Home » » T3 is Creating New Trend

T3 is Creating New Trend

 కరీంనగర్ టు రాజమండ్రి

వయా లండన్!!



"టీ-3"తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!!


కప్పుకు రూపాయి మాత్రమే మార్జిన్

రుచి-నాణ్యత-సంతృప్తిలకు 

ప్రధమ ప్రాధాన్యం!!


"టీ" ప్రియుల మనసులు

హోల్ సేల్ గా దోచుకుంటున్న

కరీంనగర్ కుర్రాడు *"కిరణ్ బైరెడ్డి"*


     అతను పుట్టింది దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలోనే అయినా.... అతని ఆలోచనలు మాత్రం అత్యున్నత శ్రేణికి చెందినవి. డిగ్రీ వరకు కరీంనగర్ లో చదివి.... విజయవాడలో "ఐ.సి.డబ్యూ.ఎ.ఐ" చేసి... లండన్ లో "ఎమ్.బి.ఎ" పట్టా పుచ్చుకుని... అక్కడ నాలుగన్నరేళ్లు కొన్ని కొలువులు

చేసినా అతనికి కోరిన సంతృప్తి దొరకలేదు. "ఇక ఇక్కడ పొడిచింది చాల్లే" అని సొంతూరు వచ్చేశాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అతని అర్ధాంగి కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. "నీ మెంటాలిటీకి మోనోటనీగా ఉండే ఉద్యోగాలు సరిపడవులే" అంటూ ఫుల్ సపోర్ట్ చేసింది.

      లండన్ లో ఉండగా పరిచయం అయిన మిత్రుడి ఆహ్వానం మేరకు ఒకపరి "రాజమండ్రి" వచ్చిన ఈ కరీంనగర్ కుర్రాడికి.. ఆ ప్రాంతం, అక్కడి గాలి, నీరుతోపాటు మనుషులూ విపరీతంగా నచ్చేశారు. వాళ్ళ వెటకారం మాటున దాగి ఉండే మమకారానికి ఫిదా అయిపోయాడు.  ఆరునూరైనా అక్కడే సెటిల్ అయిపోవాలని నిర్ణయించేసుకున్నాడు. "చలో రాజమండ్రి" అంటూ అక్కడ వాలిపోయాడు. 

     "ఏం చేయాలా?" అన్న ఆలోచనలు చేస్తూ... స్వతహాగా టీ ప్రియుడైన ఆ యువకుడు... రాజమండ్రి మరియు పరిసర ప్రాంతీయలకు గల "టీ ప్రియత్వం" పసిగట్టేశాడు. "టీ కొట్టు"తో కనికట్టు చేయాలని ఫిక్సయిపోయాడు.  రాజమండ్రిలో ఉన్న 113 టీ స్టాల్స్ లో... వాతాన్నిటికంటే కడు భిన్నంగా... తన టీ కొట్టు ఉండాలని భావించాడు. అందుకోసం ఏకంగా పి.హెచ్.డి లాంటిది చేశాడు. "టైమ్-టేస్ట్-ట్రీట్" అనే నినాదంతో "టీ-3" పేరుతో "టీ స్టాల్" స్టార్ట్ చేశాడు.

      లండన్ లో ఎమ్.బి.ఎ చేసి... అక్కడ ఒక స్థాయి ఉద్యోగాలు చేసి... ఇప్పుడు "టీ కొట్టు" పెట్టడమేంటని అతని భార్య నెత్తీనోరు కొట్టుకోలేదు. "నీ వెనుక నేనున్నాను" అంటూ తోడ్పాటు అందించేందుకు కొంగు బిగించింది అతని బీటెక్ భార్య. కప్పుకు రూపాయి మార్జిన్ ఉంటే చాలు. ఒకసారి మన దగ్గర టీ తాగాక... టీ తాగితే ఇక్కడే తాగాలి అని ఫిక్స్ అయ్యేలా తన "టీ" ఉండాలనే వజ్ర సంకల్పంతో... రాజమండ్రి-తిలక్ రోడ్ దిగువ రోడ్డు-వి.ఎల్.పురంలో టీ స్టాల్ కు శ్రీకారం చుట్టాడు. 10 రూపాయల నుంచి 50 రూపాయలవరకు... ప్రపంచస్థాయి ప్రమాణాలతో... 23 రకాల ఫ్లేవర్స్ లో టీ అందిస్తూ... ఆరు నెలల వ్యవధిలో దేవిచౌక్ లో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో తన "టీ సామ్రాజ్యాన్ని" విస్తరించేందుకు విస్తృత స్థాయిలో ప్రణాళికలు వేస్తున్నాడు.

