Home » » Virata Parvam Warangal Event Grand Success

Virata Parvam Warangal Event Grand Success

 విరాటపర్వం గొప్ప ప్రేమ కావ్యం : వరంగల్ ఆత్మీయ వేడుకలో విరాటపర్వం టీమ్ పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, నేచురల్ పెర్ఫార్మర్ సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వరంగల్ లో ఆత్మీయ వేడుక నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్భాస్కర్, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ.. విరాట పర్వం ఎందుకు చేస్తున్నారు ? పెద్ద యాక్షన్ మూవీ చేయొచ్చు కదా? అని చాలా మంది నన్ను  అడిగేవారు. చాలాసార్లు సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలా చప్పట్లు కోసం, విజిల్స్ కోసం, ఫ్యాన్స్ కోసం. ఈసారి ఈ సినిమా ఎందుకు చేశానంటే.. చప్పట్ల మధ్యలో నిశబ్ధంగా కూర్చుని ఇది నిజమే కదా..అని ఒకరు చూస్తుంటాడు. అలాంటివారి కోసమే ఈ సినిమా చేశా. దర్శకుడు వేణు గారు ఈ సినిమా అద్భుతంగా రాశారు. తీశారు. తెలంగాణలో కట్టె పుల్లని పట్టుకున్నా కవిత్వం వస్తుందని  వేణు గారు చెప్పారు. అది నిజం. ఇలాంటి గొప్ప కథలు ఎన్నెన్నో చెప్పదలచుకున్నాం. విరాటపర్వం జూన్ 17న వస్తుంది. మీ ప్రేమ మాకు కావాలి. ఈ వేడుకకు వచ్చే ముందు సైబర్ పోలీసులు నా దగ్గరకి వచ్చి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ వివరాలు ఎవరికీ షేర్ చే యొద్దని మీ అందరికి మెసేజ్ ఇవ్వమని చెప్పారు. చాలా సైబర్ క్రైమ్ జరుగుతుంది. మీ డబ్బులు జూన్ 17విరాట పర్వం కోసం దాచుకోండి. టికెట్లు కొనండి. థియేటర్ లో కలుద్దాం. సక్సెస్ మీట్ కి మళ్ళీ ఇక్కడికే వస్తా'' అన్నారు. 


సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులకు, అభిమానులకు కృతజ్ఞతలు. వరంగల్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చిన భావనే కలుగుతుంది. కళ లేకుండా మనం ఉండలేం, మనం లేకుండా కళ కూడా వుండదు. విరాట పర్వం చాలా నిజాయితీ గల కథ. విరాట పర్వం  మన సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. వెన్నెల పాత్ర ఇచ్చిన దర్శకుడు వేణు గారికి కృతజ్ఞతలు. రానా గారితో నటించడం గొప్ప అనుభూతి. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నటీనటులు, టెక్నికల్ టీం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందరికీ కృతజ్ఞతలు. విరాట పర్వంలో భాగం కావడం చాలా గర్వంగా వుంది. మీ ప్రేమకి ఎప్పుడూ రుణపడి వుంటాను. కథ ద్వారా నా ప్రేమని వ్యక్తపరచగలము. విరాట పర్వం కూడా అలా ప్రేమని వ్యక్తపరిచే కథ. జూన్ 17న మీఅందరూ తప్పక చూడాలి'' అన్నారు. 


చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. ఏ ప్రాంతాల్లో అపజయాలు కూడా అగ్ని జ్వాలలై మండుతాయో, ఏ ప్రాంతంలో మరణాలు కూడా మహా కావ్యలై పుడతాయో ఆ ప్రాంతమే ఓరుగల్లు ప్రాంతం. ఈ ఓరుగల్లు ప్రాంతంలో 1990లో జరిగిన ఒక మరణం నన్ను కదిలించింది. ఒక మహా సంక్షోభం అలోచింప చేసింది. ఆధిపత్య, ప్రత్యామ్నాయ రాజకీయాల సంఘర్షణ దీనికి కారణం కావడం, ఎలాగైనా దాన్ని సినిమాగా నిర్మించాలని భావించి దానికి ఒక అద్భుతమైన ప్రేమని జోడించి దాన్ని మహా కావ్యంగా మీ ముందుకు తీసుకొచ్చాను .. అదే విరాట పర్వం. ఈ కథ రాస్తున్నప్పుడే వెన్నెల పాత్ర కలలోకి వచ్చేది. వెన్నెలది మామూలు పాత్ర కాదు. అమెది మామూలు ప్రేమ కాదు. శివుణ్ణి ప్రేమించిన ఒక సిద్దేశ్వరి, మల్లికార్జున స్వామిని ప్రేమించిన ఒక భ్రమరాంబ, అక్క మాహదేవి, కవయిత్రి మొల్ల ఇలాంటి ఇతిహాస గుణం వున్న పాత్ర వెన్నెల. సాయి పల్లవి గారు ఈ సినిమాలో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నా.మట్టి ముద్దని కూడా బాంబులా తయారు చేసిన పాత్రలో రానా గారు నటించారు.  రానా గారి వ్యక్తిత్వం గొప్పది. ఆయన చిన్న యాడ్ చేసినా,  ఒక సినిమా డిస్ట్రిబ్యుషన్ చేసినా, చిన్న పాత్ర చేసిన, హోస్ట్ గా చేసినా.. దాన్ని అద్భుతమైన ఆర్ట్ పీస్ గా మలిచే వరకూ నిద్రపోరు. ఈ సినిమా చేయడం నా గొప్పదనం కాదు ఆయన గొప్పదనం. ఒక అర్ధవంతమైన సినిమా చేయాలనే గొప్ప మనసుతో ఈ సినిమా ఒప్పుకున్నారు. ఆయన ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత విరాట పర్వం కాన్వాస్ ఎంత పెరిగిందో మీ అందరికీ తెలుసు. నవీన్ చంద్ర , నందితదాస్, ప్రియమణి, జరీనా వాహేబ్ ఇలా చాలా గొప్పనటులు ఇందులో భాగమయ్యారు. ఇందులో ఐదు ముఖ్య స్త్రీ పాత్రలు వున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. అలాగే  మహిళలు తప్పక చూడాల్సిన సినిమా ఇది. సురేష్ బొబ్బిలి తన సంగీతంతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. స్పెయిన్ నుండి కెమరామెన్ జర్మనీ నుండి స్టంట్ మాస్టర్, లెజెండరీ ఎడిటర్ శ్రీ కర్ ప్రసాద్.. ఇలా గొప్ప టెక్నికల్ టీం ని ఇచ్చిన నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ గారికి  కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత గొప్పగా వచ్చిందంటే దానికి కారణం నిర్మాతలు.  పాండమిక్ లాంటి ప్రతికూల ఎదుర్కొని సినిమాని థియేటర్ లో మాత్రమే విడుదల చేయాలనే లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు'' అన్నారు


ప్రియమణి మాట్లాడుతూ.. విరాట పర్వం నాకు చాలా స్పెషల్ మూవీ. ఇందులో భారతక్క అనే ముఖ్యమైన పాత్ర పోషించాను. ఈ పాత్రని ఇచ్చిన దర్శకుడు వేణు ఉడుగుల కి థాంక్స్. రానా గారు అద్భుతమైన నటుడు. వెంకటేష్ గారితో నారప్ప చేశాను. రానాతో ఇప్పుడు విరాట పర్వం చేయడం ఆనందంగా వుంది. నవీన్ చంద్ర కూడా అద్భుతంగా చేశారు. సాయి పల్లవి నాకు ఇష్టమైన నటి. ఈ సినిమాని తన భుజాలపై మోసింది. ఆమె నుండి ఇలాంటి మరిన్ని గొప్ప సినిమాలు రావాలి. జూన్ 17విరాట పర్వం రాబోతుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూడాలి''అని కోరారు. 


