Latest Post

Soulful Melody Kanulenduko From Harom Hara Released

 సుధీర్ బాబు, మాళవిక శర్మ, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్‌ఎస్‌సి 'హరోం హర' నుంచి సోల్ ఫుల్ మెలోడీ కనులెందుకో విడుదల



సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'హరోం హర' మ్యూజిక్ ప్రమోషన్స్ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్‌తో ప్రారంభమయ్యాయి. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెకెండ్ సింగిల్‌ని ఈ రోజు విడుదల చేశారు. .


చైతన్ భరద్వాజ్ స్వరపరిచి కనులెందుకో సోల్ ఫుల్ మెలోడీని నిఖితా శ్రీవల్లి,  చైతన్ భరద్వాజ్ అద్భుతంగా అలపించారు. కీబోర్డ్ నోట్స్‌తో పాటు అకౌస్టిక్ గిటార్, బాస్, ఎలక్ట్రిక్ మాండొలిన్ ఇంపాక్ట్ ని పెంచుతుంది. వెంగీ ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించాడు.


సుధీర్ బాబుని బయట కలవడం గురించి మాళవిక హింట్ ఇవ్వడం పాట ప్రారంభమవుతుంది. ఇద్దరూ కలిసి కొంత క్యాలిటీ టైం  గడపడానికి వేర్వేరు ప్రదేశాలకు వెళ్లడంతో వారి ప్రేమ ప్రయాణం ప్రారంభమవుతుంది. పాటలో వారి కెమిస్ట్రీ ప్లజెంట్ గా వుంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కనులెందుకో మంచి కంపోజిషన్ తో ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.


ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా విడుదల తేదీని త్వరలో అనౌన్స్ చేస్తారు మేకర్స్.


చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే హరోం హర కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు చెప్పనున్నారు. సునీల్ కీలక పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ది రివోల్ట్ అనేది ట్యాగ్‌లైన్.


అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.


తారాగణం: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం - జ్ఞానసాగర్ ద్వారక

నిర్మాత - సుమంత్ జి నాయుడు

సంగీతం - చైతన్ భరద్వాజ్

డీవోపీ - అరవింద్ విశ్వనాథన్

ఎడిటర్ - రవితేజ గిరిజాల

బ్యానర్ - శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్

పీఆర్వో - వంశీ శేఖర్


"Pushpa 2: The Rule Title Song on May 1st

 మే 1న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప‌-2 ది రూల్‌ టైటిల్‌ సాంగ్‌ విడుదల



ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ అయినా స‌న్పేష‌న్‌. ఇటీవల  ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్‌కు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్‌ విడుదలైనప్పటి నుండి నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ వన్‌లో వుండి కొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పుష్ప -2  ది రూల్‌ కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. యువ సంగీత కెరటం దేవి శ్రీప్రసాద్‌ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పాటల్లోంచి మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన 20 సెకండ్ల ప్రోమోను బుధవారం విడుదల చేశారు మేకర్స్‌... పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్‌ అంటూ కొనసాగే ఈ టైటిల్‌ సాంగ్‌ ఎంతో పవర్‌ఫుల్‌గా వుండబోతుందని ఈ ప్రొమో చూస్తే తెలుస్తుంది.  ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2  ద రూల్ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

నటీనటులు:

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే

లిరిసిస్ట్: చంద్రబోస్

సీఈఓ: చెర్రీ

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు


First Single 'Kallara' from 'Satyabhama' releasing Tomorrow

 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ "సత్యభామ" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా..' రేపు రిలీజ్



'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా..'ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'కళ్లారా..' పాటను క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాట కాజల్, నవీన్ చంద్ర లవ్ మేకింగ్ సాంగ్ గా ఉండబోతోంది. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు.


“సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా మే 17వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.



 నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు


టెక్నికల్ టీమ్


బ్యానర్: అవురమ్ ఆర్ట్స్

స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క

నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి

కో ప్రొడ్యూసర్ - బాలాజీ

సినిమాటోగ్రఫీ - జి విష్ణు

సీఈవో - కుమార్ శ్రీరామనేని

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

దర్శకత్వం: సుమన్ చిక్కాల


"LOVE ME - If You Dare" releasing worldwide in theatres on May 25th

 మే 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోన్న ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘లవ్ మీ- ఇఫ్ యు డేర్’



టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా మే 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.


రానున్న వేసవిలో వెన్నులో వణుకు పుట్టించేలా ఓ ఆత్మ ప్రేమకథతో బ్లాక్ బస్టర్ సాధిస్తామని దర్శక, నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచుతున్నారు.


ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవినాష్ కొల్ల ఆర్ట్, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.

Unveiling the Raw and Riveting "Padamati Kondallo" By Sai Durga Tej

 సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్  చేతుల మీదగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ విడుదల:



సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు.


