశాల్ ఈవెంట్ లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్ పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు. 


హీరో విశాల్ మాట్లాడుతూ.. విజయేంద్రప్రసాద్ గారిని ఎప్పటి నుండో కలవాలని నా కోరిక. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డిసెంబర్ 22న లాఠీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడు  ఏ వినోద్ కుమార్ గురించి సినిమా విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్ నే చెబుతుంది. సినిమా నిర్మాతలు రమణ, నంద నా స్నేహితులు. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. యువన్ శంకర్ రాజా నాకు చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చారు. లాఠీ కి బ్రిలియంట్ స్కోర్ చేసారు. డాక్టర్ పవన్ సినిమాని తెలుగులో పంపిణీ చేస్తున్నారు. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ అమేజింగ్ వర్క్ ఇచ్చారు. హీరోయిన్ సునయన తో పాటు ఈ సినిమాలోపని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాని కూడా ఎంత మంది చూస్తారో ఒకొక్క టికెట్ కి ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను. ఈ ఈవెంట్ విచ్చేసి మాకు బెస్ట్ విశేష్ అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' తెలిపారు.


రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విశాల్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను(నవ్వుతూ). విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా  షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ) మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. కార్తికేయ 2 ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది. ‘లాఠీ’ కూడా అద్భుతమైన విజయం అందుకుంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. 'అందరూ సినిమా చూసి పెద్ద హిట్ చేయండి'' అని కోరుకున్నారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ.. విశాల్ గారి సినిమాలు పదిహేనేళ్ళుగా తెలుగులో వస్తున్నాయి.  పందెంకోడి, పొగరు సినిమాలు ఇరగబడి చూసే వాళ్ళం. చాలా మంది అమ్మాయిలు విశాల్ గారికి ఫ్యాన్స్ గా వుండేవారు. వాళ్ళ అభిమానం చూస్తే జలస్ గా వుండేది. ఒక ప్రేమికుడిగా కనిపిస్తూ భారీ ఫైట్లు కూడా చేసే స్క్రీన్ ప్రజన్స్ చాలా తక్కువ మందికి వుంటుంది. అది ప్రభాస్ గారిలో కనిపిస్తుంది.అలా అరుదుగా వుండే హీరోల్లో విశాల్ గారు ఒకరు. విశాల్ గారి మూవీస్ ని ఫాలో అవుతుంటాను. ఆయనతో స్టేజ్ షేర్ చేసుకోవడం ఆనందంగా వుంది. ‘లాఠీ’ టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి.  విశాల్ గారు డిఫరెంట్ మూవీస్ తో స్ఫూర్తిని ఇచ్చే హీరో. ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది. ‘లాఠీ’ని థియేటర్ లో చూడటానికి ఎదురుచూస్తున్నాను.'' అన్నారు. 


దర్శకుడు ఏ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘లాఠీ' యాక్షన్ అడ్వంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. ఒక సాధారణ కానిస్టేబుల్, అతని సాహసాలకు సంబధించిన కథ. విశాల్ గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. యాక్షన్ సన్నివేశాల సమాహారం ఈ చిత్రం. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, డీవపి బాలసుబ్రమణ్యన్ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన విశాల్ గారికి మరోసారి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది''  అన్నారు. 


నిర్మాత రమణ మాట్లాడుతూ.. విశాల్ లాంటి హీరో మా తొలి సినిమా చేయడం ఆనందంగా వుంది. మా ముగ్గురి జర్నీ 17 ఏళ్ళు. ముగ్గురం కలసి చాలా సేవా కార్యక్రమాలు చేశాం. లాక్ డౌన్ లో  ‘లాఠీ’ కథ విన్నాం. చాలా నచ్చింది. విశాల్ కి బావుటుందని అనుకున్నాం. కాస్త భయపడుతూనే విశాల్ కి పంపించాం. విశాల్ కి నచ్చింది. అయితే మీరే నిర్మించాలని చెప్పడం మాకు సర్ ప్రైజ్ అనిపించింది. అప్పుడు మా దగ్గర రెండు లక్షలు మాత్రమే వున్నాయి. కానీ అంతా ఒక మ్యాజిక్ లా జరిగింది. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ లాంటి అత్యున్నత సాంకేతిక నిపుణులు ప్రాజెక్ట్ లో చేరారు. సినిమా సైజ్ పెరుగుతూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారింది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. విశాల్ కి ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ వస్తుందనే నమ్మకం వుంది. అంత అద్భుతంగా చేశారు. '' అన్నారు


సునయన మాట్లాడుతూ.. నేను తెలుగు అమ్మాయినే. తమిళ సినిమాల్లో పని చేయడం ప్రారంభించాను. తెలుగులో రాజరాజ చొర చేశాను. పాన్ ఇండియా సినిమాగా ‘లాఠీ’ వస్తోంది. విశాల్ గారితో పని చేయడం అనందంగా వుంది. ఆయన గ్రేట్ హ్యుమన్ బీయింగ్. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం'' అన్నారు. 


యువన్ శంకర్ రాజా మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నాకు చాలా నచ్చింది. విశాల్ నటన చాలా బావుంటుంది. యాక్షన్ సీన్స్ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందరూ థియేటర్లో చూడాలి'' అని కోరారు. 


శివ బాలాజీ మాట్లాడుతూ.. విశాల్ తన చుట్టూపక్కల వారి కోసం తపించే మనిషి. సేవాకార్యక్రమాలతో ఎంతో స్ఫూర్తిని ఇస్తుంటుంది.  సినిమా నిర్మాత  రమణ నా స్నేహితుడు. ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. నందా కూడా ఫ్రండే. ఈ ముగ్గురి కోసం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ‘లాఠీ’ టీజర్ చూస్తుంటే ఒక ఎమోషన్ లా అనిపిస్తుంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది'' అన్నారు. 


మాటల రచయిత రాజేష్ ఎ మూర్తి మాట్లాడుతూ.. ఒక కానిస్టేబుల్ ‘లాఠీ’ తో న్యాయాన్ని ఒకవైపు, కాపాడుతూ మరోవైపు తన కుటుంబాన్ని ఎలా కాపాడుతుంటాడనేది కథ. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. చాలా అద్భుతమైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేశారు. నాకు తొలి సినిమా అవకాశం ఇచ్చింది విశాల్ గారు.  ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతదూరం ట్రావెల్ చేశాను. లైఫ్ లాంగ్ ఆయనకి రుణపడి వుంటాను.  ‘లాఠీ’ సెకండ్ హాఫ్ అంతా క్లైమాక్స్ లానే వుంటుంది. డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఈ సినిమా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.  


చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘లాఠీ’ తెలుగుదనం ఉట్టిపడే పాట రాశాను. అవకాశం ఇచ్చిన విశాల్ గారికి దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరుకున్నారు 

 

నటీనటులు : విశాల్, సునయన

సాంకేతిక విభాగం : 

దర్శకత్వం : ఏ వినోద్ కుమార్

నిర్మాతలు : రమణ, నంద

బ్యానర్ : రానా ప్రొడక్షన్స్

సంగీతం: యువన్ శంకర్ రాజా 

సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్

స్టంట్ డైరెక్టర్ : పీటర్ హెయిన్

ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ : బాల గోపి

పీఆర్వో : వంశీ-శేఖర్


Share this article :