Home » » Hello Yevaru Ready For Release

Hello Yevaru Ready For Release

ముస్తాబవుతోన్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 'హ‌లో ఎవ‌రు?' చిత్రం



తెలుగు తెర‌పైకి మ‌రో స‌ర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ రాబోతోంది. శ్రీ‌శివ‌సాయి ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై, మ‌హేశ్వ‌రి నందిరెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో, వెంక‌ట్‌రెడ్డి నంది ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కించిన చిత్రం 'హ‌లో ఎవ‌రు?.  ఈ సినిమా ద్వారా హీరో విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం - హీరోయిన్ సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ ,విలన్ గా వినాయక్ ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. 

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డ‌బ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ ప‌నులు జరుపుకుంటోంది.


ఈ క్రైం ఆండ్ హ‌ర‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్టు ద‌ర్శ‌కనిర్మాత‌ వెంక‌ట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని, ఇండ‌స్ట్రీలో ఈ చిత్రానికి స్పెష‌ల్ క్రేజ్ రావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తం చేశారు. మే నెల‌లో 'హ‌లో ఎవ‌రు?' చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. 


న‌టీన‌టులు:

 విజ‌య్ పాపిరెడ్డి క‌ట‌కం(హీరో), సౌమ్య‌శ్రీ ఉంత‌క‌ల్ (హీరోయిన్), వినాయ‌క్ (విలన్ ), గాదె స‌తీష్, యుగ దుర్గ‌ న‌రేష్ , వేద‌శ్రీ మ‌ల్ల‌, చిత్రం శ్రీ‌ను, ఘ‌ర్ష‌ణ శ్రీ‌నివాస్, బ‌స్టాప్ కోటేశ్వ‌ర‌రావు, జ‌బ‌ర్‌ద‌స్త్ రాజ‌మౌళి, గ‌బ్బ‌ర్ సింగ్ సాయి, గ‌బ్బ‌ర్ సింగ్ డూప్ రాజ‌శేఖ‌ర్ త‌దిరులు న‌టించారు. 


డైలాగ్ రైట‌ర్: ఎల‌కం వీర‌బ్ర‌హ్మ‌

కో-డైరెక్ట‌ర్: అందెల చిరంజీవి

ఎడిటింగ్: సాయి కుమార్ ఆకుల‌, న‌రేష్ దొర‌ప‌ల్లి

డీవోపీ: పి.శ్రీ‌నివాస్ 

మ్యూజిక్ డైరెక్ట‌ర్: డ్ర‌మ్స్ రాము 

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌: వెంక‌ట్‌రెడ్డి నంది 


Share this article :