Gabbarsingh antyakshari team meets powerstar pawankalayan


'గబ్బర్ సింగ్' సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తావన రాగానే అందరికీ పోలీస్ స్టేషన్లోని 'అంత్యాక్షరి' సీన్ గుర్తొస్తుంది. కొత్త ఆలోచనతో సరికొత్తగా చేసిన ఈ ప్రయోగం అనూహ్యమైన స్థాయిలో ప్రేక్షకులని అలరించింది. సహజత్వానికి దగ్గరగా మలచిన ఈ సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా ... పదే పదే తిరిగి వాళ్లని దియేటర్లకి రప్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
సాధారణంగా సినిమాల్లో కనిపించే చిల్లర రౌడీలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాంటిది ఈ ఒక్క సన్నివేశం కారణంగా అందులో నటించిన చాలా మంది చిన్న ఆర్టిస్టులకి మంచి క్రేజ్ రావడం విశేషం. తమకి ఇంతటి గుర్తింపు రావడానికి కారణమైన పవన్ పట్ల వాళ్ళెంతో కృతజ్ఞతతో ఉన్నారు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన కారణంగా వాళ్లంతా కలిసి పవన్ ఇంటికి వెళ్లి సరదాగా ఆయనని కలిశారు. పవన్ కూడా వాళ్ళందరిని ఆత్మీయంగా పలకరించి, వాళ్ల సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాన్ తో సరదాగా ఓ ఫోటో దిగారు.

Post a Comment

Previous Post Next Post