Saidhulu Trailer Launched

 మేజర్ చిత్ర దర్శకుడు దర్శకుడు శశి కిరణ్ ముఖ్య అతిథిగా సైదులు ట్రైలర్ లాంచ్ !!!



కె.ఎమ్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై  బాబా పి.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం సైదులు.  రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం

 షూటింగ్ పూర్తి చేసుకుంది. 


హ‌క్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జ‌నం చేసిన తిరుగుబాటు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ ఉండబోతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. 1980 లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన కథ ఇది. ఒక కీలక పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటించారు. 


ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే దర్శకుడు చంద్ర మహేష్, దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. 



డైరెక్టర్ శశి కిరణ్ మాట్లాడుతూ...

సైదులు సినిమా ట్రైలర్ రియాలిటీకీ దగ్గరగా ఉంది. ఇలాంటి సినిమాలు ఆడాలి మరిన్ని రావాలి. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.


ఈ సందర్భంగా నిర్మాత మరబత్తుల బ్రహ్మానందం మాట్లాడుతూ...

డైరెక్టర్ బాబా చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఆయన సినిమాను  బాగా తీశారు. సినిమా మంచి విజయం సాధించి డైరెక్టర్ కు మంచి పేరుతో పాటు మరెన్నో అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. 


డైరెక్టర్ బాబా పి.ఆర్ మాట్లాడుతూ...

సైదులు చిత్రం తెలంగాణలో జరిగిన ఒక కథ. ఈ కథను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులకు నటీనటులకు ధన్యవాదాలు. మా సినిమా అందరికి చేరేలాగా సాయపడాలని విజ్ఞప్తి చేశారు.




హీరో: రంజిత్ నారాయణ్ కురుప్, హీరోయిన్: ముస్కాన్ అరోరా


ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః పి.య‌స్ మ‌ణిక‌ర్ణ‌న్‌

సంగీతం:ఎన్.ఎస్.ప్రసు

లిరిక్స్: ఎమ్. బ్రహ్మానందం

కో-డైర‌క్ట‌ర్:ప‌వ‌న్ ల‌క్ష్మ‌ణ్‌ 

ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

కాస్ట్యూమ్స్: వి.ప‌ద్మ‌

ఆర్ట్:రమేష్

ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్: చంద్రారెడ్డి

ప‌బ్లిసిటీ డిజైన‌ర్: వివ రెడ్డి 

నిర్మాత: మరబత్తుల బ్రహ్మానందం 

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: బాబా.పి.ఆర్‌.

Post a Comment

Previous Post Next Post