Home » » Organic Mama Hybrid Alludu Movie Launched

Organic Mama Hybrid Alludu Movie Launched

 అంగరంగ వైభవంగా ప్రారంభమైన "ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు" 



కుటుంబం అంతా కలిసి చూసేలా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వంటి సూపర్ డూపర్  హిట్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టి నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు వంటి వైవిధ్యమైన టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా మజిలీ ఫేమ్ అనన్య హీరోయిన్ గా అమ్ము క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర వంటి ఎందరో ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం నాడు ఏప్రిల్ 18న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్ హీరోయిన్ అనన్య లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 

అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్, హీరోయిన్ అనన్య, ఎస్వీ కృష్ణ రెడ్డి, నటులు సునీల్, వరుణ్ సందేశ్, వైవా హర్ష, జబర్దస్త్ రాఘవ, అప్పారావు, నటి హేమ, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, చిత్ర నిర్మాత కోనేరు కల్పన, హీరో సత్య దేవ్,, ప్రముఖ నిర్మాతలు కె. ఎస్. రామారావు,శివ రామ్ కృష్ణ, జెమిని కిరణ్, ఏ ఎం రత్నం, బేక్కం వేణుగోపాల్, డైరెక్టర్  రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 


నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "కృష్ణారెడ్డి నాతో  కొబ్బరి బొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, వంటి సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ఆ చిత్రాలు ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడల్లా ప్రేక్షశకులను అలరిస్తాయి.. ఎంతో మంది ఫోన్స్ చేసి అభినందిస్తుంటారు.ఎన్నో చక్కని పాత్రలు రాసి నటుడిగా నన్ను బ్రతికుండేలా చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటిచడం చాలా హ్యాపీగా వుంది. కుటుంభం అంతా కలిసి ఎంజాయ్ చేసేలా నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుంది. కామిడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఫామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూసే ఒక చక్కని సినిమా రాబోతుంది. వందశాతం ఈ సినిమాని  ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకొని ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. అన్నారు. 


ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. మద్రాస్ లో బిగినింగ్ స్టేజ్ నుండి ఎస్వీ కృష్ణారెడ్డి తెలుసు.. ఇద్దరం ఒకే రూమ్ లో వుండే  అంత ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య వుంది. . తర్వాత ఆయన డైరెక్టర్ గా సినిమాలు తీసేప్పటినుండి  నేను సినిమా చేయమని అడిగే వాడ్ని. అయన చేద్దాం సార్ అనేవాడు. ఇప్పటికి మా వైఫ్ కల్పన ద్వారా  ఆ కోరిక తీరింది. కల్పన చిత్ర బ్యానర్ కి ఒక ప్రత్యేకత వుంది. కృష్ణ గారు విజయనిర్మల ఫస్ట్ కాంబినేషన్లో అత్తగారు కొత్త కోడలు సినిమాని కల్పన ఫాదర్ నిర్మించారు. అలాంటి బ్యానర్ లో కల్పన ఇండివిడ్యుల్ ప్రొడ్యూసర్ గా  ఈ సినిమా చేస్తున్నారు. ప్రతిఒక్కరి మనసులో గుర్తుంచుకునే డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన  డైరెక్షన్ లో ఈ సినిమా రావడం చాల హ్యాపీగా వుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ తో  ఏడు సినిమాలు చేశాను.. అన్ని సినిమాలు ఏ హీరోతో చేయలేదు. ఆర్గానిక్   మామ.. హైబ్రీడ్ అల్లుడు టైటిల్ వింటేనే సినిమా పొటెన్షియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా సోహైల్ కి దక్కడం అతని అదృష్టం. సునీల్, వరుణ్ సందేశ్ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషిస్తున్నారు.  గ్యారెంటీగా ఈ సినిమా సూపర్ హిట్ అని ఓపెనింగ్ లోనే ప్రూవ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత కృష్ణారెడ్డి గారు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసేంత బిజీగా ఈ సినిమా పేరు తెస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను..   సోహైల్, అనన్య క్యూట్ పెయిర్. వాళ్ళ కాంబినేషన్ చక్కగా కుదిరింది. ఎంతో మంది స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజునుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.. అన్నారు. 


చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. చాలా మంది కలిసినప్పుడల్లా మీ మార్క్ కామిడీ చిత్రాలు రావటం లేదు.. అలాంటి సినిమాలు చూసి చాలా కాలం అయింది అని అంటున్నారు. నాకు అదే ఫీలింగ్ కలిగింది. అప్పటినుండి మంచి కథలు రాసుకుంటూ సరైన ప్రొడ్యూసర్ కోసం వైట్ చేశాను.అచ్చిరెడ్డి గారి సలహా మేరకు కల్పన గారు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఆర్టిస్టుల్ని,టెక్నీషియన్స్ ని అందర్నీ ప్రొవైడ్ చేసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించడానికి ప్లాన్ చేసారు. అలాగే  సి.కళ్యాణ్ గారు దెగ్గరుండీ ఈ ఓపెనింగ్ గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ఆయనది వెరీ గుడ్ అండ్ బిగ్ హ్యాండ్. చాలా గొప్పగా కళ్యాణ్ ఈ ఓపెనింగ్ జరపడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సోహైల్, అనన్య చక్కగా సెట్ అయ్యారు. అలాగే వరుణ్ సందేశ్ ఒక గెస్ట్ పాత్ర చేస్తున్నాడు. అఖండ వంటి బిగ్ హిట్ తరువాత  రాంప్రసాద్ మా సినిమాకి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే సునీల్ ఫోన్ లో క్యారెక్టర్ చెప్పగానే నేను చేస్తున్నాను సార్ అన్నాడు. అలాగే ఎంతోమంది ఈ ప్రారంబోత్సవానికి వచ్చి వారి బ్లెస్సింగ్స్ ఇవ్వడం నేను దీవెనులుగా భావిస్తున్నాను. నేను అమెరికాలో ఒక ఇంగ్లిష్ ఫిలిం చేశాను.. అక్కడ మూడేళ్లు పట్టింది ఆ సినిమా చేయడానికి. నాకు అక్కడ వుండబుద్ది కాలేదు. మళ్ళీ మన తెలుగు సినిమాలు చేయాలనీ ఇక్కడికి వచ్చాను. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు మనసుకి నిండుగా తృప్తిగా ఉంటాయి. అవే కావాలని కోరుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. 


హీరో సోహైల్ మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. ఈ పాత్రకి నేను యాప్ట్ అని  నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణరెడ్డి గారికి, నిర్మాత కల్పనా గారికి నా థాంక్స్. కుటుంభం అంతా కలిసి చూసే చిత్రాలు వచ్చి చాలా కాలం అయింది. ఒకప్పుడు ఫ్యామిలీతో వెళ్లి థియేటర్ లో సినిమా చూసి పండగ చేసుకునేవారు.. అలాంటి సినిమా ఇది. సినిమా అంతా కలర్ ఫుల్ గా ఉంటుంది. అంతలా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు కల్పనా గారు. వరుణ్ సందేశ్ అన్నతో నేను కొత్త బంగారులోకం లో యాక్ట్ చేశాను.. ఈ చిత్రంలో ఒక గెస్ట్ పాత్ర వుంది అని చెప్పగానే పెద్దమనసుతో చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే సునీల్ గారు కూడా మంచి యూనిక్ క్యారెక్టర్ చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ వంటి లెజండ్రీ యాక్టర్ తో చేయడం నా అదృష్టం. ఇవాళ నా బర్త్ డే. ఈరోజు  సినిమా ఓపెనింగ్ జరగడంచాలా హ్యాపీగా వుంది. పుట్టినరోజుల, పార్టీలు జరుపుకోకుండా చదువు కోసం  ఒక పది శాతం ఒక ఛారిటీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను.. అన్నారు. 


సునీల్ మాట్లాడుతూ.. నేను  వేషాల కోసం ఫిలిం నగర్ లో తిరిగే రోజుల్లో ఒకసారి నేను నడుచుకుంటూ వెళ్తుంటే అచ్చిరెడ్డి గారు కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మా అని.. దిల్సుఖ్ నగర్ సార్ అన్నాను. అయన కారు ఆపి  ఎక్కించుకొని ఖైరతాబ్ వరకు వచ్చి నన్ను డ్రాప్ చేశారు. అక్కడనుండి స్టార్ట్ అయి ఇక్కడి వరకు వచ్చాను.. మా పూలరంగడు సినిమా ఆ రేంజ్ లో రావడానికి అచ్చిరెడ్డి గారు కారణం. నేను లైఫ్ లో ఫస్ట్ కలిసిన వ్యక్తి డైరెక్టర్ గా కృష్ణరెడ్డి గారు. ప్రొడ్యూసర్ గా అచ్చిరెడ్డి గారు. మళ్ళీ వాళ్ళ సమక్షంలో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇప్పటివరకు నేను చేయనటువంటి క్యారెక్టర్.. చాలా వెరైటీ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేస్తున్నాను. ఈ మధ్య కామెడీ ల్లో నాకు మంచి ఫుడ్ దొరకలా. ఇందులో మంచి ఫుడ్ దొరికింది అని కథ వినగానే అర్ధం అయింది. నా కామిడి టైమింగ్ చూసి విపరీతంగా నవ్వుకుంటారు. ఒకప్పుడు సినిమా చూడాలని అమ్మని  మేము అడిగేవాళ్ళం..కృష్ణారెడ్డి గారి సినిమా వస్తే అమ్మే తీసుకెళ్లేది. అలంటి ఫామిలీ చిత్రాలు చూసే రోజులు రావాలి అది ఈ సినిమా తెస్తుంది. సంవత్సరానికి మూడు సినిమాలు కృష్ణారెడ్డిగారు తీయాలని అందర్నీ అలరించాలని.. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. సోహైల్ చిన్నప్పటినుండి పరిచయం. ఈ సినిమాలో చిన్న కామియో రోల్ చేస్తున్నాను. కృష్ణారెడ్డి గారి సినిమాలు చిన్నప్పటినుండి చూస్తున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు. సోహైల్ నా సినిమాల్లో నటించాడు. ఇప్పుడు అతని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ వున్నా క్యారెక్టర్.. సినిమా తప్పకుండా అలరిస్తుంది అన్నారు. 


