NTR postpones badsha shooting due to hot weather

 


 హైదరాబాదులోభానుడు ప్రతాపం వల్ల ఔట్ డోర్ సినిమా షూటింగులకి అంతరాయం కలుగుతోంది. ఈ వేడిని భరించలేకే యన్టీఆర్ కూడా తాజాగా తన కొత్త సినిమా షూటింగుని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో యన్టీఆర్ కథానాయకుడుగా రూపొందే 'బాద్ షా' చిత్రం షూటింగు, మొదట్లో వేసుకున్న షెడ్యుల్ ప్రకారం ఈ నెల 15 నుంచి హైదరాబాదులో జరగాల్సి వుంది. యన్టీఆర్, ఫైటర్లపై ఓ యాక్షన్ ఎపిసోడ్ ను హైదరాబాదులో ఔట్ డోర్ లో ప్లాన్ చేశారు.
         అయితే, ఎండ వేడిని భరించడం కష్టమని చెప్పి షూటింగుని జూలై మొదటి వారానికి వాయిదా వేసుకున్నారట. దీంతో ఇక జూలై ఒకటి నుంచి ఇటలీలో ఈ చిత్రం తొలి షెడ్యూలును ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో యన్టీఆర్ పక్కన కాజల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. 'గబ్బర్ సింగ్' చిత్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  

Post a Comment

Previous Post Next Post