Home » » Ninne Chusthu Audio Album Launched by Music Director Manisharma

Ninne Chusthu Audio Album Launched by Music Director Manisharma

 ప్రముఖ సంగీత దర్శకుడు మణి శర్మ చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదలైన "నిన్నే చూస్తు".. ఆడియో ఆల్బమ్
వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్లో, శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా,కే. గోవర్ధనరావు దర్శకత్వంలో, పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన  చిత్రం “నిన్నే చూస్తు” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా  'నిన్నే చూస్తు' ఆడియోను ప్రముఖ సంగీత  దర్శకుడు మణిశర్మ గారు గ్రాండ్ గా విడుదల చేశారు. దసరాను పురస్కరించుకొని ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియా, యు ట్యూబ్ లలో మ్యూజిక్ లవర్స్ ను అలరించడానికి వస్తున్న నిన్నే చూస్తు ఆడియో జూక్ బాక్స్ ను మ్యాంగో మ్యూజిక్ ద్వారా  విడుదల చేస్తున్నారు .ఈ పాటలలోని రిధమ్స్ , బీట్స్‌  శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ‘ఈ పాటలకు రమణ్ రాథోడ్  అందించిన సంగీతం సూపర్భ్‌ అనే చెప్పాలి. ‘ప్తస్తుతం మంచి పాటలు వస్తేనే ఊగిపోతున్న శ్రోతలు…ఇప్పుడు  ఏకంగా ఈ జ్యూక్‌ బ్యాక్స్‌లో 6 పాటలు ఉండగా.. ఈ ఆరు పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉండబోతుండటం విశేషం. సో…‘నిన్నే చూస్తూ.. పాటలను లూప్‌లో పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాందించేందుకు ప్రేక్షకులు రెడీ అయిపోండి. అలాగే 'నిన్నే చూస్తు' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల చివరి వారంలో విడుదలకు  సిద్దమైన సందర్బంగాచిత్ర నిర్మాత హేమలత రెడ్డి గారు మాట్లాడుతూ...."నిన్నే చూస్తు "..ఆడియోను మణిశర్మ గారు రిలీజ్ చేయడం  చాలా సంతోషంగా ఉంది.  కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని చిత్రీకరించాము. సీనియర్ నటులు సుమన్ ,సుహాసిని, బాను చందర్, సాయాజి షిండే గార్లు సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. దర్శకుడు కె గోవర్ధన్ రావు నాకు చెప్పిన కథను చాలా బాగా తెరాకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ రమణ్ రాథోడ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో ఉన్న ఆరు డిఫరెంట్  పాటలకు డేగ మార్కండేయ, రమణ లోక్, సాగర్ నారాయణ, సాహితి లు లిరిక్స్ అందించగా  ప్రముఖ  సింగర్స్ శ్రేయా ఘోషల్  జస్సీ గిఫ్ట్, శ్రావణ భార్గవి, యాజిన్ నిజర్ , సాహితి చాగంటి, తేజస్విని లు  ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా చాలా చక్కగా ఆలపించారు.ఈ పాటలు మాకు కచ్చితంగా మంచి పేరు తీసుకువస్తాయి. ఈ నెల 21 న ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ జరుపుకొని చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాము అన్నారు.చిత్ర దర్శకుడు కె గోవర్ధనరావు మాట్లాడుతూ...ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని చెప్పే ప్రేమకథా చిత్రానికి సీనియర్ యాక్టర్స్ ను సుమన్, సుహాసిని, బాను చందర్, షియాజి సిండే, కిన్నెర వంటి వారు  వర్క్ చేయడం  చాలా సంతోషంగా ఉంది.అలాగే వీరందరినీ డైరెక్షన్ చేసే అవకాశం కల్పించిన నిర్మాత హేమలత రెడ్డి గారికి కృతజ్ఞతలు అని అన్నారు.
నటీనటులు:

శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలతా రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే,  భానుచందర్, కిన్నెర, జబర్దస్తు మహేష్ తదితరులు.సాంకేతిక నిపుణులు

ప్రొడ్యూసర్ : పోతిరెడ్డి హేమలత రెడ్డి

డైరెక్టర్ : కె గోవర్ధన్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ్ రాథోడ్

డిఓపి : ఈదర ప్రసాద్

లిరిక్స్ : డేగ మార్కండేయ, రమణ లోక్, సాగర్ నారాయణ, సాహితి

పి. ఆర్. ఓ : మధు వి. ఆర్

సింగర్స్ : శ్రేయా ఘోషల్  జస్సీ గిఫ్ట్, శ్రావణ భార్గవి, యాజిన్ నిజర్ , సాహితి చాగంటి, తేజస్విని

కీబోర్డ్ అండ్ రిథమ్ : వైడి, కనకేష్  రాథోడ్

ఫ్లూట్ : రమణ చంద్రమూర్తి

గిటార్ : సుభాని

వీణ : ఫణి నారాయణ

బాస్ గిటార్ : మని

రికార్డింగ్ స్టూడియో :

అన్న ల్యాబ్ - ఇంజనీర్ సురేష్ (హైదరాబాద్)

కృష్ణ డిజి డిజైన్ - ఇంజనీర్ రాకేష్ (చెన్నై)

టూ కీస్ రికార్డింగ్ స్టూడియో -ఇంజనీర్ రాకేష్ కన్నా (చెన్నై)

ఫైనల్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ : వేణుగోపాల్Share this article :