Sairam Simhadri wants to Test His Luck in TFI

 "ఒక్క ఛాన్స్ ప్లీజ్" అంటున్న

*అమెరికా అబ్బాయి*



     రీల్ లైఫ్ లో హీరో అవ్వడం కంటే ముందు రియల్ లైఫ్ లో హీరో కావడం ముఖ్యమని భావించాడతడు. అందుకోసం కఠోరంగా కృషి చేశాడు. అనుకున్నది సాధించాడు. శ్రీకాకుళం నుంచి అమెరికా వరకు ఎదిగాడు. ఇప్పుడు రీల్ లైఫ్ లోనూ హీరో కావడం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. 

     అతని పేరు "సింహాద్రి". ప్రపంచప్రఖ్యాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో సుశిక్షితుడైన సింహాద్రి చేసే డాన్సులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బైక్ రేసింగ్ లోనూ సిద్ధహస్తుడైన ఈ "సిక్కోలు కుర్రాడికి" విమానాలు నడపడం హాబీ. ఇందుకోసం ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకున్నాడతను.

      తన యాక్టింగ్ టాలెంట్, డాన్సింగ్ స్కిల్స్ కి తగిన మంచి రోల్ కోసం తాను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానని... ఎవరైనా "నిజాయితీ-నిబద్ధత" కలిగిన నిర్మాతలు-దర్శకులు "ఒక్క చాన్స్" ఇస్తానంటే రెక్కలు కట్టుకుని మరీ హైద్రాబాద్ లో వాలిపోతానని అంటున్న "సింహాద్రి"కి అవకాశం ఇవ్వాలనుకునేవారు

Sairam.simhadri@gmail.com

ద్వారా సంప్రదించవచ్చు!!

Post a Comment

Previous Post Next Post