Home » » Actress Sai Pallavi Interview About Virata Parvam

Actress Sai Pallavi Interview About Virata Parvam

 విరాట పర్వం ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సాయి పల్లవి ఇంటర్వ్యూ 



పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం 'విరాటపర్వం'. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో మాట్లాడారు. సాయిపల్లవి పంచుకున్న విరాటపర్వం విశేషాలివి.  


సరళ గారి కుటుంబాన్ని కలవడం ఎలా అనిపించింది ?

సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మ నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు. 


సరళకు జరిగిన అన్యాయం గురించి ఎలా ఫీలయ్యారు ? 

నిజంగా ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలీవు. దిన్ని ఒక కథలానే అప్రోచ్ అయ్యాను. వెన్నెల పాత్రగానే చేశాను. 


వేణు ఊడుగుల కథ చెప్పినపుడు మీ మొదట రియాక్షన్ ? 

అ లోకం కొత్తగా అనిపించింది. నాటి పరిస్థితులు గురించి తెలుసుకుంటున్నపుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్న భావన కలిగింది. ఇప్పుడు అందరికీ స్వేఛ్చ వుంది. ఇప్పుడు ఒక కార్ బ్యాక్ ఫైర్ కావడం సామాన్యమైన విషయంగా చూస్తున్నా ము. కానీ అప్పుడు ఒక శబ్దం వచ్చినా ఏదైనా పేలుడు జరిగిందా అనే కంగారులో చూసేవారు. నాటి పరిస్థితులు, సమయం గురించి దర్శకుడు వేణు గారు చాలా విషయాలు నేర్పారు.


ఏ అంశం నచ్చి విరాటపర్వం చేశారు ? 

తెలియకుండా వున్న కథ చేయడంలో మజా వుంటుంది. తెలిసిన కథ మళ్ళీమళ్ళీ చేస్తే ఎప్పుడు నేను ఉండేలానే వుంటాను. ఒక కొత్త ప్రపంచంలోకి వెళితే నటిగా కూడా మెరుగౌతాను. నన్ను నేను సవాల్ చేసుకున్నట్లు ఉంటుందని విరాట పర్వం చేశాను. 


మొదట వెన్నెల పాత్ర విన్నప్పుడు ఎలా అనిపించింది ? 

వెన్నెల పాత్రలో రానెస్ వుంది. ఇసకతో బొమ్మ తయారు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఆయుధంగా కూడా మలుచుకోవచ్చు. వెన్నెల పాత్ర కూడా అలానే అనిపించింది. వెన్నెల ఒక తెల్లకాగితం. దానిపై ఏది రాస్తే అదే ఆమె అవుతుంది. దర్శకుడు ఆ పాత్రని చాలా నిజాయితీగా రాశారు. 


రానా గారు లాంటి స్టార్ వున్నప్పటికీ విరాట పర్వం వెన్నెల కథే అని చెప్తున్నారు కదా ? 

దర్శకుడు వేణు గారు మొదట నిర్మాతలు సుధాకర్ గారు, శ్రీకాంత్ గారితో తర్వాత నాతో మాట్లాడారు. ఈ స్క్రిప్ట్ సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రానా గారు రవన్న పాత్ర చేస్తారని తెలిసింది.చాలా ఆనందంగా అనిపించింది. రానా గారి స్టార్ డమ్, స్థాయి, ఆయనకి వున్న వాయిస్ కి రవన్న పాత్ర ఆయనకి గొప్పగా నప్పుతుందనిపించింది. రానా గారు వచ్చిన తర్వాత విరాట పర్వం స్కేల్ మారిపోయింది. రానా గారు ఈ ప్రాజెక్ట్ చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. 


మీరు కొంచెం ఆధ్యాత్మికంగా వుంటారు కదా.. వెన్నెల లాంటి కమ్యునిస్ట్ పాత్రని చేయాలనీ ఎందుకనిపించింది? 

