Home » » Vijay Deverakonda is the New Brand Ambassador For Thumsup

Vijay Deverakonda is the New Brand Ambassador For Thumsup

 చిరంజీవి,మహేష్ బాబు తర్వాత విజయ్ దేవరకొండ రికార్డు.

థప్స్ అప్ అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా రౌడీ.



అతి తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకొని ప్యాన్ ఇండియా

స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ.తన స్టైల్, డిఫరెంట్ అటిట్యూడ్ తో యూత్

లో ఎనలేని ఫాాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.తన సినిమాల ద్వారానే కాకుండా

యాడ్స్ రూపంలో,సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులను పలకరిస్తుూనే

ఉంటాడు. ఇప్పుడు తన క్రేజ్ కు నిదర్శనం గా ఓ మంచి అవకాశం వెతుక్కుంటూ

వచ్చింది.


ఇకపై థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు రౌడీ స్టార్

విజయ్ దేవరకొండ. ఈ కూల్ డ్రింక్ ప్రచారకర్తగా విజయ్ బాధ్యతలు

తీసుకున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు థమ్స్

అప్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ తర్వాత

టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు మాత్రమే అవకాశం దక్కింది. ఇది మార్కెట్

పరంగా విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.


రౌడీ స్టార్ బ్రాండింగ్ చేస్తుండటంతో తమ ప్రాడక్ట్ మరింతగా ప్రజల్లోకి

వెళ్తుందని ఈ కంపెనీ భావిస్తోంది. థమ్స్ అప్ కు విజయ్ బ్రాండింగ్

చేస్తున్నారనే ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూఫాన్, రౌడీ ఫర్

థండర్ వంటి యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ యాడ్

మంగళవారం నుండి అఫీషియల్ గా సోషల్ మీడియా,టీవీలల్లో ప్రసారం కాబోతుంది.

ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ తదుపరి పలు క్రేజీ

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ చేశాడు.


Share this article :