అనురోప్ కటారి హీరో గా నటిస్తున్న ఈ ‘పడమటి కొండల్లో’ పోస్టర్ లో తన లుక్, గెట‌ప్‌ చాలా గంభీరంగా ఉన్నాయి, హీరో రౌద్ర రస హావభావాలతో రక్తం అంటిన కత్తి పట్టుకుని నడుస్తున్న పోస్ అది, పెద్ద విద్వంసం జరిగిన ప్రదేశంలో, సినిమాలో ఫైట్ సీన్ లో లుక్ లా ఉంది.  ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ "పడమటి కొండల్లో" సినిమాతో సరి కొత్త ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు పొందుతారని, ఈ చిత్రానికి ఒక మార్క్ ఉంటుంది అని,  యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా కొన‌సాగే ఈ చిత్రంలో వుండే ప్రేమ‌క‌థ ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంటుంద‌ని, సినిమా మొత్తం ఒక డిఫ‌రెంట్ అండ్ విజువ‌ల్ ఫీస్ట్‌లా వుండేలా ప్ర‌దేశంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతామ‌ని,

 భవిష్యత్తులో మరిన్ని అప్డేట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని తెలిపారు.

తారాగణం:

అనురుప్ప్ కటారి

యశస్వి శ్రీనివాస్

శ్రావ్య రెడ్డి

మురళీ కృష్ణం రాజు

లతీష్ జవ్వాది

మురళీ రాజు

స్కయ్

జగదీష్ రెడ్డి

ఆర్.రాము

శివాని నీలకంఠం

భాను

ప్రసాద్

రాంబాబు

లక్కీ


సాంకేతిక నిపుణులు:

దర్శకుడు/సంగీతం: నరేష్ పెంట

నిర్మాత: జయకృష్ణ దురుగడ్డ

సినిమాటోగ్రఫీ: కన్నన్ మునిసామి

ఎడిట‌ర్: బ‌ల్లా స‌త్య నారాయ‌ణ

స్టంట్స్: శ్రీను

సాహిత్యం: సాహిత్య సాగర్

డైలాగ్స్: ఆర్.రాము


కళ: శ్రీను

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: లతీష్ జవ్వాది

కో-డైరెక్టర్: హర్ష.కె

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు

Telugu Film Industry Gears Up for Grand Director's Day Celebrations at LB Stadium, Hyderabad on May 4

మే  4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమక్షంలో ఘనంగా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్

 


దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీని డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను సోమవారం సాయంత్రం నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘం సంక్షేమ నిధికి రెబెల్ స్టార్ ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో



తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మే 4న దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డేను ఘనంగా నిర్వహించబోతున్నాం. మదర్స్ డే, ఫాదర్స్ డే ఉన్నట్లే డైరెక్టర్స్ డే కూడా అంతే పేరు తెచ్చుకోవాలి. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు మొత్తం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో మంచి పేరుంది. ఇప్పటిదాకా మనం డైరెక్టర్స్ డేను ఇండోర్ లో చిన్నగా చేసుకున్నాం. ఈసారి ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. హరీశ్ శంకర్, మారుతి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు బిజీగా ఉన్నా మన అసోసియేషన్ కార్యక్రమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసోసియేషన్ మన కుటుంబం అని ప్రతి ఒక్కరు భావించడం వల్లే ఈ ఈవెంట్ కోసం అందరం కష్టపడుతున్నాం. డైరెక్టర్స్ డే వేడుకల్లో చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.


తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ - డైరెక్టర్స్ డేను ఇప్పటిదాకా మామూలుగా నిర్వహిస్తూ వచ్చాం కానీ ఈసారి డైరెక్టర్స్ అసోసియేషన్ కు కొత్త కమిటీ వచ్చాక చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశాం. మే 4న ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నాం. మన స్టార్స్, దర్శకుల సంఘం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ ఈవెంట్ చేస్తున్నాం. ఇందుకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.


దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ - మన  డైరెక్టర్స్ అసోసియేషన్ లో గతంలోకి ఇప్పటికి తేడా కనిపిస్తోంది. నాలుగు గోడల మధ్యలో మనం ఇన్నాళ్లూ డైరెక్టర్స్ డే జరుపుకున్నాం. ఇప్పుడు ఘనంగా ఎల్బీ స్డేడియంలో చేసుకోబోతున్నాం. ఈ వేడుకలతో మన దర్శకుల సంఘం గొప్పదనాన్ని దేశమంతా చాటి చెప్పాలి. అన్నారు.


దర్శకుడు రాంప్రసాద్ మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే నిర్వహణ అనేది మన అసోసియేషన్ తరపున ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి దర్శకుల సంఘం సత్తా చాటేలా డైరెక్టర్స్ డే వేడుకలు ఉండబోతున్నాయి. 24 విభాగాల నుంచి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ వేడుకల్ని విజయంవంతం చేయబోతున్నాం. అన్నారు.


దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - దర్శకుల సంఘంలో ప్రతి కమిటీ ఈ సభ్యుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడుతూ వస్తోంది. ఈసారి ఉన్న కమిటీ మరింతగా దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈసారి డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా. అన్నారు.



డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ - తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున డైరెక్టర్స్ డే వేడుకల్ని ఈసారి ఘనంగా నిర్వహించబోతున్న మన అసోసియేషన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈ వేడుకలతో మన అసోసియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. అన్నారు.



దర్శకుడు అనుదీప్ కేవి మాట్లాడుతూ - మే 4న జరిగే డైరెక్టర్స్ డే వేడుకల్ని మన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున డైరెక్టర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాం. మన దర్శకులు రకరకాల స్కిట్స్, డ్యాన్సెస్ తో మిమ్మల్ని అలరిస్తారు. మీరంతా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.



తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వశిష్ట మాట్లాడుతూ - ఈసారి డైరెక్టర్స్ డే ఈవెంట్ గ్రాండ్ గా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముగ్గురు డెబ్యూ డైరెక్టర్స్ కు ఒక్కొక్కరికి లక్ష రూపాలయ చొప్పున ప్రోత్సాహకం అందిస్తాం. కొత్త దర్శకులకు ఎంకరేజింగ్ గా ఉండేలా ఈ ప్రైజ్ మనీ ఇస్తున్నాం. డైరెక్టర్స్ డేను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.



దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ - మన దర్శకుల సంఘానికి ఉన్న ఖ్యాతి మరే ఇండస్ట్రీకి లేదు. అత్యధిక సినిమాలను రూపొందించిన దర్శకుడిగా మన దర్శకరత్న దాసరి గారు గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించారు. ఆయన జయంతి అయిన మే 4న మనం డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈసారి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో అవసరంలో ఉన్న ఎంతోమందికి ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ అండగా నిలబడుతుందని ఆశిస్తున్నా. అన్నారు.



దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ - మన ఆలోచనల్ని లక్షలాది మందికి చేరువేసే దర్శకులలో ఒకరిగా ఉన్నందుకు గర్వపడుతుంటాను. డైరెక్టర్స్ డే ఈవెంట్ కల్చరల్ కమిటీలో ఉన్నాను. మన స్టార్ హీరోలను చాలా మందిని పర్సనల్ గా వెళ్లి కలిశారు మన సంఘ సభ్యులు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, శ్రీకాంత్ గారు, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, నాని, సాయి ధరమ్ తేజ్, అల్లరి నరేష్..ఇలా హీరోలంతా వస్తున్నారు. మిగతా స్టార్స్ ను కూడా కలుస్తాం. మనకు బ్లాక్ బస్టర్స్ తీయడం కొత్త కాదు, మే4న జరగబోయే ఈవెంట్ ను కూడా బ్లాక్ బస్టర్ చేద్దాం. అన్నారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఈ ప్రెస్ మీట్ కు వస్తున్న టైమ్ లో ప్రభాస్ గారు కాల్ చేసి 35 లక్షల రూపాయలు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు విరాళంగా ఇమ్మని చెప్పారు. ఆయనకు మనందరి తరుపున కృతజ్ఞతలు చెబుతున్నా. మన అసోసియేషన్ ఇంకా బలంగా ముందుకు వెళ్తుందనే నమ్మకం కలుగుతోంది. అన్నారు.


రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - నాకూ మీ అందరితో కలిసి ఆ వేదిక మీద కూర్చోవాలని ఉంది. నేను దర్శకుడిగా హిట్ సినిమా చేసిన తర్వాత కూర్చుంటాను. మీ అందరిలో ఎంతో ప్రతిభ ఉంది. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఆ ఘనతను మీరంతా తీసుకురావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. అన్నారు.


ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్ ను విజయేంద్రప్రసాద్, హరీశ్ శంకర్ లాంఛ్ చేయగా, డైరెక్టర్స్ డే లోగోను దర్శకుడు రేలంగి నరసింహారావు ఆవిష్కరించారు.



Rebel Star Prabhas Generously Donates Rs 35 Lakh to Telugu Film Directors Association Welfare Fund

 తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సంక్షేమ నిధికి రూ.35 లక్షల విరాళం అందించిన రెబెల్ స్టార్ ప్రభాస్




చిత్ర పరిశ్రమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా అందులో తానూ భాగమవుతుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. అందరి కంటే ముందుగా స్పందిస్తూ తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుంటారు ప్రభాస్. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. దర్శకుల సంఘం సంక్షేమ నిధి కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు.


నిన్న తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన డైరెక్టర్స్ డే ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి ఈ విషయాన్ని సంఘ సభ్యులకు తెలియజేశారు. 35 లక్షల రూపాయల విరాళం అందించిన ప్రభాస్ కు డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు చప్పట్లతో తమ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సపోర్ట్ తో  డైరెక్టర్స్ అసోసియేషన్ మరింత స్ట్రాంగ్ అసోసియేషన్ కావాలని డైరెక్టర్ మారుతి ఈ సందర్భంగా కోరారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రాజా సాబ్ సినిమా తెరకెక్కుతోంది.


