తెలుగు తెరపై కొత్త రికార్డులను కొలువుదీర్చిన 'గబ్బర్ సింగ్' త్వరలో ఓ వేడుక జరుపుకోబోతున్నాడు. ఈ సినిమా ఆడియో పరంగా కూడా సంచలనమైన అమ్మకాలు జరిగిన సందర్భంగా 'హెక్సా ప్లాటినం డిస్క్' ఫంక్షన్ ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ విజయంలో పాలు పంచుకున్న వారికి ప్రదానం చేసే షీల్డ్స్ ను ప్రత్యేకంగా, అందంగా డిజైన్ చేయించడం జరిగిందని చెబుతున్నారు. మే 31 న నిర్వహించవలసిన ఈ వేడుక అనుకోని కారణాల వల్ల వాయిదా పడటం జరిగింది. త్వరలోనే ఈ వేడుకకి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఫంక్షన్ కి పవన్ కూడా రానుండటంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. | ||||
Post a Comment