.jpg)
రవితేజ కధానాయకుడుగా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం `దేవుడు చేసిన మనుషులు`. ఈ రోజు ఊదయం 8.10 నిమిషాలకు పూరి జగన్నాధ్ కార్యాలయంలో ప్రారంభమైంది. రవితేజ దేవుని పటాలకు నమస్కరించడాన్ని తొలి షాట్‌గా చిత్రీకరించారు. ఈ ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా, కో ప్రొడ్యూసర్ బాపినీడు కెమెరా స్విచ్ అన్ చేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ; పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో నేను చేస్తున్న 5వ సినిమా `దేవుడు చేసిన మనుషులు`. ఈ కధ వినగానే ఎంతో ఇన్‌స్పైర్ అయ్యాను. జగన్ కాంబినేషన్‌లో మరో మంచి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అందరిని అలరిస్తుంది ఈ సినిమా. జగన్‌తో చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది అని అన్నారు. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ; `దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి` అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది. మా కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం మంచి హిట్ చిత్రం అవుతుంది అన్నారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ; ఈ సినిమా `ఇడియట్` వంటి పెద్ద రేంజ్ సినిమా అవుతుంది. మార్చి 2నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. జూన్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని అన్నారు. ఈ సినిమాకు రఘుకుంచె సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 4 పాటలు సిద్దం చేసాడు
Post a Comment