Home » » Director Shekar Kammula Launched Focus Movie Teaser

Director Shekar Kammula Launched Focus Movie Teaser

 యంగ్ టీమ్‌ అంద‌రు క‌లిసి చేసిన `ఫోక‌స్` సినిమా టీజ‌ర్ చాలా బాగుంది -  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల



విజ‌య్ శంక‌ర్, బిగ్‌బాస్ ఫేమ్ అషూరెడ్డి హీరోహీరోయిన్లుగా సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం `ఫోక‌స్‌`...మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక డిఫ‌రెంట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా జి. సూర్య‌తేజ ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మ‌వుతున్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఫోక‌స్ మూవీ టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా...


శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ - `యంగ్ టీమ్‌ అంద‌రు క‌లిసి చేసిన `ఫోక‌స్` సినిమా టీజ‌ర్ లాంచ్ చేయ‌డం  హ్యాపీగా ఉంది. టీజ‌ర్ చాలా బాగుంది. హీరో విజ‌య్‌శంక‌ర్, ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ‌తో పాటు చిత్ర యూనిట్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.


హీరో విజ‌య్ శంక‌ర్ మాట్లాడుతూ - ``శేఖ‌ర్ క‌మ్ముల గారి చేతుల‌మీదుగా మా ఫోక‌స్ మూవీ టీజ‌ర్ రిలీజ్ అవ‌డం మోస్ట్ హ్యాపీ మూమెంట్‌... ఆయ‌న ఎప్పుడు కొత్త టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తుంటారని మ‌రోసారి రుజువైంది. అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్ తీసుకుని సూర్య‌తేజ గారు ఈ సినిమాని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే మీ ముందుకు రాబోతున్నాం. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.


ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ - ``శేఖ‌ర్ క‌మ్ముల‌గారి సినిమాలు చూస్తూ పెరిగిన నాకు నా మొద‌టి సినిమా టీజ‌ర్‌ను ఆయ‌న రిలీజ్ చేయ‌డం వెరీ హ్యాపీ.. ఫోక‌స్ అనేది వైవిధ్య‌భ‌రిత‌మైన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. రెగ్యుల‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్స్‌కి భిన్నంగా  కొత్త త‌ర‌హాలో ఉంటుంది. ఖ‌చ్చితంగా మీకు ఒక డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంది. విజ‌య్ శంక‌ర్‌, అషురెడ్డి, సుహాసిని, భానుచంద‌ర్, జీవా, షియాజీ షిండే, సూర్య భ‌గ‌వాన్ ఇలా చాలా మంది పేరున్న‌ ఆర్టిస్టులు ఈ సినిమాలో న‌టించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. ఏప్రిల్ మూడ‌వ వారంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు


నటీ నటులు: విజయ్‌ శంకర్, అషూ రెడ్డి, సుహాసిని, భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి...


సాంకేతిక బృందం

డైరెక్టర్‌: జి. సూర్యతేజ

నిర్మాణం: రిలాక్స్‌ మూవీ మేకర్స్‌

సమర్ఫణ: స్కైరా క్రియేష‌న్స్‌

ఎడిటర్‌: సత్య. జీ

డీఓపీ: జే. ప్రభాకర్‌ రెడ్డి

సంగీతం: వినోద్‌ యజమాన్య

లిరిసిస్ట్: కాస‌ర్ల శ్యాం

పీఆర్ఓ: సిద్ధు


Share this article :