Producer Dil Raju Clarification on Vakeel Saab OTT Release

 


"వకీల్ సాబ్" ఓటీటీ రిలీజ్ వార్తలన్నీ అబద్ధం - నిర్మాత దిల్ రాజు


'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ " సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అనే ప్రచారాన్ని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు  ఖండించారు. "వకీల్ సాబ్ " సినిమాను థియేటర్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని వారు కోరారు. 


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..వకీల్ సాబ్ సినిమాకు థియేటర్ లో సూపర్ రెస్పాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం అనే వార్తల్లో నిజం లేదు. ఇంత పెద్ద సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే ఆనందం ఓటీటీలో చూస్తే రాదు. ఏ స్టార్ హీరో సినిమా అయినా 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే రూల్ ఉంది. కాబట్టి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్ లో చూడండి. అన్నారు.


దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ... వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం లేదు. అలాంటి వార్తలన్నీ ఫేక్. పవర్ స్టార్ సినిమాను థియేటర్ లోనే చూడండి. అన్నారు.

Post a Comment

Previous Post Next Post