Home » » Dhagad Samba Cinematographer Mujeer Malik Interview

Dhagad Samba Cinematographer Mujeer Malik Interview

 "ధగఢ్ సాంబ" సినిమాటోగ్రాఫర్ ముజీర్ మాలిక్ ఇంటర్వ్యూ




ఫోటోగ్రఫీ అనేది  పెద్ద సముద్రం మనం ఎంత నేర్చుకుంటున్నా.. మనకు కొత్త గానే ఉంటుంది.ఎప్పటికీ అది పెద్ద లర్నింగ్ సినిమాటోగ్రఫీ లో ప్రతి రోజు అప్డేట్ అవ్వాల్సిందే..అన్నారు ప్రముఖ కెమెరా మాన్ ముజీర్ మాలిక్. బి.ఎస్. రాజు సమర్పణలో  ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నుండి ఇంతకుముందు విడుదలైన టీజర్ &  ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది..అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని  మే 20 న విడుదలకు సిద్ధమైంది.ఈ చిత్ర కెమెరా మాన్ ముజీర్ మాలిక్ చిత్ర యూనిట్ సమక్షంలో. ఈ రోజు  తన  బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..


మాది గుంటూరు జిల్లా నరసరావుపేట.నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి మా బావ గారే కారణం. తనెవరో కాదు ప్రముఖ సింగర్ మనో గారు.నేను మాతృదేవోభవ సినిమా చూసిన తరువాత చోట కె నాయుడు దగ్గర కెమెరామెన్ గా చేరాలని మా బావ గారికి చెప్పడంతో మా బావ  చోటా కె నాయుడు దగ్గర 1993 లో "మగరాయుడు" సినిమాకు అప్రెంటిస్ గా జాయిన్ చేయించాడు. అప్పటికే మా గురువు గారు దగ్గర నలుగురు ఉన్నా.. నా వర్క్ స్పీడ్, నా పనితనం నచ్చి నువ్వు నా దగ్గరే అసిస్టెంట్ గా ఉండమని చెప్పడంతో అప్పటి నుండి మొదలైన నా జర్నీ "అదుర్స్'' సినిమా వరకు తనతోనే ట్రావెల్ అయ్యాను.


Dop గా నా మొదటి సినిమా "యువరాజ్యం" గుడుంబా శంకర్ దర్శకుడు వీరశంకర్ సినిమా.ఈ సినిమాను 2009 లో "మన కుర్రాళ్ళు" గా పేరు మార్చడం జరిగింది.ఆ తర్వాత భరత్ పారేపల్లి దగ్గర "మేరా భారత్ మహాన్" "గోలి సోడా "సంపూ గారితో "కొబ్బరిమట్ట" కాళీ ఫ్లవర్, "ధగఢ్ సాంబ" సినిమాలకు వర్క్ చేసాను .నేను తమిళ్ లో కూడా  ప్రేమిస్తే హీరో భరత్ తో  ఓ సినిమా చేశాను.ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. అలాగే కన్నడలో రెండు సినిమాలు చేశాను. 


చోటా. కె. నాయుడు దగ్గర  చిరంజీవి సినిమాలు అన్నిటికి నేను అసిస్టెంట్ గా పని చేశాను పని విషయంలో చోటా గారు పని రాక్షసుడు. ఆయన దగ్గర పని నేర్చుకుంటే ఎక్కడైనా పని చేయగలుగుతాము.  పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్ వర్కింగ్ స్టయిల్ ఉంటుంది. 


నాకు మనో గారి బ్యాక్ గ్రౌండ్ తో పాటు మా గురువుగారు చోటా. కె.నాయుడు దగ్గర చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, వంటి పెద్ద హీరోలతో ఎన్నో సినిమాలకు పనిచేసినా కూడా  కెమెరామెన్ గా బయటకు వచ్చిన తరువాత  వీర శంకర్ గారి కుర్రాళ్లు సినిమా డిఓపి గా వర్క్ చేశాను.అయితే అప్పుడే కృష్ణవంశీగారు సినిమా మహాత్మ కు కోసం అడిగారు.అయితే ఆగిపోయిన సినిమా రిలీజ్ అయ్యే వరకు వేరే సినిమా చేయకూడదని చెయ్యలేక పోయాను. ఆతర్వాత డిజిటల్ రంగం రావడంతో ఫోటోగ్రఫీ అనేది అందరికీ ఈజీ అయింది.అప్పుడు నేను యాడ్ ఫిలింస్ చేయడానికి వెళ్లడం జరిగింది దాంతో నాకు సుమారు ఎనిమిది సంవత్సరాల గ్యాప్ వచ్చింది.. దాంతో నేను పెద్ద హీరోలతో సినిమాల చేయలేకపోయాను.


