Home » » Tremendous Response For Asmee Trailer

Tremendous Response For Asmee Trailer



 వినూత్న‌మైన రొమాంటిక్ థ్లిల్ల‌ర్ నేప‌థ్యంగా ప్రేక్ష‌కుల ముందుకి రాబోతున్న అశ్మీ, ట్రైల‌ర్ కి అనూహ్య స్పంద‌న‌


సాచీ క్రియేష‌న్స్ ప‌తాకం పై స్నేహా రాకేశ్ నిర్మాత‌గా, నూత‌న ద‌ర్శకుడు శేష్ కార్తీకేయ తెర‌కెక్కిస్తున్న చిత్ర అశ్మీ. పూర్తిగా వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో థ్లిల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుషికా రాజ్, రాజా నరేంద్ర‌, కేశ‌వ్ దీపిక లీడ్ రోల్స్ చేస్తున్నారు. అశ్మీ అనే టైటిల్ తో అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో, ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌లిగించింది. ఇప్ప‌టికే విడుద‌లైన ప‌బ్లిసిటి కంటెంట్ కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే అశ్మి చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ వినూత్న‌మైన థ్రిల్లింగ్ పాయింట్ ని తీసుకుని అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అశ్మీ చిత్రం ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాను దర్శ‌కుడు శేష్ కార్తికేయ రెడీ చేశార‌నే విష‌యం ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైల‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా నిర్మాత స్నేహా రాకేశ్ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు శేష్ కార్తీకేయ‌, ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి ఎజ్ ఆఫ్ ది సీట్ ఎక్స్ పీరియ‌న్స్ వచ్చేలా అత్యంత ఉత్కంఠ భ‌రితంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దిన‌ట్లుగా తెలిపారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొన్నీ ఈ సినిమా విడుద‌లకి సిద్ధం ఉంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి

న‌టీన‌టులు
రుషికా రాజ్, రాజా న‌రేంద్ర‌, కేశవ్ దీప‌క్

సాంకేతిక వ‌ర్గం

బ్యాన‌ర్ - సాచీ క్రియేష‌న్స్
నిర్మాత - స్నేహా రాకేశ్
ర‌చ‌న - ద‌ర్శ‌కత్వం, సినిమాటోగ్ర‌ఫి - శేష్ కార్తీకేయ‌
ఎడిటింగ్ - ప్ర‌వీణ్ పూడి
మ్యూజిక్ - శాండీ అద్దంకి
పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Share this article :