Home » » Dhagad Samba Director N R Reddy Interview

Dhagad Samba Director N R Reddy Interview

 "ధగఢ్ సాంబ" చిత్రంలో సరికొత్త సంపూర్ణేష్ బాబును చూస్తారు... డైరెక్టర్  ఎన్.ఆర్.రెడ్డి ఇంటర్వ్యూ



సంపూర్ణేష్ బాబు గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా ఒక ఎత్తు.ఈ సినిమా లో సంపూని సరికొత్తగా చూస్తారు. సంపూ గారి కెరీర్ లో ది బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి. బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” ఈ నెల 20.న విడుదల అవుతుంది. నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ & ప్రోమోకు,పాటలకు మంచి స్పందన లభిస్తోంది.  మే 20. న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..


1993 లో ఇండస్ట్రీ కి ఆర్టిస్టుగా వచ్చాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కారణంగా బిజినెస్ వైపు వెళ్లడం జరిగింది. అయినా సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ తో మళ్లీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అయితే దర్శకుడు అవ్వాలనే కోరికతో నేను కొన్ని కథలు రాసుకున్నాను.. దర్శకుడుగా నాకిది మొదటి చిత్రం. లాక్ డౌన్ లో రాసుకున్న కథను నా ఫ్రెండ్ డిఓపి ముజీర్ గారికి వినిపించి ఎవరితో నైనా ఈ కథతో సినిమా చేద్దాం అన్నాను.ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, పాటలు ఇలా అన్ని నేనే రాసుకోవడం జరిగింది.ఈ కథ ముజీర్ గారికి నచ్చడంతో నాకు సంపూ గారు బాగా తెలుసు తను ఇప్పటి వరకు ఇలాంటి మాస్ యాక్షన్  సినిమా చేయలేదు తనకైతే ఈ కథ బాగుంటుంది సంపూతో చేద్దాం అన్నాడు.ఆ తర్వాత ఈ కథను సంపూ కు చెప్పడం తను చేయడానికి ఒప్పుకోవడం జరిగింది.


 సంపూ గారి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు నేను రాసుకున్న కథను 30% మార్పు  చేశాము.ఈ సినిమాలో ట్విస్ట్ ల తో ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఇన్ని రకాల ఎమోషన్స్ తో కూడుకున్న  మొదటి ఇదే..అవుతుంది. 


ఈ చిత్రానికి ముజీర్ గారు  డిఓపి గానే కాకుండా ఈ చిత్రం పూర్తి కావడానికి మెయిన్ పిల్లర్ గా నిలబడ్డారు .ఈ రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతుందంటే.. ముజీర్ గారి పాత్ర ఎంతో ఉంది. ఎంతో సపోర్ట్ చేశారు. సంపూ గారి యాక్టింగ్ ,బాలు గారి కొరియోగ్రఫీ, డేవిడ్ గారి మ్యూజిక్, పాపారావు గారి ఎడిటింగ్, రాజు మాస్టర్ అసిస్టెంట్స్  ఫైట్స్ , యాక్షన్స్ సీన్స్ ఇలా అందరు టెక్నీషియన్స్ సపోర్ట్ చేయడం అలాగే నటులు బాషా ,జ్యోతి, అప్పారావు, చలాకీ చంటి ,ఫిష్ వెంకట్ అందరూ చాలా బాగా నటించారు.ఇలా ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది..


ఇది ఒక రివెంజ్ స్టొరీ..ఇందులో రొమాంటిక్ కామెడీ & రీవేంజ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఫుల్ ఔట్ & ఔట్ కామెడీ ఫిల్మ్. ఇందులో ఐదు ఫైట్స్, ఐదు సాంగ్స్ ఉంటాయి. ఈ చిత్రం లో కథ సీరియస్ గా నడిచినా అందులోనే కామెడీ ఉంటుంది తప్ప కావాలని పెట్టినట్టు పేరడీ కామెడీ ఈ సినిమాలో ఉండదు. స్విచ్వేషన్స్ తగ్గట్టు న్యాచురల్ గా అందరి లైఫ్ లో ఎలా జరుగుతుందో అలా ఉంటుంది తప్ప ఇంపాజిబుల్ ను పాజిబుల్ చేసేలా మాత్రం ఉండదు.


ఇందులో సంపూ గారిది సస్పెన్స్ క్యారెక్టర్ తను ఎం చేస్తుంటాడో ఎవరికీ తెలియని క్యారెక్టర్.  అది ఏంటనేది ఇంటర్వెల్ లో బ్లాస్ట్ అవుతుంది.ఈ సినిమాలో సంపూ గారు   ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ చాలా బాగా చేశారు.  సంపూ గారి కెరీర్ లో  ది బెస్ట్ సినిమా అవుతుంది.ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు.ఇందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూసేలా ఈ సినిమా ఉంటుంది.


ఈ సినిమా పూర్తి అయిన తరువాత  సెన్సార్ వారికీ చూపిస్తే ఈ కథ చాలా బాగుందని మెచ్చుకొని సెన్సార్ వారు సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.


ఈ సినిమా తర్వాత మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని  కోరుకుంటున్నా..అని ముగించారు


Share this article :