ఏప్రిల్ 2న రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన వైల్డ్ డాగ్
కింగ్ నాగార్జున దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ,అవిజిత్ దత్ ముఖ్య పాత్రధారులుగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అహిషోర్ సొలోమన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం వైల్డ్ డాగ్. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున, నటులు ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, కెమెరామెన్ షానియల్ డియో, చిత్ర దర్శకుడు అహిషోర్ సొలోమన్, నిర్మాత నిరంజన్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్స్ ఎన్ యం ఫాష, జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ లను, కొత్త టాలెంట్స్ ని, కొత్త డైరెక్టర్స్ ను ప్రోత్సహించడంలో నాగార్జున గారు ఎప్పుడు ముందుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో డిఫరెంట్ అప్రోచ్ తో సాగే సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీయడానికికారణం నాగార్జున ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు.. ఆయనకి నా స్పెషల్ థాంక్స్. ఇదొక ఎన్ ఐ ఎ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ లో ఎలా సక్సెస్ అయ్యారు.. వారి లైఫ్ ఎలావుంటుంది అనే అంశాలు అన్నీఈ చిత్రంలో చూపించాం. ఇంత పెద్ద స్పాన్ వున్న సినిమాని బిగ్ స్కేల్ లో తీయడానికి తోడుగా నేనుంటాను అని నాగార్జున ముందుకు వచ్చారు. నన్ను హీరోలా కాకుండా టీమ్ అందరికీ ఇంపార్టెన్స్ ఉండాలి అని ఆయన ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాదాపు సిటీస్లో, కంట్రీస్ లో 300 లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. 200 కాస్ట్యూమ్స్ చేంజ్ చేశాం. సాల్మన్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్ చెప్పాడు. ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రాన్ని ఎక్స్ క్లూజివ్ గా ధియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు.
దర్శకుడు అహిషోర్ సొలోమన్ మాట్లాడుతూ.. డిఫరెంట్ ఫిలిమ్స్ చేయాలి అనుకున్నప్పుడు నాగార్జున గారు, నిరంజన్ గారు బిగ్ సపోర్ట్ చేశారు.స్క్రిప్ట్ వినగానే నాగార్జున గారు చాల బాగుంది అన్నారు. యెన్ ఐ ఎ ఆపరేషన్ ఫిలిం. అందరికి నచ్చుతుంది మార్చ్ 10న ట్రైలర్ రిలీజ్ అవుతుంది.. అన్నారు.
కెమెరామెన్ షానియల్ డియో మాట్లాడుతూ.. సాల్మన్ స్క్రిప్ట్ చాలా బాగుంది.. నాగార్జున గారు మా అందరికి ఇన్స్పిరేషన్. ఆయన ఎనర్జీ లెవెల్స్ సూపర్బ్. నిరంజన్ గారు ఎక్స్ లెంట్ సపోర్ట్ చేశారు.. అన్నారు.
హీరోయిన్ సయామీ కేర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో చేయడం చాలా ఎక్సయిట్ గా అనిపించింది. సల్మాన్ మంచి రోల్ ఇచ్చారు. నాగార్జున గారిని చూసి సెట్లో చాలా నేర్చుకున్నాను. ఆయనతో స్క్రీన్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిరంజన్ గారికినా థాంక్స్ అన్నారు.
నటుడు ఆలీ రెజా మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో ఉండగా నాకు ఈ ప్రాజెక్టు గురించి నాగార్జున గారు చెప్పి ఈ చిత్రంలో నటించడానికిఆయన రికమండ్ చేశారు. నిరంజన్ గారి బ్యానర్ లో ఆక్ట్ చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ఈ టీం అందరితో యాక్ట్ చేయడం చాలా ఎనర్జీ, హంగర్ గా అనిపించింది. బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది నాకు. ఊపిరి సినిమా అప్పుడు సల్మాన్ పరిచయం. మనందరికీ సంబంధించిన కథ ఇది. హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్.. టెర్రరిస్ట్ నేపథ్యంలో సాగుతుంది. ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన వారు ఎక్కడున్నారు. వారిని ఎలా పట్టుకున్నారు. అనేది రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా తీయడం జరిగింది. ఒక చక్కని పుస్తకంలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్రింద పనిచేసే ఒక టీం ఆపరేషన్ ఎలా చేసింది.. వైల్డ్ డాగ్ దేనికైనా సిద్ధం.. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఇందులో రియల్ గన్స్ వాడాం. ఆర్య, సయామీ ర ఏజెంట్స్ గా నటించారు. ఒక మంచి సినిమా వస్తే ఆదరిస్తామని సంక్రాంతి కి వచ్చిన క్రాక్, రీసెంట్ గా వచ్చిన ఉప్పెన చిత్రాలను ప్రూవ్ చేశారు. ఇప్పుడు మా వైల్డ్ చిత్రాన్ని ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు.
Post a Comment