Rolex watch Gifted to Hero Suriya by Kamal Haasan on the occasion of Vikram Movie Success

 విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్... సూర్యకి తన సొంత రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన యూనివర్షల్ స్టార్ కమల్ హాసన్ 



యూనివర్షల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన  భారీ యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్'. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 3 విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. స్టార్ హీరో నితిన్‌ హోమ్ బ్యానర్ 'శ్రేష్ఠ్ మూవీస్' తెలుగులో భారీగా విడుదల చేసిన 'విక్రమ్' హౌస్ ఫుల్ కలెక్షన్స్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 


విక్రమ్ విజయాన్ని పురస్కరించుకొని హీరో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరో సూర్యని ఆయన నివాసంలో కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ తన సొంత రోలెక్స్ వాచ్‌ను సూర్య కి బహుమతిగా ఇచ్చారు. ఈ అరుదైన బహుమతిని సూర్య తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ''ఇలాంటి క్షణమే జీవితాన్ని అందంగా మార్చుతుంది. థాంక్స్ అన్నా'' అని తన ట్విట్టర్ లో వెల్లడించారు సూర్య. విక్రమ్ లో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించారు. సూర్య స్క్రీన్ ప్రజన్స్ కి థియేటర్ దద్దరిల్లిపోయే రెస్పాన్స్ వచ్చింది. కమల్ హాసన్ తన సొంత రోలెక్స్ వాచ్ ని సూర్యకి బహుకరించడం అభిమానులకు ఎంతో అరుదైన క్షణంగా నిలిచింది.

Post a Comment

Previous Post Next Post