తమన్నా పాటకు అదిరిపోయే రీల్ చేసిన ‘గని’ హీరోయిన్ సాయి మంజ్రేకర్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ‘కొడితే’కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది. ఆమె పాటకు రీల్స్ చేస్తున్నారందరూ. తమన్నా తన పాటకు తానే రీల్ చేసుకున్నారు. తాజాగా ఈ పాటకు హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. గని సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్ తేజ్. దీనికోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్స్‌తో కలిసి సినిమాలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని త్వరలోనే విడుదల కానుంది. ఈ మధ్యే హీరో వరుణ్ తేజ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సమర్పకుడు: అల్లు అరవింద్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్
పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను