PawanKalyan  felicitates the Legendary Art Director Padma Shri ThotaTharani

 శ్రీ తోట తరణి గారికి హార్ధిక స్వాగతం 



అగ్రశ్రేణి కథానాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ప్రముఖ కళాదర్శకులు ‘పద్మశ్రీ’ శ్రీ తోట తరణి గారు కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం శ్రీ తోట తరణి గారు హరిహర వీరమల్లు షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. పద్మశ్రీ పురస్కారాలు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న శ్రీ తరణి గారు నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఆయన రూపొందించే సెట్స్ సృజనాత్మక శక్తికి... అధ్యయన అభిలాషకు అద్దంపడతాయన్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి శ్రీ తరణి గారితో పరిచయం ఉందన్నారు.

Post a Comment

Previous Post Next Post