Home » » Ranga Ranga Vaibhavamga Pre Release Event Held Grandly

Ranga Ranga Vaibhavamga Pre Release Event Held Grandly

పవన్ కళ్యాణ్‌గారి పుట్టిన‌రోజున విడుద‌లవుతోన్న ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి :  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయిధ‌ర‌మ్ తేజ్‌.. వ‌రుణ్ తేజ్‌



‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో..  తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో...


సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మళ్లీ ఇలా రావడం అనేది నా అదృష్టం. మళ్లీ వస్తాను అని అనుకోలేదు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా ఫ్యామిలీకి అక్క (సుమ) ఎంతో హెల్ప్ చేసింది. ఏరా వైష్ణవ్.. కేతికతో అంత క్లోజా నువ్వు..నాకు కాస్త షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ వచ్చింది.. గిరీశాయకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. దేవీ గారు ఇంత మంచి పాటలు అందించినందుకు థాంక్స్. టైటిల్ ట్రాక్ నాకు చాలా ఇష్టం. శ్యామ్ గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను.. మా ప్రసాద్ గారు నాకు మంచి చిత్రాన్ని ఇచ్చారు. సోలో బ్రతుకే సో బెటర్. ఇప్పటికీ నేనూ అదే మాట మీదున్నాను.. మీరుంటారా?.. కన్ను కొడితే మీరే ముందు పడేలా ఉన్నారు.. మా నిర్మాతలు మాకు ఫ్యామిలీ వంటి వారు.


కేతిక చాలా అందంగా ఉంది. ఆమెకు ఆల్ ది బెస్ట్.  2021 లక్కీ ఇయర్.. ఉప్పెనతో హిట్ కొట్టాడు.. డెబ్యూతో సక్సెస్ అయింది.. వైష్ణవ్‌ను యాక్సెప్ట్ చేశారు.. థాంక్స్ టు ఆడియెన్స్. నా సినిమా రిలీజ్‌కు ముందే యాక్సిడెంట్ అయింది.. ఏం జరుగుతోందో నాకు తెలీదు.. నేను పడుకుని ఉన్నాను.. నా తమ్ముడు.. అన్నా అని పిలస్తే పలకలేకపోయాను.. మనం ఉన్నప్పుడు కలిసి ఉంటే.. ఎంత బాగుంటుంది.. మా తమ్ముడు, అమ్మ, నాన్న ఇలా కలిసి ఉంటే ఎంత బాగుందో నాకు అర్థమైంది.. నాకు ధైర్యం వచ్చింది. వాళ్లే నా బలం.


సినిమా హిట్ అవుతదా? బ్లాక్ బస్టర్ అవుతదా? అన్నది నాకు తెలీదు.. మీరు మా తమ్ముడిని యాక్సెప్ట్ చేశారు..అదే నాకు చాలు..వైషూ.. ఫస్ట్ సినిమాలోనే రొమాంటిక్ సాంగ్.. ఇప్పుడు కొత్తగా లేదంటి సాంగ్.. మాస్టర్ ఆఫ్ రొమాన్స్ నువ్వే కదా?.. స్టేజ్ మీదకు ఎక్కినా, కింద ఉన్నా కూడా వీడ్ని ఏడిపించడం నాకు ఇష్టం.. వీడు నవ్వుతుంటే నాకు ఇష్టం.. అదే నాకు సంతోషం.. అదే మన హ్యాపీనెస్.. మీ అందరి మొహాల్లో నవ్వు కనిపిస్తోంది.. అదే నా హ్యాపీనెస్.. ఒట్టేసి చెబుతున్నా.. అదే నా హ్యాపీ నెస్.. నేనేమీ 90 వేయలేదు.. నాకు తాగడం అలవాటు లేదు.. నా తమ్ముడు మంచి యాక్టర్ అని నాకు అనిపిస్తోంది.. సెప్టెంబర్ 2న థియేటర్లకు వెళ్లి మా తమ్ముడి సినిమాను హిట్ చేయండి..


మీ అందరికీ పవర్ స్టార్.. నాకు ఆయన గురువు గారు.. నా గురువు పుట్టిన రోజు.. సినిమా చూడండి.. ఆయన పేరు మీద బర్త్ డే పార్టీ చేసుకోండి.. దయచేసి.. మీ అందరూ బైక్స్ నడుపుతుంటారు కదా? హెల్మెట్ పెట్టుకోండి.. ఆ హెల్మెట్ వల్లే నేను బతికి ఉన్నాను.. చేతులెత్తి మరీ జోడిస్తున్నాను.. హెల్మెట్ ధరించండి.. ఇసుక ఉంటే నేనేం చేస్తాను.. మన విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.. అందరూ హెల్మెట్ ధరించండి.. మన అందరి తరుపున పవర్ స్టార్ గారికి బర్త్ డే విషెస్ చెబుతున్నాను.. సెప్టెంబర్ 2న రంగ రంగ వైభవంగా రిలీజ్ అవుతోంది అందరూ చూడండి’’ అని అన్నారు. 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ  ‘‘ఇలా ఈ ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. ఫంక్షన్ అంటే ఫార్మల్‌గా రావాలి. కానీ ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్. బాపినీడు గారితో ఇది వరకు ఎన్నో చిత్రాలు చేశారు. మా అందరితో సినిమాలు చేశారు. కానీ చిరంజీవి గారితో చేయలేదని అన్నారు. త్వరలోనే ఆ కోరిక కూడా తీరాలి. గిరీశాయతో రెండు మూడు సార్లు పని చేసే చాన్స్ నాకు వచ్చింది. ఏం చేయాలన్నదానిపై ఆయనకు చాలా క్లారిటీ ఉంది. నేను చూసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని అనిపిస్తోంది.