Emotional Thriller 'Aarambam' Set for Grand Theatrical Release on May 10


మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ "ఆరంభం"



మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" చిత్ర రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

అనౌన్స్ మెంట్ నుంచి "ఆరంభం" సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో పాటు హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేసిన అనగా అనగా లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైవిధ్యమైన కథా కథనాలతో ఓ డిఫరెంట్ మూవీ చూసిన ఎక్సీపిరియన్స్ ను "ఆరంభం" ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఈ చిత్ర విజయం సినిమా యూనిట్ నమ్మకంతో ఉన్నారు.


నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ - సింజిత్ యెర్రమిల్లి
డైలాగ్స్ - సందీప్ అంగిడి
సౌండ్ - మాణిక ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి
సీఈవో - ఉజ్వల్ బీఎం
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ - అభిషేక్ వీటీ
దర్శకత్వం - అజయ్ నాగ్ వీ

#SK30 Launched Grandly Today

సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, రాజేష్ దండా #SK30 గ్రాండ్ గా లాంచ్



'ఊరు పేరు భైరవకోన' విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం #SK30 కోసం ధమాకా దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ,  హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి వరుస హిట్‌లను అందించిన ప్రొడక్షన్ హౌస్ వారి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయబోతోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.


ఈ రోజు, #SK30 గ్రాండ్‌గా ప్రారంభమైయింది. ముహూర్తం వేడుకకు విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్‌ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు.


త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ #SK30కి కథ, స్క్రీన్‌ప్లే  డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. ఈ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.


యంగ్, టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, నిజార్ షఫీ డీవోపీగా పని చేస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.


సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ గత చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.


తారాగణం: సందీప్ కిషన్, రావు రమేష్


సాంకేతిక విభాగం:

దర్శకత్వం: త్రినాధరావు నక్కిన

బ్యానర్లు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్

నిర్మాత: రాజేష్ దండా

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

సహ నిర్మాత: బాలాజీ గుత్తా

సంగీతం: లియోన్ జేమ్స్

డీవోపీ: నిజార్ షఫీ

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

డిజిటల్: హ్యాష్‌ట్యాగ్ మీడియా 

#Thalaivar171 Titled Coolie Title Reveal Teaser is out now

 సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్, సన్ పిక్చర్స్ #Thalaivar171 టైటిల్ కూలీ, పవర్ ప్యాక్డ్ టైటిల్ టీజర్ విడుదల


జైలర్ మ్యాసీవ్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన 'LCU' తో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేతులు కలిపారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం #Thalaivar171 పవర్ ప్యాక్డ్ టీజర్ ద్వారా టైటిల్ రివీల్ చేశారు

ఈ చిత్రానికి 'కూలీ' అని పేరు పెట్టారు, టీజర్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను స్టైలిష్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది. అతను గోల్డ్ స్మగ్లర్ల డెన్ లోకి ప్రవేశిస్తాడు. బంగారు గడియారాలతో చేసిన గొలుసుతో వారిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ ముఠా బాస్‌ని ఫోన్‌ లో వార్నింగ్ ఇస్తాడు.  .


సూపర్‌స్టార్‌కి ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ ఇంట్రడక్షన్. కూలీ పూర్తి యాక్షన్‌తో నిండిపోతుందని, రజనీకాంత్ తన వింటేజ్ అవతార్‌లో కనిపిస్తారని టీజర్ హామీ ఇచ్చింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది.


2025లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


A Brand New Poster From Jai Hanuman From The PVCU Unveiled, Experience It In IMAX 3D

 హనుమాన్ జయంతి సందర్భంగా విజనరీ ప్రశాంత్ వర్మ ఎపిక్ అడ్వెంచర్ 'జై హనుమాన్' నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల- ఎక్స్పీరియన్స్ ఇన్ IMAX 3D



పాన్ ఇండియా సంచలనం 'హను-మాన్' తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. 'జై హనుమాన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం హను-మాన్‌కి సీక్వెల్. ఇది ప్రీక్వెల్ ముగింపులో అనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్  చేశారు. సినిమా పెద్ద కాన్వాస్‌పై రూపొందనుంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు.


అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిన దర్శకుడు హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో లార్డ్ హనుమాన్ కొండపై చేతిలో గదతో నిలబడి ఉన్నారు. హనుమ ను సమీపించే డ్రాగన్ అగ్నిని పీల్చుకుంటుంది. డ్రాగన్‌లను తొలిసారిగా ఇండియన్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు ప్రశాంత్ వర్మ. టాప్-ఎండ్ VFX , ఇతర సాంకేతికతలతో మనం ఎలాంటి అనుభవాన్ని పొందబోతున్నామో  పోస్టర్ హింట్స్ ఇస్తోంది.