నవీన్ చంద్ర మాట్లాడుతూ..  రానా గారు గ్రేట్ పర్శన్. సెట్ లో అందరినీ చాలా కేరింగ్ గా చూసుకుంటారు. ఆయన తో షూటింగ్ మర్చిపోలేని అనుభవం. ఆయన ప్రతి డైలాగ్ ని అక్షరాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నా.  సాయి పల్లవి అద్భుతమైన నటి. సాయి పల్లవి గురించి ఎంత మాట్లాడిన తక్కువే. ప్రియమణి గారి పాత్ర కూడా బలంగా వుంటుంది.  ఇంత గొప్ప సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. విరాట పర్వం నా కెరీర్ లో గుర్తిండిపోయే చిత్రంగా వుంటుంది. జూన్ 17విరాట పర్వం వస్తుంది. ప్రేక్షకులంతా చూసి ఆనందించాలి'' అన్నారు. 


సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం కల్పించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు, హీరో రానా గారికి కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది . సినిమాని ఎన్ని సార్లు చూసినా కన్నీళ్లు వస్తున్నాయి. అంత గొప్పగా వుంది సినిమా. జూన్  17న అందరూ థియేటర్ కి వచ్చి విరాట పర్వాన్ని చూడండి'' అని కోరారు.


ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ.. విరాట పర్వం ట్రైలర్ అద్భుతంగా వుంది. డైలాగ్స్, ఫోటోగ్రఫీ , హీరో, హీరోయిన్ ఇలా అందరూ బావున్నారు.  దర్శకుడు వేణు గారు సినిమాని అద్భుతంగా తీశారు. రానా గారిది గౌరవం వున్న కుటుంబం. రానా గారి సినిమాలన్నీ  గొప్పగా వుంటాయి. ఆయన సినిమాలో చిన్న పాత్ర వేసిన స్టార్ గా కనిపిస్తారు. సాయి పల్లవి సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి. విరాట పర్వం కూడా గొప్ప విజయం సాధిస్తుంది'' అన్నారు. 


రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. రానా గారి తాత, నాన్న గారు నాకు మంచి స్నేహితులు. ఈ రోజు రానా గారు వరంగల్ రావాడం చాలా సంతోషం. సాయి పల్లవి మా ఆడబిడ్డే. నవీన్ చంద్ర, ప్రియమణి , దర్శకుడు వేణు ఉడుగుల, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి , నిర్మాత సుధాకర్.. అందరూ వరంగల్ రావడం ఆనందంగా వుంది. వరంగల్ లో వేడుకలు జరుపుకున్న ప్రతి సినిమా విజయాన్ని సాధించింది. ఈ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం. మా సంపూర్ణ సహకారం వుంటుంది. వరంగల్ ప్రజల ఆశీస్సులతో విరాట పర్వం చరిత్ర సృష్టిస్తుంది'' అన్నారు. 


ఎమ్మెల్యే వినయ్భాస్కర్ మాట్లాడుతూ..  విరాట పర్వం టీం కి ఆత్మీయ స్వాగతం. దర్శకుడు వేణు ఉడుగుల,హీరో రానా, సాయి పల్లవి, నవీన్ చంద్ర ప్రియమణి.. ఇలా ఈ చిత్రంలో నటించిన అందరికీ అభినందనలు. వరంగల్  లో షూటింగ్ కి అనుకూలంగా అనేక ప్రదేశాలు వున్నాయి. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ వుంటుంది. ఈ నేపధ్యంలో వస్తున్న విరాటపర్వం ఖచ్చితంగా వందరోజులు ఆడుతుంది'' అన్నారు. 


దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. విరాట పర్వం చూశా. ఒక అభిమానిలా వచ్చా. రానా గారు ఒక ఇన్స్పిరేషన్. దర్శకుడు వేణు ఉడుగుల అద్భుతంగా తీశారు. ఇలాంటి సినిమా చేయాలంటే సాహసం కావాలి. ఆ సాహసం దర్శకుడు వేణులో వుంది. సాయి పల్లవి వండర్ ఫుల్. వెన్నెల పాత్ర చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోయా. విరాట పర్వం లాంటి సినిమా తీసిన నిర్మాతలకు హాట్స్ ఆఫ్ చెప్పాలి.  విరాటపర్వం అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


Share this article :