Home » » Good Response for True

Good Response for True





  "ట్రు" లాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకువస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. దర్శకుడు శ్యామ్ మండల




 *గుణశేఖర్, సురేందర్ రెడ్డి , వై వి ఎస్ చౌదరి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఆర్ గారు నిర్మించిన చిత్రం  ‘ట్రు` .



 థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటించారు .








ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్‌, డి ఎస్ రావ్‌, మహేంద్రనాథ్ HM,బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం విడుద‌లై విమర్శకుల ప్రశంసలు అందుకొని "అమెజాన్ ప్రైమ్ " లో టాప్ place లో స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్యామ్ మండల చిత్రం గురించి మాట్లాడుతూ....* 






తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్స్ దగ్గర పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకు సహాయ దర్శకునిగా పని చేసిన నాకు   ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం చిన్నదైనా దాన్ని సద్వినియోగం చేసుకుని "ట్రు " అనే సినిమాని తెరకెక్కించాను. నిర్మాతకు చెప్పిన బడ్జెట్ లొనే మంచి అవుట్ ఫుట్ ఇచ్చాను .


నటీనటుల, చిత్ర యూనిట్ సహకారంతో  కేవలం 15 రోజుల్లోనే షూటింగ్ ని పూర్తి చేయగలిగాను. నన్ను నేను నిరూపించుకోవడానికి నిర్మాత కె.ఆర్  గారు నాకు ఒక అవకాశం  కల్పించారు.ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నిర్మాతని పరిచయం చేసిన ఎడిటర్  జానకిరామారావు గారికి మరియు కెమరామెన్ శివారెడ్డి లకు  నా ప్రత్యేక ధన్యవాదాలు.


హీరో, హీరోయిన్స్ ఇందులో చాలా చక్కగా నటించారు.


ఈ సినిమా తరువాత వారికి మరిన్ని అవకాశాలు తప్పక వస్తాయి.


ఇంతవరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకుని ఓ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ తో ఒక్క క్షణం కూడా మైండ్ ని డైవర్ట్ అవనివ్వకుండా చేసి ఆధ్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా " ట్రు " సినిమాని తెరకెక్కించాను.


ఈ సినిమాని చూసిన ఇండస్ట్రీ లో చాలామంది పెద్దలు " డైరెక్టర్ శ్యామ్ మండల " కు పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి నూతన క్రియేటివ్ దర్శకులని ప్రోత్సహిస్తే డెఫినెట్ గా డిఫరెంట్ చిత్రలొస్తాయనేది మాత్రం వాస్తవం"అని వాళ్లన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.


వాళ్ళు చేప్పినట్లే నాకు మరిన్ని అవకాశాలు వస్తే ఈ సినిమాలాగే డీఫ్రెంట్ కథలను ప్రేక్షకులకు అందిస్తాను.


త్వరలో నేను చేయబోయే ప్రాజెక్ట్స్ విషయాలు తెలియజేస్తాను.


కేవలం మౌత్ పబ్లిసిటీ తో అమెజాన్ ప్రైమ్ (Amazon prime) లో స్ట్రీమ్  అవుతూ 11 వ ప్లేస్ నుండి టాప్ పొజిషన్ కి చేరి ట్రెండ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.


మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షక దేవుళ్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు..




మంచి సక్సెస్ ని అందుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్: mgk ప్రవీణ్, ఎడిటింగ్ : JP, DOP : శివా రెడ్డి శవనం,  ఫైట్స్ : శంకర్,  డాన్స్: కపిల్, ఆర్ట్ : pv రాజు, VFX : చందు, SFX : వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు, ప్రొడ్యూసర్ : KR,  స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల.


Share this article :