జై హనుమాన్ సినిమా IMAX 3D లో విడుదల కానుంది. ఈ మాగ్నమ్ ఓపస్ ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


ఈరోజు, టీమ్ హను-మాన్100 రోజుల ఈవెంట్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది.

Hanu-Man 100Days Celebrations

 'హనుమాన్' వంద రోజులు ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను. జై హనుమాన్ తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా వుంటుంది: హను-మాన్ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ



హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుంది. ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్: హీరో తేజ సజ్జా  


క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్ నిర్వహించింది.


హనుమాన్ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ నేను నమ్మలేదు. కాకపొతే మీరంతా దాన్ని నిజం చేశారు. ఇంద్ర, సమరసింహా రెడ్డి, నువ్వునాకు నచ్చావ్, ఖుషి, పోకిరి నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. నేను డైరెక్టర్ అయిన తర్వాత సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది. అలాంటి ఈ జనరేషన్ లో వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే చాలా అదృష్టంగా ఫీలౌతున్నాను. హనుమాన్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అని మొదటి నుంచి చెప్పాం. దాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా వుంది. ఈ వంద రోజుల్లో ప్రతి రోజు సినిమా తొలి రోజుకు వచ్చిన స్పందనే లభిస్తోంది. ఇంత అదృష్టాన్ని కల్పించిన హనుమంతుల వారికి, రాములవారికి రుణపడి వుంటాను. తేజ, నిరంజన్ గారు, వరు, సముద్రఖని గారు టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పీవీసియు కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది చాలా కాలంగా కన్న కల. రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నాను. ఈ యూనివర్స్ లో మీరు చేసే పాత్రలు మళ్ళీ రాబోతున్నాయి. సముద్రఖని గారు విభీషుడిగా కనిపించబోతున్నారు. తేజ హను- మాన్ గా కొనసాగుతారు. కొన్ని సర్ ప్రైజ్ పాత్రలు కూడా రాబోతున్నాయి. పీవీసియు లో అన్ని పరిశ్రమల నుంచి చాలా పెద్ద స్టార్స్ కనిపించబోతున్నారు. పీవీసియు నుంచి వచ్చే సినిమాలు మీ అందరి అంచనాలు అందుకొని మిమ్మల్ని ఆనందపరుస్తాయి. తెలుగు ఆడియన్స్ గర్వపడేలా చేస్తామని నమ్మకంగా చెబుతున్నాను.  జైహనుమాన్ ని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ అన్నీ వుంటాయి. మీరు ఇలానే సపోర్ట్ చేసి ఆ సినిమాని వంద రోజులు ఆడేలా చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జైశ్రీరామ్.. జై హనుమాన్' అన్నారు.  



హీరో తేజా సజ్జా మాట్లాడుతూ.. సత్యం థియేటర్లో వంద రోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్ లో హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుంది. 'ఈ జనరేష్ లో వంద రోజులు వున్నది నీకే' ఒకరు మెసేజ్ చేశారు. నిజానికి ఇది నా వంద రోజులు కాదు మీ అందరి వంద రోజులు. ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్. సముద్రఖని గారు మా సినిమాలోకి వచ్చి సినిమా స్థాయిని పెంచారు. నిర్మాత నిరంజన్ గారు చాలా గట్స్ వున్న ప్రొడ్యూసర్. గట్స్ వున్న వాళ్ళకే హిట్స్. అలాంటి గట్స్ వున్న నిరంజన్ గారికి హనుమాన్ మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిరంజన్ గారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రేక్షకులకు పాదాభివందనాలు. ఈ విజయానికి కారణం ప్రేక్షకులే. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' తెలిపారు.


సముద్రఖని మాట్లాడుతూ.. ఈ వేడుకని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా వుంది. ఏదైనా మంచి పని చేయాలంటే దేవుని బ్లెస్సింగ్స్ వుండాలి. ఆ దీవెనలే మా అందరినీ ఒక్క చోటికి చేర్చింది. విభీషునిడి పాత్ర చేయాలంటే మామూలు విషయం కాదు. శ్రీరాముని అనుగ్రహం వుండాలి. నాలో ఆ పాత్రని చూశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇంతనమ్మకం పెట్టుకున్న ప్రశాంత్ కి ధన్యవాదాలు. తమ్ముడు తేజ చాలా కష్టపడ్డాడు.  అందరం ఇష్టపడి కష్టపడ్డాం.  మా నిర్మాతలకు ధన్యవాదలు.టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు లేకపోతే ఈ విజయం లేదు.' అన్నారు.  


నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వంద రోజుల వేడుక నా కాలేజ్ డేస్ లో చూసేవాడిని. నేను నిర్మించిన సినిమా ఇప్పుడు వందరోజుల మైలు రాయిని అందుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ విజయానికి కారణం ప్రేక్షకులు. వారు సినిమాని ఆదరించిన తీరు అద్భుతం. వందరోజుల వేడుక చూస్తుంటే ఇదెక్కడి రెస్పాన్స్ రా మావ అన్నట్టుగా వుంది. ఈ సమ్మర్ లో త్రీడి వెర్షన్ లో వస్తున్నాము. దానికి కూడా ఇదే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాము. మా హీరో తేజ సజ్జా గారు మూడేళ్ళ పాటు చాలా సపోర్ట్ చేశారు. అమృత, వరలక్ష్మీగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అద్భుతమైన పాత్రని పోషించిన సముద్రఖని గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు ప్రశాంత్ మేము ఈ మూడేళ్ళగా నమ్మినది సాధించాం. మా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్  కు ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు.


శ్రీమతి చైతన్య మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి నాడు హనుమాన్ వందరోజుల పండగ జరుపుకోవడం చాలా అనందంగా గర్వంగా వుంది.  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. నిరంజన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా వత్తిళ్ళు ఎదురుకొన్నారు. ధైర్యంగా నిలబడ్డారు. ఆయన్ని చూస్తుంటే గర్వంగా వుంది. నిరంజన్ పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు ప్రశాంత్ పెంచారు. రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ తోడుగా వున్నారు. వుంటారు. మా సూపర్ హీరో తేజ సజ్జా ఇప్పుడు సూపర్ యోధ. తన నుంచి ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మరింతగా వస్తుందని ఆశిస్తున్నాను. మా టీం అంతా చాలా కష్టపడింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ   పేరుపేరునా ధన్యవావాదాలు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు' తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


Dead Pool -wolverine Trailer Launched

 మెస్మరైజ్ విజువల్స్ తో  మార్వెల్ స్టూడియోస్ 'డెడ్‌పూల్ & వోల్వారిన్' ట్రైలర్ విడుదల !!!




మార్వెల్ ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ .


ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.



ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మ‌రోసారి ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు.


జులై 26న డెడ్‌పూల్ & వోల్వారిన్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.


Telugu Trailer : 




Queen of Masses Kajal Aggarwal's "Satyabhama" grand theatrical release on May 17th

 మే 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ "సత్యభామ"




క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.


“సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం డిజైన్ చేసిన వీడియో క్రియేటివ్ గా ఉంది. క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా..అది క్యాలెండర్ లో మే 17 డేట్ ను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. మే 17న “సత్యభామ” సినిమా రిలీజ్ ను ఇలా ఇన్నోవేటివ్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే క్రియేట్ అయిన బజ్ తో “సత్యభామ” సినిమా సూపర్ హిట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.



నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు


టెక్నికల్ టీమ్


బ్యానర్: అవురమ్ ఆర్ట్స్

స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క

నిర్మాతలు : బాబీ తిక్క,  శ్రీనివాసరావు తక్కలపెల్లి

కో ప్రొడ్యూసర్ - బాలాజీ

సినిమాటోగ్రఫీ - బి విష్ణు

సీఈవో - కుమార్ శ్రీరామనేని

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

దర్శకత్వం: సుమన్ చిక్కాల


Natural Star Nani Launched Hilarious Trailer of Aa Okkati Adakku

'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా ప్రామెసింగ్ గా వుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని  



'ఆ ఒక్కటీ అడక్కు'తో ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ప్రేక్షకులని నవ్వించడంతో పాటు మంచి కంటెంట్ చెప్తాను: హీరో అల్లరి నరేష్  



నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన అల్లరి నరేష్, మల్లి అంకం, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ ఆ ఒక్కటీ అడక్కు హిలేరియస్ ట్రైలర్‌


కామెడీ కింగ్ అల్లరి నరేష్  ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు.  మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు


హీరో అన్ మేరిడ్ అని తెలియజేసేలా హిలేరియస్ ఎపిసోడ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు వివిధ అమ్మాయిలచే రిజెక్ట్ అవుతాడు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలమౌతాయి. అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే, రిలేషన్ ని నెక్స్ట్ లెవల్  తీసుకెళ్లడానికి వారికి సమస్య ఉంది.


ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో మల్లి అంకెం ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పారు. కామెడీ సీక్వెన్స్‌లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే అదరగొట్టారు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లాకు కీలక పాత్ర లభించింది. ఆమె పాత్రలో చక్కగా అలరించారు. వెన్నెల కిషోర్,  వైవా హర్షల ప్రజెంస్ తగిన వినోదాన్ని అందిస్తుంది.


సూర్య కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, గోపీ సుందర్ తన స్కోర్‌తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సరైన మూడ్‌ని సెట్ చేశాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.


టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా వుంది. నరేష్ ఇలాంటి వేడుకలకు రమ్మని సాధారణంగా నన్ను అడగరు. అడిగారంటేనే ఈ సినిమా తన మనసుకు ఎంత దగ్గరైయిందో అర్ధమౌతుంది.  'ఆ ఒక్కటీ అడక్కు'.. నరేష్ నాన్న గారు డైరెక్ట్ చేసిన టైటిల్ వాడటం వలన స్పెషల్ కనెక్షన్ వుందని అనుకుంటున్నాను. నరేష్ అద్భుతమైన నటుడు. తను బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేనే కోరాను. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ బ్రేక్ లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఇందులో పెళ్లి కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా వుంది. అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతున్నాను. ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. మే 3న నరేష్ తో కలసి సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. 'ఆ ఒక్కటీ అడక్కు'తనని మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఫారియా అందమైన చిరునవ్వు గల నటి. దర్శకుడు మల్లి గారికి ఆల్ ది బెస్ట్. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నారు. కంటెంట్ ప్రామెసింగ్ అండ్ ఫ్రష్ గా వుంది. ఈవీవీ గారి ఆశీర్వాదం కూడా టీం అందరికీ వుంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు


హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నాని మా ఫ్యామిలీ మెంబర్ లానే వుంటారు. తను ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది.'ఆ ఒక్కటీ అడక్కు' టీం ఎఫర్ట్. రవి గారి మాటలు మల్లి గారి డైరెక్షన్, సూర్య గారి కెమరా వర్క్, చోటా గారి ఎడిటింగ్, నిర్మాత రాజీవ్ గారు.. అందరం కలసి కష్టపడి ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కామెడీ మూవీతో వస్తున్నాను. ఖచ్చితంగా  ఈ సమ్మర్ లో మిమ్మ్మల్ని బాగా నవ్విస్తాను. ఇందులో నవ్విస్తూ మంచి కంటెంట్ కూడా చెప్తాను. తప్పకుండా ఈ సినిమా మే3న చూడండి' అని కోరారు.


హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. 'ఆ ఒక్కటీ అడక్కు' బ్యూటీఫుల్ స్టొరీ, కాన్సెప్ట్. ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ది. మీరంతా చిట్టి చిట్టి అని పిలుస్తారు. సిద్ది అని పిలిచినా బావుటుంది.( నవ్వుతూ). నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు మల్లి గారు, టీం అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు. అందరూ ఇష్టపడే సినిమా ఇది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. నాని గారు సపోర్ట్ చేయడానికి రావడం చాలా స్ఫూర్తిని ఇచ్చింది' అన్నారు.  


నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ.. నాని గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మల్లి చాలా చక్కగా తెరకెక్కించారు. తొలి సినిమా నిర్మాతలమైన మాతో సినిమా చేసినందుకు అల్లరి నరేష్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో వర్క్ చేయడం మంచి అనుభవం. ఫారియాకు మిగతా చిత్ర యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా సందడిగా గోలగా గా ఉంటుంది. వినోదంతో పాటు చివర్లో అందరికీ ఉపయోగపడే మాట వుంటుంది. అందరికోసం తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అన్నారు.


తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ  తదితరులు


సాంకేతిక విభాగం:

దర్శకుడు- మల్లి అంకం

నిర్మాత - రాజీవ్ చిలక

సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి

బ్యానర్ - చిలక ప్రొడక్షన్స్

విడుదల - ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP

రచయిత - అబ్బూరి రవి

ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్

డీవోపీ  - సూర్య

సంగీతం  - గోపీ సుందర్

ఆర్ట్ డైరెక్టర్ - జె కె మూర్తి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అక్షిత అక్కి

మార్కెటింగ్ మేనేజర్ - శ్రావణ్ కుప్పిలి

మార్కెటింగ్ ఏజెన్సీ - వాల్స్ అండ్ ట్రెండ్స్  

పీఆర్వో - వంశీ శేఖర్

పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను


Vishwambhara Massive Interval Stunt Sequence Filmed Outstandingly For 26 Days

 26 రోజుల పాటు అత్యద్భుతంగా చిత్రీకరణ జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' మ్యాసీవ్ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్



మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక.


ప్రస్తుతం టీమ్, టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన హ్యుజ్ సెట్‌లో మ్యాసీవ్ స్టంట్ సీక్వెన్స్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిస్తోంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి, ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ ఫైట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ బ్యాంగ్-ఆన్ కానుంది. ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్‌లో చిత్రీకరించబడింది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే అత్యధికం. ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తవుతుంది. ఈ హైవోల్టేజ్ యూనిక్ యాక్షన్ బ్లాక్ అభిమానులు, మాసెస్ ను  థియేటర్‌లలో మెస్మరైజ్ చేయనుంది.  


విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.


విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.


నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్


సాంకేతిక విభాగం:

రచన & దర్శకత్వం: వశిష్ట

నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్

బ్యానర్: యువి క్రియేషన్స్

సంగీతం: ఎంఎం కీరవాణి

డీవోపీ: చోటా కె నాయుడు

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Amitabh Bachchan takes on the role of Ashwatthama in ‘Kalki 2898 AD’

 'కల్కి 2898 AD'లో అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్ - మధ్యప్రదేశ్‌లోని నెమావార్‌లో మ్యాసీవ్ ప్రొజెక్షన్‌లో అశ్వత్థామ క్యారెక్టర్ గ్రాండ్ లాంచ్



- అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా ఘాట్ నెమావార్ మైదానంలో నడుస్తాడని నమ్మకం


ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ అప్ కమింగ్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. 'కల్కి 2898 AD'లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వత్థామగా మధ్యప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన నెమావార్‌లో మాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. అభిమానులు, స్థానికులు, మీడియా నుండి అపారమైన ప్రేమ, అద్భుతమైన స్పందన లభించింది.


