Veteran Actor Balayya is No More

 


ప్రముఖ నటులు శ్రీ బాలయ్య గారు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు.

నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు.

నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు.

ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము - శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో)  లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు.

దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు.

ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు.

శ్రీ బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.

శ్రీ నాదెండ్ల మనోహర్ సంతాపం

శ్రీ బాలయ్య మృతికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సంతాపం తెలిపారు. శ్రీ బాలయ్య గారు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు

Post a Comment

Previous Post Next Post