అందం కోసం తపన

 
 మోడల్ గా ... టీవీయాంకర్ గా తనదైన ముద్ర వేసిన శ్వేతామీనన్, ఆ తరువాత చిత్ర పరిశ్రమవైపు అడుగులు వేసింది. తమిళ ... మలయాళ ... హిందీ భాషా ప్రేక్షకులని ఓ ఊపువూపింది. 'రతి నిర్వేదం' ... 'ఏకవీర' ... 'రాజన్న' చిత్రాల ద్వారా ఇటీవలే తెలుగు ప్రేక్షకులకి కూడా శ్వేతామీనన్ పరిచయమైంది. ఈ మధ్య కాలంలో ఆమె 'అరవాన్' ... 'ఇదర మదురం' ... 'ఒసిమురి' వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాల్లో తనకి శృంగార ప్రధానమైన పాత్రలే దక్కడంతో ఆమె చాలా అసంతృప్తికి గురైందట. రెండేళ్ల క్రితం వరకూ హీరోయిన్ గా కొనసాగిన తనకి ఇదేం ఖర్మ అనుకుని ఆలోచనలో పడింది. తాను కాస్త లావుగా కనిపిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమనే విషయం ఆమెకి అర్ధమైపోయింది. దాంతో సన్నబడటానికి సంబంధించిన ట్రీట్ మెంట్ కోసం, ఐరోపా వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నట్టు చెబుతోంది. సన్నబడితే పూర్వ వైభవాన్ని సంపాదించుకోవచ్చని ఈ సుందరి చేస్తోన్న ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి మరి.

Post a Comment

Previous Post Next Post