.jpg)
మహేష్ - వెంకటేష్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగ్ చివరి దశకి చేరుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతా - అంజలి కథానాయికలుగా అందాల సందడి చేయనున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాని సెప్టెంబర్ 28 న విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ కెరియర్లో సంచలన విజయంగా నమోదైన 'దూకుడు' చిత్రం కూడా పోయిన ఏడాది సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సెంటిమెంట్ కారణంగా ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. కుటుంబ కథా చిత్రంగా వస్తోన్న ఈ సినిమా, ఆ స్థాయి విజయాన్ని ఏ మేరకు అందుకోగలదనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
Post a Comment