నటి హేమ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తరువాత ఒక ఓపెనింగ్ గ్రాండ్ గా జరగడం చాలా హ్యాపీగా వుంది. సినిమా సూపర్ హిట్ అనే వైబ్స్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మా లేడీ ప్రొడ్యూసర్ కల్పనా గారు సక్సెస్ ఫుల్ నిర్మాత అవ్వాలి అన్నారు. 


హీరోయిన్ అనన్య మాట్లాడుతూ.. మజిలీ లో ఒక క్యారెక్టర్ చేశాను. తెలుగులో ఇది నా సెకండ్ ఫిలిం. హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ ఫిలిం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి నా స్పెషల్ థాంక్స్ అన్నారు. 


ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ నుండీ జర్నీ చేస్తున్నాను. ఇవాళ కృష్ణారెడ్డి గారి సినిమా ప్రారంభం అయింది. ఈ రోజు కోసం మాతో పాటు  కొన్ని లక్షలమంది వెయిట్  చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కృష్ణారెడ్డి గారి సినిమాలు రావట్లేదు. ఆయన సినిమాలు తియ్యాలని అడుగుతున్నారు. కృష్ణారెడ్డి గారు కూడా అంతకుమించిన జోష్ తో వున్నారు. ప్రేక్షకులకి నచ్చేలా.. అందరు ఎంజయ్ చేసేలా సినిమా తియ్యాలని మంచి కథలు రాసుకున్నారు. అందరికి నచ్చే సినిమా చెయ్యాలని ఆయనకీ తపన వుంది. టాలెంట్, క్రియేటివీటి ఆయనలో ఎంతో వుంది. అది తెలిసే నేను డైరెక్టర్ గా ఆయన్ని ఎంకరేజ్ చేశాను. ఇప్పటివరకు ఓక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆయన టాలెంట్ చూసారు. ఈ అనుభవాలతో ఆయన మరింత మెరుగుపరుచుకుని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టాలెంట్ ని ఇప్పుడు బయటపెట్టబోతున్నారు. నాలుగేళ్లుగా మంచి స్కిప్టులు చేసుకొని మంచి సినిమాలు చేయబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ బ్రాండ్ మిస్ అవకుండా ఈ సినిమా చేస్తున్నారు. ఇంత మంచికథతో కల్పనా గారు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అలాగే మార్కెట్ లో ఎంతో బ్రాండ్ వున్నా సి. కళ్యాణ్ గారు కొండంత అండగా వుండి ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి ఆలోచనలకి తగ్గట్లు ఎలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉంటే సినిమా ఎంత అద్భుతంగా వస్తుందో నాకు బాగా తెలుసు. నేను ఎలా అయితే ఆలోచిస్తానో నాకంటే బెటర్ గా కల్పన గారు ప్లాన్ చేసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.సోహైల్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. వరుణ్ సందేశ్ పాత్ర కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కుష్బూ, సూర్య, హేమ, సునీల్, ఆలీ చాలా మంది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అందరి క్యారెక్టర్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. రష్మీ ఒక గ్లామరస్ పాత్రలో నటిస్తుంది. అందరికి నచ్చే సినిమా అవుతుంది. అన్నారు. 


కెమెరా మెన్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణరెడ్డి గారితో పెళ్ళాం ఊరెళితే సినిమా చేశాను. నేను చేసిన ఫస్ట్ పిక్టర్లు అన్ని హిట్ అయ్యాయి. అలాగే కల్పన గారు నిర్మిస్తున్న ఈ ఫస్థ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. మంచి కథతో ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు. 


సోహైల్, అనన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డా.రాజేంద్రప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, ప్రత్యేక పాత్రలో వరుణ్ సందేశ్, ప్రత్యేకపాత్రలో రష్మీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర, సూర్య, ప్రవీణ్, వైవా హర్ష, జబర్దస్త్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్; ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్. ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర, సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, పి .ఆర్.ఓ: సురేష్ కండేటి, ఫైట్స్ :వెంకట్, స్టిల్స్: మనిషా ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఉదయ్ భాస్కర్, ప్రొడక్షన్ ఎగ్జికుటివ్: కొండయ్య, చీఫ్-కొడైరెక్టర్: ప్రణవానంద్, చీఫ్-అసోసియేట్ డైరెక్టర్: సెల్వ కుమార్, అసోసియేట్ డైరెక్టర్స్: కె.కళ్యాణ్, వి.రత్న ప్రభాకర్, సురపు ఈశ్వర్, అసిస్టెంట్ డైరెక్టర్: డా. కె. సంకల్ప్, కాస్ట్యూమ్ చీఫ్; వెంకట్, మేకప్ చీఫ్: నాగు, నిర్మాత కోనేరు కల్పన, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.


Share this article :