నేను చేసిన "కడైసి బెంచ్ కార్తీ" తమిళ్ సినిమాకు చాలా మంచి పేరు వచ్చింది.కానీ ఎంతో కష్టపడి చేసిన కష్టపడి చేసిన "మన కుర్రాళ్ళు" సినిమాకు మాత్రం తగిన గుర్తింపు రాలేదు.ఆ సినిమా ఐదు సంవత్సరాలు డిలే ఆవ్వడం వల్ల దాని కథ మారిందని అక్కడక్కడా కథను ఛేంజ్ చేసి రి షూట్ చేయడంతో ఆ సినిమాకు తగిన గుర్తింపు రాలేదు.ఆ తర్వాత సంపూ తో చేసిన "కొబ్బరి మట్ట"లో ఫోటోగ్రఫీ పరంగా సంపూర్ణేష్ బాబు ని పెద్ద హీరోల చూపించాం అని మంచి పేరు వచ్చింది 


ఈ చిత్ర దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి బేసిక్ గా రైటర్ ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళ అబ్బాయి తో షాట్ టెంపర్ అనే యాక్షన్ ఫిలిం తీద్దామని నన్ను కలసి నాకు అడ్వాన్స్ ఇచ్చాడు.ఆ తరువాత కరోనా రావడంతో ఫైనాన్స్ పరంగా అంతా తారుమారైంది.ఆ తర్వాత తను వచ్చి లాక్ డౌన్లోడ్  లో నేను ఒక కథ రాసుకున్నాను షకలక శంకర్ వంటి వారికి ఈ కథ సూట్ అవుతుంది. వారితో సినిమా చేద్దామని చెప్పడంతో ఇటువంటి మాస్ యాక్షన్  సినిమా ఇప్పటి వరకు సంపూ చేయలేదు తనకైతే ఈ కథ బాగుంటుందని ఈ కథను సంపూ కు చెప్పడంతో.. నా మీద గౌరవంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం వెంటనే సినిమా స్టార్ట్ అవ్వడం జరిగింది.


సంపూ గారు కామెడీ, సెంటిమెంట్ తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా సంపూ గారి కెరీర్ లో  ది బెస్ట్ సినిమా అవుతుంది.ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు


సంగీత దర్శకుడు డేవిడ్ అద్బుతమైన మ్యూజిక్ చేశాడు. ఇందులోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.టెక్నికల్ పరంగా అందరూ కూడా చాలా చక్కగా పని చేశారు.మంచి టెక్నీషియన్స్ ను, మంచి నటులను, మంచి కథను సెలెక్ట్ చేసుకొని  దర్శక, నిర్మాతలు చాలా చక్కగా తీశారు. 


వర్క్ ప్రెజర్ వలన చాలామంది టెన్షన్ గురవుతున్నారు. అలాంటి వారికి సంపూర్ణేష్ బాబు సినిమా గొప్ప రిలీఫ్ నిస్తుంది. సుమారు రెండున్నర గంటలు పాటు హాయిగా నవ్వుకునేలా తన సినిమా ఉంటుంది.ఈ సినిమా ట్రైలర్  బాగుంది.ఇందులో మంచి మంచి ఫీల్ కలిగే సీన్స్ చాలా ఉన్నాయి. 


ఈ సినిమా తర్వాత "బ్రిలియంట్ బాబు"   సన్నాఫ్ తెనాలి, దాన వీర శూరకర్ణ సినిమాలు చేస్తున్నాను. అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ అందరూ కలసి కొత్తగా ఫస్ట్ టైం డైరెక్షన్ చేయాలనుకునే వారికి ఒక ఆఫర్ ఇచ్చారు ఒక  నాలుగు కథలలో ఒక కథను సెలెక్ట్ చేసింది డైరెక్టర్స్ సంఘం. ఆ సినిమాకు నన్ను కెమెరామెన్ గా పెట్టుకోవడం జరిగింది ఆ హీరో ఎవరనేది త్వరలో  తెలియజేస్తాను. డైరెక్టర్ అసోసియేషన్ లో కార్డ్ ఉన్న ప్రతి యుంగ్ స్టర్స్ కు ఫస్ట్ చాన్స్ ఈ అసోసియేషన్ ద్వారానే డైరెక్టర్ ని చేసే కార్యక్రమానికి మంచి అప్లాజ్ వస్తుంది.ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను.ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని  కోరుకుంటున్నా..అని ముగించారు


Share this article :