ఆధ్యాత్మికానికి సినిమాకి సంబంధం లేదండీ. ఆధ్యాత్మికం జీవన విధానం. మైండ్ ని కామ్ చేసుకోవడానికి రెండు నిమిషాలు ధ్యానం చేస్తాను. అంతే తప్పితే దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. 


వెన్నెల పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ? 

వెన్నెల చాలా నార్మల్ అమ్మాయి. దర్శకుడు వేణు గారు చాలా అద్భుతంగా రాశారు. ఆయన అంత అద్భుతంగా రాయడం వలన నా పని సులువైయింది. 


నక్సలిజం నేపధ్యం, ప్రేమకథ ఇందులో ఏది నచ్చింది ?  

ఇదొక ప్రయాణం. వెన్నెల పాత్రలో ఒక అమాయకత్వం వుంటుంది. తను నమ్మేదాన్ని సాధించే తెగువ వుంటుంది. ఆ పాత్రలో వున్న ఆ స్పిరిట్ నచ్చింది. 


రానా గారి నుండి ఏం నేర్చుకున్నారు ? 

ఒక కథ అనుకున్నాక ఇంతే చేయొచ్చని అనుకునేదాన్ని. కానీ ఒక కథ స్థాయిని పెంచడం రానా గారు నేర్పించారు. ఆయన కథల ఎంపిక కూడా అద్భుతంగా వుంటుంది. 


వెన్నెల పాత్రకి సాయి పల్లవికి పోలిక ఏమైనా ఉందా ? 

ప్రేమని చూసే కోణం ఒకటే అనుకుంటా. 


వెన్నెల పాత్ర చేయడం ఒక ఆర్టిస్ట్ గా ఎలా అనిపించింది ? కష్టం ఫీలయ్యారా ? 

ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ కొత్తదనం వైపు అడుగులు వేస్తుండాలి. ఒకే క్వశ్చన్ పేపర్ కు అవే ఆన్సర్లు రాస్తూ వుంటే కిక్ వుండదు కదా.  కొత్తగా చేశాం, నేర్చుకున్నాం అనే తృప్తి వుండాలి.  ప్రతి పాత్రకి  కొంత భాద, వత్తిడి ఉండటమే కరెక్ట్. లేదంటే బోర్ కొడుతుంది.


తొలిసారి యాక్షన్ చేయడం ఎలా అనిపించింది ? 

మలయాళంలో కలరి విద్యలో ఒక యాక్షన్ మూవీ చేశా. విరాట పర్వంలో మాత్రం నా దగ్గర ఆయుధాలు వుంటాయి.


ప్రియమణి, నందితా దాస్ లాంటి నటులతో పని చేయడం ఎలా అనిపించింది ? 

ప్రియమణి, నందితా దాస్ నటనతో ప్రేరణ పొందుతాను. విరాట పర్వంలో వారితో నటించినపుడు  ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదు. కానీ ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఫ్రేం లో వారితో  నేను వున్నానా అనే ఫీలింగ్ కలిగింది. ఇది మంచి అనుభూతి. 


ఊరు, అడవి వాతావరణంను ఎలా ఆకళింపు చేసుకున్నారు ? ఎలాంటి సవాళ్లు ఎదురుకున్నారు ? 

సెట్, ఐరన్  బట్టలు, ఇంటిని ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ చేయడం.. ఇవన్నీ చూసి మన ఇల్లు ఇలా వుండదు కదా అని కొన్నిసార్లు డిస్ కనెక్ట్ అవ్వొచ్చు.  కానీ విరాట పర్వంలో ఇలాంటి ఊరు, మనుషులు నిజంగానే వుంటారు. మన ఊర్లో అమ్మాయిలు అలానే కూర్చుంటారు,  అలానే మాట్లాడుతారు. అదే ఒక రా ఫీలింగ్ ఇచ్చాయి. నేను కొన్ని సినిమాల్లో ఐ లైనర్ వేసుకుంటాను. కానీ విరాట పర్వంలో కేవలం మొహం కడుక్కుని చేశాను. ఇంత స్వేఛ్చగా మన భావాలను వ్యక్తపరచడం ఆనందాన్ని ఇచ్చింది. 


