Kamalini About Shiridi Sai |Kamalini says acting in shiridi sai film is a bless.


ఆ పాత్ర చేయడం తన అదృష్టమనీ ... తన కెరియరులో మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని కమలిని ముఖర్జీ అంటోంది. ఆమె నటించిన 'శిరిడీసాయి' చిత్రం రేపు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'శిరిడీసాయి' సినిమాలో రాధాకృష్ణ మాయి గా కమలిని నటించింది. నిజ జీవితంలోను తాను సాయిబాబా భక్తురాలిననీ ... అలాంటి తనకి అటువంటి పాత్రే ఈ సినిమాలో లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ... నాగార్జున కాంబినేషన్లో నటించడం ఓ మరిచిపోలేని అనుభూతియని అంది. బాబా పాత్రలో నాగార్జున జీవించాడనీ ... ఆయన నటన తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పింది. గతంలో తాను చాలా సార్లు శిరిడీ వెళ్ళాననీ ... అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడికి వెళ్లడం ప్రత్యేకంగా అనిపించిందని అంది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలతో పెనవేసుకు పోతాయనీ ... కచ్చితంగా ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

Post a Comment

Previous Post Next Post