Emotional Thriller 'Aarambam' Set for Grand Theatrical Release on May 10


మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ "ఆరంభం"



మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" చిత్ర రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

అనౌన్స్ మెంట్ నుంచి "ఆరంభం" సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో పాటు హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేసిన అనగా అనగా లిరికల్ సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైవిధ్యమైన కథా కథనాలతో ఓ డిఫరెంట్ మూవీ చూసిన ఎక్సీపిరియన్స్ ను "ఆరంభం" ప్రేక్షకులకు ఇవ్వబోతోంది. ఈ చిత్ర విజయం సినిమా యూనిట్ నమ్మకంతో ఉన్నారు.


నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ - సింజిత్ యెర్రమిల్లి
డైలాగ్స్ - సందీప్ అంగిడి
సౌండ్ - మాణిక ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి
సీఈవో - ఉజ్వల్ బీఎం
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ - అభిషేక్ వీటీ
దర్శకత్వం - అజయ్ నాగ్ వీ

Post a Comment

Previous Post Next Post