నక్సల్ పై మీ అభిప్రాయం ఈ సినిమా తర్వాత ఎలా వుంది ? 

దీన్ని ఒక పాత్ర గానే చేశాను. ఒకదానిపై అభిప్రాయం చెప్పాలంటే మనం ఆ కాలంలో వుండాలి. ఒక సమూహం ఎందుకు ఒక ఉద్యమంలో భాగమవ్వాలని అనుకున్నారనే విషయాలు గురించి సినిమా చేస్తున్న క్రమంలో తెలుసుకున్నాను. ఇది నా వరకూ ఒక లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే.


సాయి పల్లవి గురించే కొన్ని ప్రత్యేకమైన పాత్రలు రాసుకుంటున్నారు కదా ? ఎలా అనిపిస్తుంది ? 

ఆనందమే కందడీ (నవ్వుతూ) 


మిమ్మల్ని తెలంగాణ ఆడపడుచు అంటున్నారు కదా ? 

నిజమేనండీ. దర్శకుడు వేణు గారు కూడా అదే అన్నారు. బహుశా గత జన్మలో ఇక్కడే పుట్టుంటానేమో(నవ్వుతూ). 


డానీ, దివాకర్ మణి  కెమెరా వర్క్ గురించి ? 

అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఒక ఊరు, అడవిని ఇంత వండర్ ఫుల్ గా చూపించవచ్చా అనిపించింది. కెమెరా పనితనం ఒక గొప్ప కవిత్వంలా వుంటుంది. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా. ప్రేక్షకులంతా ఇంతగొప్ప విజువల్స్ ని థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను.


మీకు వున్న ఇమేజ్ కొన్ని సినిమాలు చేయడానికి అడ్డుపడుతుందని భావిస్తున్నారా ? 

లేదండీ. ప్రేక్షకుల ప్రేమనే తీసుకుంటాను తప్పా ఇమేజ్ ఎప్పుడూ తీసుకొను.  మంచి సినిమా, కథ చేయాలనే  ఒత్తిడి వుంటుంది తప్ప ఇమేజ్ గురించి ఎప్పుడూ అలోచించను. 


సినిమా రావడం ఆలస్యం అయ్యింది కదా ? ఏమనిపించింది ? 

సినిమా ఆలస్యం కావడంతో కొంచెం కంగారు పడిన మాట వాస్తవమే. విరాట పర్వానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ కి వస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు చూస్తున్నారు. విరాట పర్వం కూడా వారికి తప్పకుండా నచ్చుతుంది. చాలా నిజాయితీ గల సినిమా ఇది.


సురేష్ బొబ్బిలి సంగీతం గురించి ? 

సురేష్ బొబ్బిలి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ ట్యూన్స్, టోన్స్ వినిపిస్తాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది. 


ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటారు కదా ? 

ఇది నా భాద్యత అండీ. 'ప్రేమమ్' నుండి ఇది నాకు అలవాటు. ఒక సినిమాని ఏ నమ్మకంతో చేశామో ప్రేక్షకులకు చెప్పాల్సిన భాద్యత నా పై వుంటుంది. కొన్నిసార్లు ఆడియన్స్ ఎక్కువగా వున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పాల్సివుంటుంది. మన సినిమాని మనం ప్రమోట్ చేయకపోతే ఎవరు చేస్తారు.


మీ తాతయ్య ఒక పోలీస్ అధికారి కదా .. మీరు ఈ పాత్ర చేస్తున్నపుడు ఎలా ఫీలయ్యారు ? 

ఆయనకి 80ఏళ్ళు వుంటాయి. నేను ఏదో సరదగా ఆడుకొని వస్తున్నాని ఆయనకి తెలుసు (నవ్వుతూ). నేను ఈ కథ ఆయనకి చెప్పలేదు. తెలిసినా ఏం చెప్పరు. ఆయన మానవతావాది. 


