Home » » Vijay Antony "Hatya" Movie Trailer Released

Vijay Antony "Hatya" Movie Trailer Released

సందడిగా విజయ్ ఆంటోనీ 'హత్య' ట్రైలర్ విడుదల కార్యక్రమం, ట్రైలర్ రిలీజ్

చేసిన నాచురల్ స్టార్ నాని



తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'హత్య'. ఇన్వెస్టిగేటివ్

థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో

విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర

పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ

నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్

బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్,

ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం

వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా

విడుదల చేయగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సందడిగా ప్రెస్ మీట్

నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు,

నిశ్శబ్ధం చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు అతిథులుగా

పాల్గొన్నారు. ఈ సందర్భంగా


నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి

మార్కెట్ ఉంది. ఆయన బిచ్చగాడు సినిమా తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ

వసూళ్లు సాధించింది. ఆయన ఇటీవల తెలుగులో తన సినిమాల ప్రమోషన్ తగ్గించారు.

విజయ్ ఆంటోనీ రీసెంట్ సినిమా కిల్లర్ కూడా నాకు బాగా నచ్చింది.

నాలుగేళ్లు బాహుబలికి కష్టపడ్డారు కాబట్టే అంత ఘన విజయం దక్కింది. అలాగే

ఈ సినిమాకు కూడా కావాల్సినంత సమయం తీసుకుని క్వాలిటీ మూవీ చేశారు.

ట్రైలర్ చూస్తే సినిమా క్వాలిటీ అర్థమవుతోంది. విజయ్ ఆంటోనీకి ఈ చిత్రంతో

మంచి సక్సెస్ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.


నాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ...నా కెరీర్ లో సైన్ చేసిన మొదటి సినిమా

ఇది. తమిళంలో ఈ చిత్రంతో అరంగేట్రం చేస్తున్నాను. నాకు ఇదొక డ్రీమ్ మూవీ

అనుకోవచ్చు. ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్ తో కోలీవుడ్ లోకి ఎంటర్ అవుతానని

అనుకోలేదు. తెలుగులో మాత్రం నా మూడవ చిత్రంగా విడుదలవుతోంది. ఇందులో నాకు

అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా దర్శకుడి కలకు ప్రతిరూపం.

ప్రతి టెక్నీషియన్ బ్రిలియంట్ గా వర్క్ చేశారు. విజయ్ ఆంటోనీతో కలిసి

నటించడం ఆనందంగా ఉంది. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా. హత్య ఒక

స్పెషల్ ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది. అన్నారు.


హీరోయిన్ రితికా సింగ్ మాట్లాడుతూ...చిన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే

కల ఉండెేది. కానీ బాక్సర్,  హీరోయిన్ అయ్యాను. దర్శకుడు ఈ కథ చెప్పి, నా

క్యారెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. నా

డ్రీమ్ రోల్ ఇది. నా మేకోవర్ కూడా స్టైలిష్ గా డిజైన్ చేశారు. మీనాక్షితో

నాకు ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఆమె ఎంతో సపోర్టివ్ గా ఉంది. హీరో విజయ్

ఆంటోనీలో ఎక్కడా తానొక పేరున్న హీరో అనే ఆటిట్యూడ్ కనిపించదు. టీమ్ అంతా

సినిమా కోసం కంఫర్ట్ గా పనిచేసేలా చూసుకున్నారు. అని చెప్పింది.


నిర్మాత జి ధనుంజయన్ మాట్లాడుతూ...విజయ్ ఆంటోనీ గారితో మేము ఐదు చిత్రాలు

చేస్తున్నాము. గతంలో విజయ రాఘవన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు హత్య, త్వరలో

దోషి అనే మరో మూవీ నిర్మిస్తున్నాము. ఈ కథను మంచి క్వాలిటీ ఫిల్మ్ గా

చేద్దామని విజయ్ గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. కథ విన్నాక మాకూ అంతే

ఇన్ స్పైరింగ్ గా అనిపించింది. గిరీష్ గోపాలకృష్ణన్ ఇంటర్నేషనల్ మూవీ

స్థాయి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పూర్తిగా దర్శకుడి విజన్

అనుకోవచ్చు. ఆయన అడిగినంత సమయాన్ని ఇచ్చి ఓ మంచి చిత్రాన్ని నిర్మించాం.

