Home » » Thankyou For Making College Don Blockbuster-Sivakarthikeyan

Thankyou For Making College Don Blockbuster-Sivakarthikeyan

 'కాలేజ్ డాన్' ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శివ కార్తికేయన్



బ్లాక్ బస్టర్స్ కి చిరునామాగా మారారు హీరో 'శివ కార్తికేయన్'. రెమో, డాక్టర్ వరుణ్ చిత్రాలతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులని అలరించిన శివ కార్తికేయన్ తాజాగా కాలేజ్ డాన్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన డాన్  చిత్రం మే 13 న విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఈ చిత్రం మీడియా మీట్ హైదరాబాద్ లో జరిగింది.


ఈ సందర్భంగా హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. కాలేజ్ డాన్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన నిర్మాత ఎన్వీ ప్రసాద్ గారికి ప్రత్యెక కృతజ్ఞతలు. కాలేజ్ డాన్ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. దర్శకుడు శిబి చక్రవర్తి మొదట స్క్రిప్ట్ వినిపించినపుడు ఈ కథ అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. మా నమ్మకం నిజమైయింది. వరుణ్ డాక్టర్ చిత్రాన్ని  తెలుగు ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. కాలేజ్ డాన్ కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. తెలుగులో మాట్లాడాలని అనుకున్నాను. తెలుగు అర్ధం అవుతుంది కానీ ఇంకా మాట్లాడే స్థితి రాలేదు. అనుదీప్ తో చేస్తున్న సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను. సముద్రఖని, ఎస్ జే సూర్య ఈ చిత్రాన్ని బలంగా నమ్మారు. గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు. అనిరుద్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు సినిమా కోసం అద్భుతంగా పని చేశారు. ఈ చిత్రంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నాకు రోల్ మోడల్. ఆయనకి ఈ చిత్ర విజయాన్ని అంకితం చేస్తున్నా'' అన్నారు  


నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. డాన్ చిత్రానికి పనిచేసిన నటులు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. డాక్టర్ వరుణ్ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న శివ కార్తికేయన్.. మళ్ళీ కాలేజ్ డాన్ తో అంతే స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. కాలేజ్ డాన్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. మొదటి రోజు నుండి ఇప్పటివరకూ వంద శాతం వసూళ్ళుతో సినిమా దూసుకుపోతుంది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌,  లైకా ప్రొడక్షన్స్ కి  కంగ్రాట్స్. తమిళ ఇండస్ట్రీలో హిట్స్ తగ్గుతున్న రోజుల్లో డాక్టర్ వరుణ్ ఇప్పుడు కాలేజ్ డాన్ చిత్రాలతో కొత్త జోష్ తీసుకొచ్చారు శివ కార్తికేయన్. ఆయన ఏడాది నాలుగు సినిమాలు చేయాలి'' అని కోరుకున్నారు.


దర్శకుడు శిబి చక్రవర్తి మాట్లాడుతూ.. శివ కార్తికేయన్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఈ చిత్రానికి ఒక పిల్లర్ లా నిలబడ్డారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారి కృతజ్ఞతలు. ఈ ఎస్ జే సూర్య, సముద్రఖని, ప్రియాంక అరుల్ మోహన్ అద్భుతంగా నటించారు. అనిరుద్ చక్కని సంగీతం అందించారు. మిగతా సాంకేతిక నిపుణులు, నటులుకందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు


సముద్రఖని మాట్లాడుతూ.. కాలేజ్ డాన్ చిత్రానికి తమిళ్ లో ఎంత మంచి ఆదరణ లభించిందో తెలుగులో కూడా అంతే ఆదరణ లభించడం ఆనందంగా వుంది. నా పాత్ర కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే హ్యాపీగా వుంది. హీరో శివ కార్తికేయకి స్పెషల్ థ్యాంక్స్. నాకు ఇంతమంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు'' తెలిపారు.


Share this article :