Home » » Murali Sharma Look from Hathya Launched

Murali Sharma Look from Hathya Launched

 విజయ్ ఆంటోనీ 'హత్య' మూవీలో ఏజెంట్ ఆదిత్యగా మురళీ శర్మ, ఫస్ట్ లుక్ విడుదల




పలు విభిన్న చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ త్వరలో తన కొత్త సినిమా 'హత్య' తో తెరపైకి రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు మురళీ శర్మ ఏజెంట్ ఆదిత్య క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.


లీలను చంపింది ఎవరు అనే  కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఏజెంట్ ఆదిత్యగా రంగంలోకి దిగారు మురళీ శర్మ. ఆయన చేపట్టిన విచారణ ఇంటెన్స్ గా సాగుతున్నట్లు పోస్టర్ లుక్ లో తెలుస్తోంది. కాంట్రాక్ట్, స్లీజీ, వై అనే ప్రశ్నల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మురళీ శర్మ లుక్ డిఫరెంట్ గా ఉంది. '1923లో జరిగిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య'  సినిమా సాగనుంది. 


ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.


Share this article :