లవ్ స్టోరీలకు మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చిన డీఎస్పీకి థాంక్స్. విజువల్స్ ఎంతో ఫ్రెష్‌గా అనిపించాయి. లవ్ స్టోరీ బాగుండాలంటే లీడ్ పెయిర్ బాగుండాలి. వైష్ణవ్, కేతిక ఇద్దరూ బాగున్నారు. మీ ఇద్దరికీ ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. కేతిక వస్తే కుర్రాళ్లు అరిచేస్తున్నారు.


వైష్ణవ్ నా లిటిల్ బ్రదర్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంతో కష్టపడుతుంటాడు. పక్కోడికి హెల్ప్ చేస్తుంటాడు. మంచి చిత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. లాస్ట్ ఇయర్ నుంచి సినిమా రిలీజ్ డేట్స్ మారుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు బాబాయ్ బర్త్ డే పడటం లక్. ట్రైలర్‌లో కూడా వైష్ణవ్‌లో కళ్యాణ్ బాబాయ్ అక్కడక్కడా కనిపించాడు.. ఈ చిత్రం పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. 


వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ ‘‘మా అమ్మకు,  ఇక్కడకు వచ్చిన మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మా ఇద్దరన్నయ్యలకు థాంక్స్. మా సినిమాను బ్లెస్ చేసేందుకు వచ్చిన వారిద్దరికీ ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. మా దర్శకుడు గిరి గారికి ఎన్ని సార్లు ఛేంజెస్ చెప్పినా కూడా చేశారు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను సారీ. నటనలో నాకు ఎంతో సాయం చేశారు. గిరి డైరెక్షన్ టీం నాకు ఎంతో సాయంగా నిలిచింది.


ఉప్పెన నుంచి శ్యాం గారితో పని చేశాను. ఆయనతో నాకు ఎంతో క్లోజ్ రిలేషన్ ఏర్పడింది. ఆయన టీం కూడా నన్ను బాగా చూసుకుంది. కేతిక వల్లే ఈ సినిమాలో యాక్టింగ్ ఈజీగా అనిపించింది. కేతిక వల్లే నా సిగ్గు అంతా పోయింది. నాకు సపోర్ట్‌గా ఉన్న కేతికకు థాంక్స్. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఉప్పెన తరువాత డీఎస్పీ గారు మళ్లీ నా సినిమాకు కొట్టడం అదృష్టం. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ గారికి థాంక్స్. మా నిర్మాత బాపీనిడు అంకుల్‌కు థాంక్స్. ఎప్పుడూ యూత్ ఫుల్‌గా ఉంటారు. సినిమా కోసం ఎంతో పని చేస్తుంటారు.


కొత్త కొత్త కథలు వస్తున్నాయ్.. ఇందులో ఏముందని అందరూ అడుగుతున్నారు. కానీ ఈ కథ విన్నప్పటి నుంచి ఓ జెన్యూన్ ఫీలింగ్ అనిపించింది. మీరు పెట్టే డబ్బులకు సరిపడా చిత్రమని నాకు అనిపిస్తోంది. నా ఫ్రెండ్స్‌గా నటించిన వారందరికీ థాంక్స్. అందరి నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. అందరూ నన్ను ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. సెప్టెంబర్ 2న మా చిత్రం రాబోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనే చిత్రం కూడా రాబోతోంది. మా రెండు చిత్రాలను ఎంకరేజ్ చేయండి.. సెప్టెంబర్ 2న ఒక పెద్ద పండుగ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్ డే. హ్యాపీ బర్త్ డే మామయ్య.. ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు.. మనం ఫాలో అవ్వడమే’’ అన్నారు. 


నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘మాముగ్గురు తేజ్‌లు ఈవెంట్‌కు రావ‌టంతో తేజ‌స్పుగా ఉంది. అది చూస్తుంటే నాకు చాలా హ్య‌పీగా ఉంది. మెగా ఫ్యామిలీలో అంద‌రితో సినిమాలు చేశాను. అంద‌రితో క‌లిసి వ‌ర్క్ చేశాను. రంగ రంగ వైభ‌వంగా కూడా క‌చ్చితంగా హిట్ అవుతుంది. మా హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన మ్యూజిక్‌ను ఇచ్చారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


చిత్ర దర్శ‌కుడు గిరీశాయ మాట్లాడుతూ ‘‘‘రంగ రంగ వైభవంగా’ సినిమా గురించి చెప్పాలంటే ముందు మా హీరో వైష్ణవ్ గురించి చెప్పాలి. తను నిజాయతీగల వ్యక్తి. మాటిస్తే దానిపై నిలబడే రకం. జనవరి 2021లో నాకు సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. ఒక నెల‌లో ఉప్పెన సినిమా రిలీజైంది. వంద కోట్ల పోస్ట‌ర్ కూడా ప‌డింది. అంత పెద్ద హిట్ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌తో సినిమా చేయ‌టానికి చాలా మంచి పెద్ద దర్శ‌కులు రెడీగా ఉన్నారు. కానీ గిరికి మాటిచ్చాన‌ని చెప్పి నాతో సినిమా చేశారు. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. డైరెక్ట‌ర్‌గా నాకు ఆయ‌నిచ్చిన రెస్పెక్ట్‌కి స్పెల్ బౌండ్ అయ్యాను. ఎక్క‌డా ఇబ్బంది పెట్ట‌కుండా స‌పోర్ట్ చేసి సినిమాను పూర్తి చేశారు. 


ఇగోస్ లేని ఏ రిలేష‌న్ షిప్ అయినా రంగ రంగ వైభ‌వంగా ఉంటుంద‌ని చెప్ప‌ట‌మే మా సినిమా. మా సినిమాలో రాధా.. రిషిల‌కు ఇగోలు చాలా ఎక్కువ‌. మా ఫ్యామిలీలో తిరిగే అబ్బాయిలా వైష్ణ‌వ్ క‌నిపిస్తారు. చాలా ఇష్ట‌ప‌డి చేశారు. త‌న ఎన‌ర్జీనే సినిమాకు మెయిన్ ఎసెట్‌. రాధ పాత్ర‌ను చ‌క్క‌గా రాసుకున్నారు. త‌న పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. కేతిక పాత్ర‌ను అర్థం చేసుకుని, నేర్చుకుని న‌టించింది. అద్భుత‌మైన న‌టి. మా నిర్మాత ప్ర‌సాద్‌గారు ఫ్రెండ్లీ  ప్రొఫెస‌ర్‌లాంటివారు. మా వెనుకుండి మ‌మ్మ‌ల్లి ముందుకు న‌డిపించారు. అలాగే బాపినీడుగారిని అన్న అని పిలుస్తుంటాను. తెలియ‌కుండానే ఆయ‌న‌కు అంత ద‌గ్గ‌ర‌య్యాను. డిఎస్‌పిగారికి నేను పెద్ద ప్యాన్‌. నేను చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం నా అదృష్టం. అర్జున్ ప్ర‌సాద్ క్యారెక్ట‌ర్ చేసిన న‌వీన్ చంద్ర‌గారికి థాంక్స్‌. గౌర‌వం తీసుకొచ్చే పాత్ర‌లో న‌టించారు. న‌రేష్‌గారు, ప్ర‌భుగారు, తుల‌సిగారు.. ఇలా అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. ఆలీగారు, నాగ‌బాబు అడగ్గానే న‌టించి మా సినిమా స్థాయిని పెంచారు. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్‌గారి వ‌ల్ల 75 రోజుల్లోనే ఇంత పెద్ద సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాను. అలాగే ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్‌గారికి, ఎడిట‌ర్ చంటిగారికి థాంక్స్‌. ఈ జ‌ర్నీలో స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారి పుట్టిన‌రోజు..సెప్టెంబ‌ర్ 2న మా సినిమా రిలీజ్ కావ‌టం మా అదృష్టం’’ అన్నారు. 


హీరోయిన్ కేతికా శర్మ మాట్లాడుతూ ‘‘వేడుకకి వచ్చిన వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌కి థాంక్స్‌. అలాగే మా ద‌ర్శ‌కుడు గిరీశాయ‌గారికి స్పెష‌ల్ థాంక్స్‌. చాలా మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రూపొందించిన ‘రంగ రంగ వైభవంగా’లో రాధ పాత్ర‌ను నాకు ఇచ్చారు. అలాగే మా నిర్మాత‌లు ప్ర‌సాద్‌గారు, బాపినీడుగారికి థాంక్స్‌. శ్యామ్ ద‌త్‌గారు చ‌క్క‌గా చూపించారు. వైష్ణవ్ తేజ్‌.. చాలా మంచి కోస్టార్‌. స్పీట్ ప‌ర్స‌న్‌. మా సినిమాలో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌’’ అన్నారు.



Share this article :