మీరు ప్రధాన పాత్రలో వుండే సినిమాలు ఎక్కువ చేస్తున్నారు.. ప్రేక్షకులు కూడా అదే ఆదరిస్తున్నారు ? ఈ ఇమేజ్ కోసం భవిష్యత్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

నాకు ఇమేజ్ గురించి ఎలాంటి ఒత్తిడి లేదు. మంచి సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించడమే నా పని. మంచి సినిమాలు చేయాలనే ఒత్తిడి మాత్రమే వుంటుంది కానీ ఇమేజ్ ఒత్తిడి లేదు. 


దర్శకుడు సుకుమార్, త్రివిక్రమ్ విరాట పర్వం ప్రిమియర్ చూశారు కదా .. ఎలా ఫీలయ్యారు ? 

వాళ్ళు ప్రిమియర్ చూసిన రోజు నేను లేను. రానా గారు వున్నారు. వాళ్లకి సినిమా చాలా నచ్చిందని రానా గారు చెప్పారు. 


దర్శకుడు వేణు ఉడుగుల గురించి ?

దర్శకుడు వేణు ఉడుగుల గొప్ప రచయిత.  తనకు తెలిసిన పరిస్థితుల గురించి తనకంటే ఎవరూ గొప్పగా రాయలేరని నమ్ముతాను. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి చాలా సహజంగా తీర్చిదిద్దారు. ఇలాంటి గ్రిప్పింగ్ కథలు మరెన్నో రాయాలని ఆశిస్తున్నాను.


విరాట పర్వం రా, ఇంటెన్స్ మూవీ కదా.. కమర్షియల్ సక్సెస్ గురించి ఆందోళన ఉందా ? 

సినిమా అనేది ఎప్పటికీ నిలిచిపోవాలి. చాలా మంది లెజెండరీ నటులు నటించిన మంచి సినిమాలే మనకి గుర్తుంటాయి. అప్పుడది కమర్షియల్ సక్సెస్ కాదా అనే ఆలోచన రాదు, వుండదు. ఆడియన్స్ కి ఏ సినిమా నచ్చుతుంది, నచ్చదో మనం చెప్పాలేం. నేను సినిమా చేసేటప్పుడు.. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని మనసులో పెట్టుకుంటాను.  కళ శాశ్వతం. ఎప్పటికీ నిలిచిపోయే సినిమానే చేయలని అనుకుంటాను. విరాట పర్వం కూడా ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా. 


తెలుగు సినిమాల విషయంలో గ్యాప్ వచ్చిందని భావిస్తున్నారా ? 

పాండమిక్ కి ముందు లవ్ స్టొరీ, విరాటపర్వం చేశాను. తర్వాత శ్యామ్ సింగ రాయ్ వచ్చింది. అయితే నేను  గ్యాప్ గురించి ఎక్కువ అలోచించను. నేను కళని ఎక్కవగా నమ్ముతాను. నా కోసం ఒక కథ వుంటే అది తప్పకుండా నన్ను వెదుక్కుంటూ వచ్చేస్తుంది. 


గార్గి సినిమా గురించి ? 

గార్గి సినిమా కూడా అద్భుతంగా వుంటుంది. విరాటపర్వంలానే గార్గి కూడా చాలా భిన్నమైన కథ. 


కొత్త ప్రాజెక్ట్స్ గురించి ? 

తెలుగులో కథలు చదువుతున్న. శివకార్తికేయన్ గారితో తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను. 


మీ లైఫ్ పార్ట్నర్ గురించి ? 

ఇంకా పుట్టలేదని అనుకుంటున్నాను. (నవ్వుతూ) 


ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు ? 

ఎక్కువగా స్క్రిప్ట్స్ చదువుతా.


అల్ ది బెస్ట్ 

థాంక్స్


Share this article :