Home » » Commitment movie Review

Commitment movie Review

 క్రష్ మూవీ హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ రివ్యూ

 రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్  మరియు  ఫుట్ లూస్  ఎంటర్  టైన్మెంట్స్ పై వచ్చిన మూవీ కమిట్ మెంట్” ఈ మూవీ లో రవి బాబు లాంటి క్రియేటివ్ స్కూల్ నుంచి వచ్చిన అభయ్ సింహా రెడ్డి,అలాగే తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య  శ్రీనివాస్, నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన  ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి  స్పంద‌న  వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి  చేసుకున్న “కమిట్మెంట్” సినిమాను ఆగష్టు 19 న గ్రాండ్ థియేటర్స్ లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో చూద్దాం పదండి.


కథ

కమిట్మెంట్ అనేది విభిన్న కలలు మరియు లక్ష్యాలతో స్థిరపడటానికి పోరాడుతున్న నలుగురు మహిళల జీవితాల గురించి తెలియజేసే కథ “కమిట్ మెంట్ “. సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకునే ఓ సినిమా నటి స్టోరీ.ఓ సెక్సాలజిస్ట్, ఓ యుక్త వయస్కురాలు, ఓ విద్యార్థి మరియు ఒక జూనియర్ డాక్టర్, అందరూ వారి జీవితంలో ఒకే సమస్యను ఎదుర్కొంటారు, అక్కడ వారి చుట్టూ ఉన్న వ్యక్తులు తమకు అవసరమైనది ఇవ్వడానికి కమిట్మెంట్  చేయాలని అడుగుతారు.ఆలా కమిట్ మెంట్ కొరకు వెళ్ళినపుడు సొసైటీ లో వీరంతా ఎటువంటి ప్రాబ్లమ్ ను ఎదుర్కొన్నారు? అనే ట్విస్ట్ &టర్న్స్ తో ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.. అసలు ఇందులో ఉన్న ఈ పాత్రలకి “కమిట్ మెంట్” కు ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళు ఆ సమస్యని ఎలా ఎదుర్కున్నారు? అనేది తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే…


నటీ నటుల పనితీరు

ఈ సినిమాలో ఉన్న నాలుగు స్టోరీస్ లలో అభయ్ సింహారెడ్డి ది క్యూట్ లవ్ స్టోరీ.“ క్రష్” సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న అభయ్ సింహా రెడ్డి ఇందులో ప్రజెంట్ యూత్ అంతా మెచ్చే పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు.స్టూడెంట్స్, రిలేషన్ షిప్ లో ఉన్న వారు కావచ్చు, ఇలా యూత్ అందరూ అభయ్ సింహారెడ్డి పాత్రకు అట్రాక్టు అవుతారు. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకునే పాత్రలో హీరోయిన్ తేజస్వి మదివాడ చాలా చక్కని నటనను ప్రదర్శించింది. రమ్య పసుపులేటి నటన పరవాలేదు .అలాగే ఇందులో నటించిన రాజా రవీంద్ర, అమిత్ తివారీ చాలా చక్కగా నటించారు. ఇంకా సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,సూర్య  శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ వంటి తదితర నటీమణులు కూడా వారికిచ్చిన పాత్రలకు మంచి నటనను కనబరిచారు.


సాంకేతిక నిపుణుల పని తీరు:

నాలుగు కథలతో కొత్త కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో ప్రస్తుతం ఆడవాళ్లు వర్క్ లో కానీ కాలేజ్ లోగానీ, ప్రొఫెషన్ లో గానీ ఇలా ఎందులోనైనా కానీ ప్రస్తుత సొసైటీ లో ఆడవారు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు వాటిని ఎలా ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనే దానిని కథగా మలచి చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ చెన్నా. ఎంతో జోవియల్ గా ఉండే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది .ఈ చిత్రానికి సంగీతం కూడా వైవిధ్యంగా ఉండెలా నరేష్ కుమారన్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీని సజీష్ రాజేంద్రన్ , నరేష్ రానాల సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ ను చాలా చక్కగా హ్యాండిల్ చేసారు.ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్ నిర్మాణంలో బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి లు సంయుక్తంగా నిర్మించిన నిర్మాతలు నేటి యువత‌ను ఆలోచింప జేసే ప్రయత్నం చేశారు.  ”కమిట్ మెంట్ ” సినిమాకు కు వెళ్లిన ప్రేక్షకుడికి కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేసే పక్కా పైసా వసూల్ సినిమా అవుతుంది.


చివరిగా :ఈ సినిమా లో అభయ్ సింహ మరియు రమ్య పసుపులేటి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు లలో అభయ సింహ తన నటనతో కట్టిపడేసాడు అని చెప్పాలి

రేటింగ్ :3/5


Share this article :