"SR కళ్యాణమండపం Est 1975" మూవీ మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది - మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఆ పేరు వినగానే "RX 100" చిత్రం లోని పిల్లారా సాంగ్ గుర్తుకు వస్తుంది. ఆ పాట కుర్రకారును ఉర్రూతలుగించి ఆడియన్స్ లో ఏంతో బజ్ ను క్రీయేట్ చేసింది. ఆ తరువాత తను చేసిన 'మన్మధుడు2', 'ఆదిత్య 369', '7' సినిమాలతో తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మళ్లీ 'SR కళ్యాణమండపం – Est.1975' చిత్రం ద్వారా తన పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసి సంగీత ప్రియుల మనసులను దోచుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ‘ SR కళ్యాణమండపం' చిత్రం లోని పాటల విజయం గురించి సినీ పాత్రికేయుల సమావేశంలో తను మాట్లాడుతూ..
SR కళ్యాణమండపం ‘ లో మూడు డిఫ్రెంట్ సాంగ్స్ కు కంపోజింగ్ చేయడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆఫ్రిసియేట్స్ వస్తున్నాయి.
ఇంతకుముందు నేను చేసిన.RX 100 గుణ369, మన్మధుడు 2, 7 ఇలా ప్రతి సినిమా ఛాలెంజింగ్ గా తీసుకొని దర్శకుడి అభిప్రాయం మేరకు మ్యూజిక్ ఇచ్చాను.
హీరో కిరణ్ ఆబ్బవరం సూచన మేరకు హీరో ఇంట్రడక్షన్ సీన్ కు అల్ ఓల్డ్ సాంగ్స్ డి.జె. మిక్సింగ్ చేయడం జరిగింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా కిరణ్ ఐడియాలజీ తో చేశాం.ఆ క్రెడిట్ అంతా కిరణ్ కె చెందుతుంది.
ఈ సినిమాలోని పాటలు ఇంత పెద్ద హిట్ అవడానికి చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె, నిర్మాతలు ప్రమోద్, రాజు, హీరో కిరణ్ అబ్బవరం లే ప్రధాన కారణం. వీరిలో మంచి అభిరుచి ఉండడం వలనే పాటలతో పాటు సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.
ప్రతి సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెలోడీ కంటెంట్ మిస్సవకుండా జాగ్రత్త పడతాను. అలాగే ఆ సీన్ కు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత అవసరమో అంతే ఇస్తూ సీన్ కు మించి ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను.
ప్రతి సినిమా కూడా నా దృష్టి లో హిట్ సినిమా గానే బావిస్తాను. బాధలో వుండే మనిషికి హ్యాపీగా వుండే కంటెంట్ సినిమా చూపిస్తే నచ్చకపోవచ్చు, హ్యాపీగా వుండే మనిషికి బాధగా వుండే సినిమా నచ్చకపోవచ్చు.ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేము.
నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్టర్స్ శర్వానంద్, సిద్ధార్ద్ లు నటిస్తున్న `మహా సముద్రం` సినిమా చేస్తున్నాను. ఈ సినిమా నుండి 'రంభ రంభ' సాంగ్ ను విడుదల చేయడం జరిగింది..ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో నేను చేయబోయే మరిన్ని ప్రాజెక్ట్స్ విశేషాలు తెలియజేస్తానని ముగించారు.