అమితాబ్ బచ్చన్ పాత్ర లాంచ్ కు లొకేషన్‌గా నెమావర్‌ను ఎంచుకోవడం దాని ప్రాముఖ్యతను మరింత గొప్పగా చాటింది. ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నెమవార్‌లో నడుస్తున్నాడని నమ్ముతారు.

 

అమితాబ్ బచ్చన్ తన పాత్ర గ్లింప్స్ ని సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ “ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రం మరెవ్వరికీ లేని అనుభవాన్ని తనకు పంచింది'అంటూ ట్వీట్‌ చేశారు.


అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 AD’ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో గ్లింప్స్ ని లాంచ్ చేసి ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న  బహుభాషా చిత్రం ‘కల్కి 2898 AD' మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్.


Hanu-Man completes 100 Days Run In 25 Centres

 25 సెంటర్లలో 100 రోజుల రన్ పూర్తి చేసుకున్న ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ 'హను-మాన్'



క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హను-మాన్' 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది, ఈ రేంజ్ చిత్రానికి ఇది హ్యూజ్ ఫీట్. పెద్ద సినిమాలకు కూడా 100 రోజులు పెద్ద విజయం. హను-మాన్ మంచి సెంటర్లలో ఈ మైలురాయిని చేరుకుంది.


92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.


రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. సినిమా 1 కోటి ఫుట్‌ఫాల్స్ దాటింది.


ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన 'హను-మాన్' జీ5లో కూడా ప్రసారం అవుతోంది.


The 'Sabari' team has released the song Na Chhei Pattukove

 బిడ్డపై తల్లి ప్రేమ, అనురాగం చూపించే 'నా చెయ్యి పట్టుకోవే...' పాట విడుదల చేసిన 'శబరి' టీమ్



వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి'. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా 'నా చెయ్యి పట్టుకోవే...' పాటను విడుదల చేశారు.


'శబరి'ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఈ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం... ఐదు భాషల్లో విడుదల చేశారు. 'శబరి'కి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమృతా సురేష్ పాడారు. 'శబరి మ్యూజిక్' ఛానల్ ద్వారా సాంగ్ విడుదలైంది.


'నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా...

మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా...

ఓ కొత్త లోకం చేరి తుళ్లి తుళ్లి ఆడుకుందాం ఎంతసేపైనా

నువ్వేమి కోరుకున్నా తెచ్చి ఇవ్వనా...

ఆ నింగి చుక్కలన్నీ తెంచి ఇవ్వనా...

తందానా తాళం వేసి నచ్చిందేదో పాడుకుంటూ

చిందేసి సందడి చేద్దాం కన్నా' అంటూ సాగిందీ గీతం. 


వరలక్ష్మీ శరత్ కుమార్, సినిమాలో ఆమె కుమార్తెగా నటించిన నివేక్ష మీద ఈ పాటను తెరకెక్కించారు. కొడైకెనాల్ కొండల్లో అందమైన ప్రదేశాల్లో ఈ పాట చిత్రీకరణ చేశారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. 


'నా చెయ్యి పట్టుకోవే...' సాంగ్ విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ... ''ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారు తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. తల్లీ కుమార్తె మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కథలో కీలకమైన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మే 3న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.


నటీనటులు:

వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని, బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.


సాంకేతిక బృందం:

ఈ చిత్రానికి రచనా సహకారం: సన్నీ నాగబాబు, పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్, మేకప్: చిత్తూరు శ్రీను, కాస్ట్యూమ్స్: అయ్యప్ప, కాస్ట్యూమ్ డిజైనర్: మానస, స్టిల్స్: ఈశ్వర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మీపతి కంటిపూడి, కో- డైరెక్టర్: వంశీ, ఫైట్స్: నందు - నూర్, కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్ - రాజ్ కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, సంగీతం: గోపి సుందర్, సమర్పణ: మహర్షి కూండ్ల, ప్రొడ్యూసర్: మహేంద్ర నాథ్ కూండ్ల, కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ కాట్జ్.


Beauty Film Launched With Formal Pooja Ceremony

 పూజా కార్యక్రమాలతో బ్యూటీ చిత్రం ప్రారంభం  !!!




డైరెక్టర్ మారుతి టీమ్ ప్రోడక్ట్ మరియు వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న చిత్రం "బ్యూటీ".

ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి, దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీర శంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. 

లవ్ అండ్ ఫ్యామిలీ  ఎమోషనల్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ చిత్రం మే రెండు నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఈ చిత్రానికి ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు  సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.