ఫైరింగ్ స్టార్ కె.సురేష్ బాబు హీరో గా కె.యస్. రామారావు క్లాప్ తో అంగరంగ వైభవంగా "వకాలత్ నామా" సినిమా షూటింగ్ ప్రారంభం.
కృష్ణ్ క్రియేషన్స్ బ్యానర్ పై కుళ్ళపరెడ్డి హేమచంద్రారెడ్డి మరియు కుళ్ళపరెడ్డి దామోదర్ రెడ్డి నిర్మాతలుగా బోడపాటి మురళి దర్శకత్వంలో కె సురేష్ బాబు హీరోగా "వకాలత్ నామా" సినిమా ఖైరతాబాద్ లోని మహంకాళి టెంపుల్ లో ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ శ్వేత రెడ్డి గారు పూజ కార్యక్రమం నిర్వహించగా మెగా ప్రొడ్యూసర్ కె ఎస్ రామారావు గారు క్లాప్ కొట్టగా, మేక మేనక శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా మొదటి షాట్ ని ,డైరెక్టర్ వి సాగర్ గారు డైరెక్షన్ చేయటం జరిగింది .ఈ సినిమా ఓపెనింగ్ కి విచ్చేసిన ప్రముఖ డైరెక్టర్స్ ఏ ఎస్ రవికుమార్ చౌదరి, వి సముద్ర, సూర్య కిరణ్ ,తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి ,తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ మోహనవడ్లపట్ల గారు ,మోహన్ గౌడ్ ,రవీందర్ రెడ్డి ,ఎమ్ వి రావు ,కృష్ణారెడ్డి , భవాని, వింజమూరి మధు ,ఎలమంచిలి రవి చంద్, బానూరు నాగరాజు ,ఆర్ ఎస్ శ్రీనివాస్ ,మరియు జాన్ బాబు, కట్టా రాంబాబు, రామకృష్ణా రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.