Actress Rukshar Dhillon Interview About ‘Ashokavanamlo Arjuna Kalyanam’

 


ఆకతాయి, ABCD, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్స‌ర్ థిల్లాన్ తాజాగా తను నటిస్తున్న సినిమా ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ పతాకంపై విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ జంటగా విద్యా సాగ‌ర్ చింతా దర్శకత్వంలో బాపినీడు, సుధీర్ ఈద‌ర‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ చిత్రం “అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’’. రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని  మే6 విడుద‌ల  సందర్భంగా చిత్ర హీరోయిన్ రుక్స‌ర్ థిల్లాన్ పాత్రికేయ మిత్రులతో  మాట్లాడుతూ…


అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’’ సినిమాలో నేను చేసిన పాత్ర నాకు ఎంతో ద‌గ్గ‌రైన రోల్‌. మాధ‌వి అనే పాత్ర‌లో క‌నిపిస్తాను.ఇందులో నాది చాలా ఛాలెంజింగ్ రోల్. టేక్ అయ్యాక కూడా నేను  ఆ పాత్ర మూడ్ లోనే వుండే దాన్ని ఇందులో మంచి ఎమోషన్స్ ఉంటాయి.ఇలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్.. నిర్మాత‌లు బాపినీడు, సుధీర్‌గార్లకు అంద‌రికీ థాంక్స్‌ .


నా మొదటి సినిమా కన్నడలో పెద్ద బ్యానర్‌లో. తెలుగులో నాని, అల్లు శిరీష్‌లతో పని చేశాను.శిరీష్ చిల్డ్ పర్సన్, నాని ,విశ్వక్  లు చాలా కంఫర్టబుల్ వుంటారు.విశ్వక్ సేన్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.సెట్ లో వున్నప్పుడునటనలో సలహాలు సూచనలు ఇచ్చేవారు.


మా పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజే చేసుకున్నారు.వారి సపోర్ట్ తోనే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను.నాకు కాబోయే భర్త నన్ను అర్థం చేసుకొని నన్ను ఎంకరేజ్ చెయ్యాలి.


లవ్ స్టొరీస్ ,డీఫ్రెంట్ రోల్స్ వుండే మూవీస్ లలో నటించాలని ఉంది. పర్టీకులర్ ఇలాంటి రోల్ మాత్రమే చెయ్యాలని లేదు. చిన్న రోల్ అయినా పరవాలేదు కానీ మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేస్తాను. కానీ ఆ రోల్ కు ఇంపార్టెంట్ ఉండాలి.


కోవిడ్ స‌మ‌యంలోనూ టీమ్ స్పిరిట్‌తో వ‌ర్క్ చేశాం. జై క్రిష్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. మే 6న వ‌స్తున్న క్లీన్ ఫ్యామిలీ ఏంటర్ టైనర్ ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’’.ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చేలా ఎంతో హిలేరియ‌స్‌గా ఉంటుంది’’.


అమెజాన్ కొరకు ఒక హిందీ మూవీ చేస్తున్నాను,ఇవి కాకుండా మరో రెండు సినిమా కథలు విన్నాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని ముగించారు

Post a Comment

Previous Post Next Post