Home » » Ghani Releasing on February 25th

Ghani Releasing on February 25th

 ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ 'గని' సినిమా విడుదల..



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రోమియో జూలియట్ పాటకు సైతం మంచి స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.


నటీనటులు:

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద

సమర్పకుడు: అల్లు అరవింద్

సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సంగీతం: థమన్

పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను


Share this article :