Home » » Amitabh Bachchan takes on the role of Ashwatthama in ‘Kalki 2898 AD’

Amitabh Bachchan takes on the role of Ashwatthama in ‘Kalki 2898 AD’

 'కల్కి 2898 AD'లో అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్ - మధ్యప్రదేశ్‌లోని నెమావార్‌లో మ్యాసీవ్ ప్రొజెక్షన్‌లో అశ్వత్థామ క్యారెక్టర్ గ్రాండ్ లాంచ్



- అశ్వత్థామ ఇప్పటికీ నర్మదా ఘాట్ నెమావార్ మైదానంలో నడుస్తాడని నమ్మకం


ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ అప్ కమింగ్ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. 'కల్కి 2898 AD'లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పాత్రను అశ్వత్థామగా మధ్యప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన నెమావార్‌లో మాసీవ్ ప్రొజెక్షన్ ద్వారా లాంచ్ చేశారు. అభిమానులు, స్థానికులు, మీడియా నుండి అపారమైన ప్రేమ, అద్భుతమైన స్పందన లభించింది.


అమితాబ్ బచ్చన్ పాత్ర లాంచ్ కు లొకేషన్‌గా నెమావర్‌ను ఎంచుకోవడం దాని ప్రాముఖ్యతను మరింత గొప్పగా చాటింది. ఎందుకంటే అశ్వత్థామ ఇప్పటికీ నెమవార్‌లో నడుస్తున్నాడని నమ్ముతారు.

 

అమితాబ్ బచ్చన్ తన పాత్ర గ్లింప్స్ ని సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ “ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రం మరెవ్వరికీ లేని అనుభవాన్ని తనకు పంచింది'అంటూ ట్వీట్‌ చేశారు.


అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 AD’ గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో గ్లింప్స్ ని లాంచ్ చేసి ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న  బహుభాషా చిత్రం ‘కల్కి 2898 AD' మైథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్.



Share this article :