Home » » Lyricist Chandra Bose Launched Kalaya Nijama Song From Vikram

Lyricist Chandra Bose Launched Kalaya Nijama Song From Vikram

  విక్రమ్'లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్



' *విక్రమ్'* చిత్రంలోని " *కలయా నిజమా.."* అంటూ సాగే *లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు.* 

 *నాగవర్మను 

హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో* ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. *హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది.** 

కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.

 *అనంతరం ముఖ్య అతిథి చంద్రబోస్ మాట్లాడుతూ,* "కలయా నిజమా... అనే పల్లవితో సాగే ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు. చిత్రంలో సందర్భాను సారంగా వచ్చే  విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది. హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణంపోశాయి. సినిమా విజయవంతం కావాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా" అని అన్నారు.

 *చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ,* "చిత్రంలో అద్భుతమైన సాహిత్యం కలిగిన ఈ పాటను చంద్రబోస్ గారు ఆవిష్కరించడం ఎనలేని ఆనందంగా ఉంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఏ పాటకు ఆ పాట పోటాపోటీగా అలరింపజేస్తాయి. సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది. అక్టోబర్లో అనుకూలమైన మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.

 *దర్శకుడు హరిచందన్ మాట్లాడుతూ*,"సంగీతభరిత ప్రేమ కథకు థ్రిల్లర్ అంశాలను మేళవించి కొత్తపంధాలో ఈ చిత్రాన్ని మలిచాం. విక్రమ్ అనే ఓ సినిమా రచయిత పాత్ర చుట్టూ తిరిగే ఈ చిత్రకథలోని పాత్రలు సమాజానికి దగ్గరగా... మనం నిత్యం చూసే వ్యక్తుల పాత్రలు మాదిరిగా సహజంగా ఉంటాయి.  తన ప్రేమను సాధించడం కోసం, ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం ఆ సినిమా రచయిత ఏం చేశాడు అన్నది ఆసక్తికరంగా చెప్పాం" అని అన్నారు.

 *సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ,* ఇందులోని ఐదు పాటలు సందర్భానుసారంగా సాగుతూ కథను ముందుకు నడిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చిందని చెప్పగా... *కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ,* ఇందులోని అన్ని పాటలకు తాను కొరియోగ్రఫీ చేశానని అన్నారు.

నాగవర్మ బైర్రాజు, దివ్యాసురేశ్ జంటగా నటించిన ఈ చిత్రంలో   ఆదిత్య ఓం, పృథ్వి రాజ్, సురేష్, చలపతిరాజు, ఖయ్యుమ్, సూర్య, జ్యోతి, తాగుబోతు రమేష్, టార్జాన్, ఫిష్ వెంకట్, చిత్రం బాష, భూపాల్ రాజు, డాన్స్ సత్య, జయవాణి తదితరులు ఇతర ముఖ్యతారాగణం.

ఈ చిత్రానికి సంగీతం: సురేష్ ప్రసాద్, ఛాయాగ్రహణం: వేణు మురళీధర్, ఫైట్స్: శివప్రేమ్, ఎడిటర్ మేనగ శ్రీను, *నిర్మాత: నాగవర్మ బైర్రాజు, దర్శకత్వం హరిచందన్.*


Share this article :