     ఇప్పటికే 20 మందికి ఉపాధి కల్పిస్తూ... భవిష్యత్తులో కనీసం 2 వేల మందికి జీవనాధారం కావాలన్న ఉక్కు సంకల్పంతో ఉరకలు వేస్తున్న ఈ కరీంనగర్ కోహినూర్ పేరు "కిరణ్ బైరెడ్డి". అతనికి అన్ని విధాలా అండదండలందిస్తున్న అతని అర్ధాంగి పేరు "వినీష బైరెడ్డి". 


*రాజమండ్రి రుణం*

*ఎప్పటికీ తీర్చుకోలేను!!*


      రాజమండ్రితోపాటు... అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలవారంతా "టీ-౩"తో చిక్కని రుచికరమైన అనుబంధాన్ని పెంచుకోవడం వెనుక తను చేసిన రీసెర్చ్ ఎంతో ఉందంటారు కిరణ్ బైరెడ్డి. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో లభించే 140 రకాల టీ పౌడర్స్ నుంచి... పాతిక రకాలు ఎంపిక చేయడానికి తాను చాలా కష్టపడ్డానని, ఖర్చు పెట్టానని చెబుతారు కిరణ్. కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, వైజాగ్ లలో లభించే వందల టీ పొడుల నుంచి అత్యుత్తమమైనవి గ్రహించి... దానికి తనదైన ఫార్ములా మేళవించి చేసిన ప్రయత్నానికి భగవంతుని కరుణ తోడవ్వడంతో చాలా తక్కువ కాలంలోనే "టీ-3" ఒక ట్రెండ్ సెట్టర్ గా మారి... అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని అంటారు. 

      ప్రాంతీయ బేధం చూపకుండా... తనను ఇంతగా ఆదరిస్తున్న రాజమండ్రివాసులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యే కిరణ్... తన విజయంలో తన శ్రీమతి సహాయ సహకారాలు... తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతైనా ఉందని పేర్కొంటారు. సరదాగా ఓ నాలుగు రోజులుండి వెళ్లిపోదామని వచ్చిన నేను... నాలుగు కాలాలపాటు ఇక్కడే ఉండిపోయేందుకు సిద్ధపడతానని కలలో కూడా అనుకోలేదు. ఇక్కడి మనుషుల స్వచ్ఛత, వారు చూపే ప్రేమ, ఆదరణలకు నేను ఫిదా అయిపోయాను. ఉభయ గోదావరి జిల్లాల్లో "టీ-3"ని విస్తరించడం ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం అంటారు బైరెడ్డి.

      నేను స్వతహాగా టీ ప్రియుడ్ని. రోజుకు అయిదారుసార్లు టీ తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అయితే మనం తాగే టీ మనకు మరింత ప్రేరణ ఇవ్వాలి... రోజంతా ఉత్సాహాన్ని ఇవ్వాలనే పట్టుదలతో నేను చేసిన వందల, వేల ప్రయోగాలు సత్పలితాలు ఇవ్వడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని అంటారు కిరణ్. ప్రస్తుతం రెండు స్టాల్స్ నిర్వహిస్తున్న కిరణ్ కు... ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా ఉంది. టీ స్టాల్ తో ట్రెండ్ సృషించడానికి ముందు నుంచే ఆయన రాజమండ్రిలో ఆ బిజినెస్ నిర్వహిస్తున్నారు. "నా టీ స్టాల్ కు రెగ్యులర్ గా వచ్చి టీ సేవించేవాళ్ళు ఎప్పటికీ రొటీన్ ఫీలవ్వకూడదు... అందుకే ఎప్పటికప్పుడు ఫార్ములాలు మారుస్తూ... మరింత రుచికరంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను" అని చెబుతున్న కిరణ్ బైరెడ్డిని... తక్కువ ఖర్చు... ఎక్కువ లాభం గడించగల "ఫ్రాంచైజీల" కోసం...

95021 57052

నంబర్ లో సంప్రదించవచ్చు!!


Share this article :