Home » » Tej Kurapati Interview About Naa Venta Padutunna Chinnadevadamma

Tej Kurapati Interview About Naa Venta Padutunna Chinnadevadamma

 

ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌ కథా చిత్రంలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది...హీరో తేజ్ కూర‌పాటి 
హుషారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు తేజ్ కూర‌పాటి,తను హీరో గా నటిస్తున్న తాజా చిత్రం "నా వెంట ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా". జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై తేజ్ కూరపాటి, అఖిల ఆక‌ర్ష‌ణ జంట‌గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వం లో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మిస్తున్న‌చిత్రం.'నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా'.ఈ చిత్రానికి సంభందించి  ఫ‌స్ట్ లుక్ కి ఇటీవ‌లే ప్ర‌ముఖ న‌టులు , ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కులు త‌ణికెళ్ళ భ‌ర‌ణి గారు విడుద‌ల చేసిన సాంగ్ ప్రోమో కి మంచి రెస్సాన్స్ వస్తుంది.


నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే నా చదువైన తరువాత సినిమాపై ఉన్న ఫ్యాషన్ తోఅన్నపూర్ణ స్టూడియోలో డైరెక్షన్ కోర్స్ చేశాను.కోర్స్ అయిన తరువాత మా నాన్న బిజినెస్ చూసుకోమన్నారు. సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇంట్లో నుండి బయటకు వచ్చాను.ఆ తరువాత రెండు, మూడు సంవత్సరాలు చాలా స్త్రగుల్స్ పడ్డాను. తరువాత బెక్కం వేణుగోపాల్ గారు "నాన్న నేను బాయ్ ఫ్రెండ్" సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. తరువాత దిల్ రాజు గారి బ్యానర్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర డి. జె సినిమాకు కొద్దీ రోజులు వర్క్ చేశాను.


నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బెక్కం వేణుగోపాల్ గారు కొత్తవాళ్ళతో ఒక సినిమా చేస్తున్నారు.ఆ సినిమాకు నలుగురు కొత్త హీరోల కోసం చూస్తున్నారు అని చెప్పడంతో నేను అక్కడికెళ్లి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమానే హుషారు. ఈ సినిమా తరువాత రౌడి బాయ్స్ లో సెకెండ్ హీరోగా చేశాను. ఈ సినిమా కథ రెడీ అయిన తర్వాత ఒక హీరో కోసం చూస్తున్న దర్శక, నిర్మాతలు రౌడి బాయ్స్ లో చేసిన అబ్బాయి బాగా చేశాడని నన్న పిలిచి నన్ను సింగిల్ సిట్టింగ్ లో "నా వెంటే ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా"  సినిమాలో సోలో హీరో గా చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. 


డైరెక్టర్ వెంక‌ట్ వందెల‌ గారు నాకు ఫస్ట్ టైం స్టోరీ నెరేట్ చేసినపుడు  నాకు ఈ కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే.. ఒక అమ్మాయికి తెలియకుండా ఒక అబ్బాయి వెంటపడుతుంటాడు, తనకు తెలియకుండా ఒక అబ్బాయి వెంట పడుతున్నాడన్న విషయం తనకు తప్ప ఊర్లో ఉన్న వారందరికీ  తెలుస్తుంది. దానివల్ల ఆ అమ్మాయి కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ? చివరికి ఈ అమ్మాయి అబ్బాయిని  కలుస్తుందా..లేదా కలిస్తే ఎలా కలుస్తుంది అనేది కాన్సెప్టు.వెంకట్ గారు ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మేకింగ్ ఎలా ఉంటుంది అనేది సినిమా రిలీజ్ అయిన తరువాత తెలుస్తుందిమా చిత్ర నిర్మాతలు ముల్లేటి నాగేశ్వ‌రావు గారు జీవిఆర్ గార్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ప్రేమ క‌థ లో వినొదాన్ని మిక్స్ చేసి ఈ సినిమాను నిర్మించారు. ఇందులో హీరోయిన్ గా  నటించిన అఖిల ఆక‌ర్ష‌ణ కు మొదటి చిత్రమైనా చాలా చక్కగా నటించింది..మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ కుమార్‌ అన్నీ కూడా మంచి పాటలు ఇచ్చాడు. కచ్చితంగా ఈ సినిమా మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా మంచి విజ‌యాన్ని సాధిస్తుంది. ఈ మూవీ తరువాత సందీప్ కు మంచి లైఫ్ ఉంటుంది. గణేష్ మాస్టర్ సింగిల్ కార్డ్ తో  అద్భుతమైన కొరియోగ్రపీ చేశాడు.ఇందులో అన్ని సాంగ్స్ లో డ్యాన్స్ బాగుంటుంది.ప్ర‌ముఖ న‌టులు త‌ణికెళ్ళ భ‌ర‌ణి గారు మా చిత్రం లో ఒ కీల‌క పాత్ర‌లో న‌టించారు. వారు లాంచ్ చేసిన "పుడిమిని త‌డిపే తొల‌క‌రి మెరుపుల‌ చినుక‌మ్మా ".. సాంగ్ కు చాలా పెద్ద హిట్ అయింది. నేను నటించిన హుషారు కి ,రౌడీ బాయ్స్ కి ప్రేక్షకులనుండి, ఇండస్ట్రీలో మంచి అప్లాజ్ వచ్చింది .ఆ సినిమాలలో నన్ను కామెడీ యాంగిల్ లో చూశారు. నెక్ట్స్ సినిమాలో కామెడీ  ఉన్నా నేను కామెడీ చేయను సీరియస్ గా కంప్లీట్ లవర్ బాయ్ గా ఉంటుంది. ఇందులో నన్ను కొత్త యాంగిల్ లో చూస్తారు.ఈ సినిమా ప‌ల్లెటూరి నేప‌ధ్యం లో సాగే చ‌క్క‌టి ప్రేమ‌ కథా చిత్రం. ఫ్యామిలి మరియు యూత్  ని ఆక‌ట్ట‌కుంటుంది. ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులయింది.నాకు తెలిసి  ఉయ్యాల జంపాల తర్వాత వచే సినిమా ఇదే అవుతుంది అనుకుంటున్నాను. ఇకనుండి నేను సోలో హీరోగా చేద్దాం డిసైడ్ అయ్యాను.

ఈ సినిమా తర్వాత షికారు ఉంది అది జూన్ 24 న రిలీజ్ కు ఉంది.ఈ రెండు మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగే   హుషారు,రౌడీ బాయ్స్ డైరెక్టర్ హర్ష కొనగంటి గారు తీసే నెక్స్ట్ ఫిలిం లో ఒక సినిమా చేస్తున్నాను.ఈ సినిమా లో ముగ్గురు హీరోలతో ఉండగా అందులో ఒకరు పెద్ద హీరో ఉన్నారు. దిల్ రాజు గారు పెట్టిన డి ఆర్ పి జి దిల్ రాజు ప్రొడక్షన్ లో సోలో హీరోగా కన్ఫర్మ్ అయ్యింది. బెక్కం వేణుగోపాల్ గారి లక్కీ మీడియా లో  హీరోగా ఒక సినిమా చేస్తున్నాను ఇవి కాకNడా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని ముగించారు.


Share this article :