Ek love you Song Launched

 


ఉగాది పండుగ సందర్భంగా  ‘‘ఏక్ లవ్ యా’’ మూవీ నుండి 'కాలాన్ని మరచి' సాంగ్ రిలీజ్



హీరోయిన్ రక్షిత నిర్మాతగా మారి...తన తమ్ముడు రానా ను హీరోగా పరియచం చేస్తూ నాలుగు భాషల్లో నిర్మించిన సినిమా ‘‘ఏక్ లవ్ యా’’. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ‘‘ఏక్ లవ్ యా’’ మూవీకి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహించారు.


ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట సూపర్ హిట్ అయ్యింది. 5 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా  ‘‘ఏక్ లవ్ యా’’ మూవీ నుండి 'కాలాన్ని మరచి' అని సాగే సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది టీమ్. ఈ పాటను దర్శకుడు ప్రేమ్ పాడటం విశేషం. లవ్ మెలొడీస్ ను ఇష్టపడే వారికి 'కాలాన్ని మరచి' పాట బాగా నచ్చుతుంది.  ‘‘ఏక్ లవ్ యా’’ త్వరలో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.


నటీనటులు రానా, రీష్మ, రచితా రామ్. సాంకేతిక వర్గం: నిర్మాణం: రక్షిత ఫిలిం ఫ్యాక్టరీ, మ్యూజిక్: అర్జున్ జాన్య, నిర్మాత: రక్షిత,  రచన,దర్శకత్వం: జోగి ప్రేమ్.

Post a Comment

Previous Post Next Post