ప్రొడక్షన్ లో ఎక్కడా రాజీ పడలేదు. ఆ క్వాలిటీని రేపు సినిమాలో మీరంతా

చూస్తారు.అన్నారు.


నిర్మాత సిద్ధార్థ్ శంకర్ మాట్లాడుతూ...విజయ్ ఆంటోనీ  బేతాళుడు చిత్రంలో

నాకొక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను ఆయనతో ప్రొడ్యూస్

చేయడం సంతోషంగా ఉంది. టీమ్ అంతా ఒక మంచి మూవీ కోసం కష్టపడ్డారు. త్వరలోనే

సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.


సంగీత దర్శకుడు గిరీష్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ...నేను గతంలో తెలుగులో

నిశ్శబ్ధం చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాను. హత్య చిత్రాన్ని

పాన్ ఇండియా అనడం కంటే పాన్ వరల్డ్ మూవీ అని పిలవడం కరెక్ట్. ప్రపంచంలోని

ఏ భాషలో విడుదల చేసినా ఈ సినిమా ఆదరణ పొందుతుంది. అంత కంటెంట్ ఈ చిత్రంలో

ఉంది. అన్ని ఇండస్ట్రీల్లో టాలీవుడ్ స్పెషల్ ఎందుకంటే ఇక్కడ మంచి

చిత్రాలను భాషా హద్దులకు అతీతంగా చూస్తారు. ఈ థ్రిల్లర్ మూవీలో మీకు

కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ మేకింగ్ కు తగినట్లే సంగీతాన్ని

అందించాను.


దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ...హత్య సినిమా ఒక టిపికల్ మర్డర్

మిస్టరీ. లైలా అనే అమ్మాయి మర్డర్ నేపథ్యంతో సాగుతుంది. ఆ హత్య ఎవరు

చేశారు, ఎలా చేశారు అనే ప్రశ్నలు కథలో కీలకంగా ఉంటాయి. మొత్తంగా చూస్తే

విజయ్ ఆంటోనీ కంటే కొద్దిగా రితికా క్యారెక్టర్ కు వెయిట్ ఉంటుంది. అలాగే

లైలా గా మీనాక్షి కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె క్యారెక్టర్ మర్డర్

ఇన్వెస్టిగేషన్ చుట్టూనే కథ తిరుగుతుంది. సినిమాలో మిమ్మల్ని సర్ ప్రైజ్

చేసే అంశాలెన్నో ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ కు ఏడాది సమయం తీసుకుని

చేశామంటే క్వాలిటీ కోసం మేము ఎంత ప్రయత్నించామో అర్థం చేసుకోవచ్చు.

అన్నారు.


హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ..మా దర్శకుడు బాలాజీ కుమార్ ఆల్ రౌండర్ అని

చెప్పాలి. ఆయనకు ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ...ఇలా ప్రతి క్రాఫ్ట్ మీద

పట్టుంది. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా స్టార్స్ తో సినిమా చేయగల సత్తా

ఆయనకుంది. ఈ చిత్రాన్ని వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కించారు. లోటస్

పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థల్లో నటించడం సంతోషంగా ఉంది.

వాళ్లతో మరిన్ని చిత్రాలు చేస్తాను. ఇతర భాష నుంచి వచ్చినా మమ్మల్ని

తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్లకు థాంక్స్. సంగీత దర్శకుడు

గిరీష్ హాలీవుడ్ స్థాయి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మర్డర్ మిస్టరీ మూవీ

మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. అన్నారు.


ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, జాన్ విజయ్, రాదికా

శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్

బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ

అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్

గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.



Share this article :