Home » » Good Response for Boys Teaser

Good Response for Boys Teaser

 


సెన్సేష‌న‌ల్ హీరోయిన్ సన్నీ లియోన్ విడుదల చేసిన‌ 'బాయ్స్' చిత్రం టీజర్ కు అనూహ్య స్పంద‌న‌


శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. ఈ నేప‌థ్యంలో తాజాగా  సెన్సేషనల్ హీరోయిన్ సన్నీ లియోన్ విడుద‌ల చేసిన బాయ్స్ టీజ‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. బాయ్స్ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ద‌యానంద్ ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ ల‌వ్ స్టోరీగా రెడీ చేశార‌నే విష‌యం ఈ టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. డైన‌మిక్ లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బెక్కం రవీందర్, కొండపతురి ప్రసాద్ ప్రొడక్షన్ మేనేజర్లుగా పని చేస్తున్నారు.


నటీనటులు:

గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: దయానంద్

బ్యానర్: శ్రీ పిక్చర్స్

నిర్మాత: మిత్రా శర్మ

సహ నిర్మాత: పడవల బాలచంద్ర

సంగీత దర్శకుడు: స్మరన్

గాయకుడు: రాహుల్ సిప్లిగంజ్

లిరిక్స్: శ్రీమణి

ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

కొరియోగ్రఫీ: జావేద్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

లిరికల్ వీడియో: సాయివిహార్ పంతంగి

ప్రొడక్షన్ డిజైన్: దిలీప్ జాన్, రవి మొండ్రు


Share this article :