Home » » Salaar Releasing Grandly on September 28th 2023

Salaar Releasing Grandly on September 28th 2023

 పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ ‘సలార్’  సరికొత్త పోస్టర్.. సెప్టెంబర్ 28, 2023లో మూవీ రిలీజ్‌పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘సలార్’. ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు, యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న చిత్ర‌మిది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28, 2023న రిలీజ్ అవుతోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తూ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అందులో ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్ ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎప్పుడెప్పుడు ప్ర‌భాస్‌ను వెండితెర‌పై చూస్తామా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించిన సరి కొత్త లుక్‌ను విడుద‌ల చేయ‌టంతో పాటు రిలీజ్ డేట్ సెప్టెంబ‌ర్ 28, 2023గా అనౌన్స్ చేశారు. 


‘సలార్’ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ ఫిల్మ్‌. ఇండియా స‌హా యూర‌ప్‌, మిడిల్ ఈస్ట్‌, ఆఫ్రికాల‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా యాబై శాతానికి పైగా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌భాస్ సినిమాపై ఫుల్ ఫోక‌స్‌గా ఉన్నారు. సినిమాను అత్య‌ద్భుతంగా తీర్చిదిద్ద‌డానికి ఎంటైర్‌టైమ్ ఫుల్ ఎఫ‌ర్ట్‌తో వ‌ర్క్ చేస్తున్నారు. సినిమాలో వి.ఎఫ్‌.ఎక్స్‌కు చాలా ప్రాధాన్య‌త ఉంది. దీంతో మేక‌ర్స్ ఫారిన్ స్టూడియోలో ఈ వ‌ర్క్ అంత‌టినీ పూర్తి చేయ‌టంలో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ ఆకాశాన్నంటాయి. 


పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఇద్ద‌రు స్టార్స్ ఒక‌రేమో ప్ర‌భాస్‌.. మ‌రొక‌రు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమా కావ‌టంతో ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ మూవీ గురించి చాలా ఆతృత‌గా ఎదురుచూస్తోంది. కె.జి.య‌ఫ్ వంటి సెన్సేష‌నల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌గా మారారు. 


అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి మాస్ అండ్ రా క్యారెక్ట‌ర్‌తో మెప్పించ‌బోతున్నారు. ఆయ‌న‌ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో స‌లార్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌,  జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రెడ్డి, శ్రియా రెడ్డి తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కెజియ‌ఫ్ సినిమాతో ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌రిత్ర సృష్టించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ రూపొందిస్తోన్న సినిమా కావ‌టంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. అంచ‌నాల‌ను మించేలా ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా మాస్ ఎలిమెంట్స్‌, గ్రేట్ కంటెంట్‌, హై యాక్ష‌న్ సీక్వెన్స్‌తో సినిమా రూపొందుతోంది. 


ఇండియ‌న్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఫ్రాంఛైజీలైన బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ కాంబోలో రాబోత‌న్న సినిమా స‌లార్‌. కె.జి.య‌ఫ్ వంటి సెన్సేష‌న్‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌, ఇతర సాంకేతిక నిపుణులు.. మ‌న బాహుబ‌లి ప్ర‌భాస్ క‌లిసి సెప్టెంబ‌ర్ 28, 2023లో మ‌రో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌టానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి డైన‌మిక్ కాంబినేష‌న్‌లో రాబోతున్న స‌లార్ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. 


ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా స‌లార్ చిత్రాన్ని రూ. 400 కోట్ల బ‌డ్జెట్‌తో హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ డైన‌మిక్ కాంబినేష‌న్‌ను చూస్తుంటే ‘ఎరా ఆఫ్ సలార్ బిగెన్స్’ అని కచ్చితంగా చెప్పొచ్చు.


Share this article :